టూత్-పేస్టుతో మీ సౌందర్యాన్ని 5 రకాలుగా పెంపొందించుకోవచ్చు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

టూత్-పేస్టు మన దైనందిన జీవితంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో ఒకటి. టూత్పేస్ట్ ప్రాధమిక ఉపయోగం - మన దంతాలను శుభ్రపరచడం. కానీ చాలా రకాల సౌందర్య ప్రయోజనాల కోసం టూత్పేస్ట్ను ఉపయోగించవచ్చని మీకు తెలుసా ? అవును, మీరు చదివింది నిజమే !

చర్మం, వెంట్రుకలు, పెదవులు మొదలగు వంటి అనేక సాధారణమైన అంశాలకు ఈ దేశీయ ఉత్పత్తిని వాడుకోవచ్చు. ఇలాంటి అన్ని సౌందర్య సమస్యలకు ఒకే పరిష్కారాన్ని మీరు మీ ఇంటిలో కలిగి ఉన్నప్పుడు ఎందుకు సెలూకులకు వెళ్ళాలి ?

Five Beauty Hacks Of Toothpaste

మీ పూర్తి సౌందర్య సంరక్షణ కోసం సహజంగా టూత్ పేస్టు ఉపయోగించటానికి ఇక్కడ 4 రకాల మార్గాలు ఉన్నాయి. ఈ నివారణలను ఆచరించడానికి వెళ్లే ముందు, అన్ని నివారణాల్లో ఉపయోగించే టూత్పేస్ట్ తెల్లగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే అనేక రకాలైన టూత్-పేస్ట్లను గుర్తించినప్పటికీ, తెలుపు రంగులో ఉన్న టూత్పేస్ట్ సౌందర్య ప్రయోజనాలను కలుగజేయడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

కాబట్టి, టూత్-పేస్టు వల్ల మీ అందాన్ని మరింత ఎక్కువగా పెంపొందించేందుకు సహాయపడే ఈ 4 రకాల నివారణులను గూర్చి మీరు తెలుసుకోండి.

1. డార్క్ స్పాట్స్ నివారిస్తుంది :

1. డార్క్ స్పాట్స్ నివారిస్తుంది :

ఈ హోం రెమెడీ ముఖంలో డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ ను నివారించడానికి సహాయపడుతుంది.

కావల్సినవి

1/2 టీస్పూన్ టూత్ పేస్ట్

1/2 టీస్పూన్ టమోటో పేస్ట్

1 టీస్పూప్ బేకింగ్ సోడ

ఎలా చెయ్యాలి

ఎలా చెయ్యాలి

పైన సూచించన పదార్థాలన్నింటిని ఒక బౌల్లో తీసుకుని, మూడు బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపిని తర్వాత ముఖంలో బ్లాక్ స్పాట్స్, ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట అలాగే ఉండనివ్వాలి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారిస్తుంది

మనము పింపుల్స్ మరియు మొటిమల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నాము. అయినప్పటికీ, వాటిని టూత్ పేస్టుతో ఒక రాత్రిపూటలో చికిత్సను చేయటం సాధ్యమే.

కావలసినవి:

2 టీస్పూన్ల - టూత్-పేస్టు

2 టీస్పూన్ల - అలోవేరా జెల్

ఎలా చెయ్యాలి:

ఎలా చెయ్యాలి:

ఒక గిన్నెలో 2 టీస్పూన్ల - అలోవేరా జెల్ను (కలబంద గుజ్జును) మరియు 2 టీస్పూన్లు - టూత్పేస్టును కలపండి. గడ్డలు ఏర్పడకుండా బాగా మెత్తని పేస్టులా కలపాలి. ఒక దూది సహాయంతో మీ ముఖం మీద ఈ పేస్ట్ను మందంగా అప్లై చేయండి. ప్రతిరోజూ పడుకునే ముందు దీన్ని అప్లై చేయండి మరియు మరుసటిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో మీ ముఖమును శుభ్రం చేసుకోండి. మీ ముఖం మీద వున్నా అన్ని పింపుల్స్ మరియు మొటిమలు పూర్తిగా అంతమయ్యే వరకు ఈ పరిష్కారాన్ని ఆచరిస్తూ ఉండండి.

జుట్టు చివర్ల పగుళ్ళను తగ్గిస్తుంది :

జుట్టు చివర్ల పగుళ్ళను తగ్గిస్తుంది :

కేశ సంరక్షణలో, ప్రత్యేకంగా జుట్టు చివర్ల పగుళ్ళను నివారించుట కోసం కూడా టూత్పేస్ట్ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టును మృదువైనదిగా మరియు నష్టాన్ని కలిగించకుండా ఉండటంలో సహాయపడుతుంది.

కావలసినవి:

1 టేబుల్ స్పూన్ - టూత్-పేస్టు

1 అరటి పండు గుజ్జు

ఎలా చెయ్యాలి:

ఎలా చెయ్యాలి:

పైన చెప్పిన విధంగా ఆ రెండు పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, మెత్తని పేస్టులా చేయాలి. ఈ పేస్ట్ ను మీ జుట్టు చివర్లు మాత్రమ మాత్రమే కాకుండా పూర్తిగా మీ జుట్టుకి కూడా అప్లై చేసి, 25 నిమిషాల పాటు మీ జుట్టు బాగా ఆరేటట్లుగా ఉంచిన తరువాత ఒక తేలికపాటి షాంపూతో మీ జుట్టును శుభ్రంగా కడగాలి. ఈ విధంగా మీరు నెలలో కనీసం ఒకసారైనా చేయాలి. మొదటిసారి ఈ పద్ధతిని పాటించిన తరువాత వచ్చే తేడాను మీరే గమనించవచ్చు.

ఆకర్షణీయమైన పెదవుల కోసం :

ఆకర్షణీయమైన పెదవుల కోసం :

టూత్పేస్ట్, మరొక అద్భుతమైన సౌందర్య సాధనంగా పనిచేసే మార్గము ఏమిటంటే, మీ పెదవులను ప్రకాశవంతంగా మరియు గులాబీ రంగులో తక్షణమే కనపడేటట్లుగా చేస్తాయి. ఇది మీ పెదవుల అసమానతలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

కావలసినవి:

1 టీస్పూన్ - తేనె

1 టీస్పూన్ - టూత్-పేస్టు

ఎలా చెయ్యాలి:

ఎలా చెయ్యాలి:

పైన తెలిపిన విధంగా ఆ 2 పదార్థాలను ఒక గిన్నెలోకి తీసుకుని, గడ్డలు ఏర్పడకుండా బాగా కలిపి, మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మీ పెదవులపై బ్రష్తో మృదువుగా రుద్దడం వల్ల, ఊడిపోయేందుకు సిద్ధంగా ఉన్న చర్మపు పొరలను తీసివేయాలి. ఆ తర్వాత మీ పెదవులపై ఈ పేస్ట్ను అప్లై చేయాలి. మంచి ఫలితాల కోసం నెలలో ఒకసారైనా ఈ పద్ధతిని ఫాల్లో అవ్వండి. మీ పెదాలు మృదువుగా, గులాబి రంగులో కనబడటానికి ఈ పద్ధతి బాగా సహాయపడుతుంది.

అవాంఛితమైన వెంట్రుకలను తొలగిస్తుంది :

అవాంఛితమైన వెంట్రుకలను తొలగిస్తుంది :

ప్రతి మహిళ ఎదుర్కొంటున్న ఒక సౌందర్య సమస్య "అవాంఛితమైన జుట్టు పెరుగుదల". ఈ సమస్యను తొలగించడానికి రసాయనికమైన మార్గాలు ఉన్నప్పటికీ, మనము సహజసిద్ధమైన నివారణ మార్గాన్ని ఎంచుకున్నాము. టూత్పేస్ట్తో ఆచరించబడే ఈ చిట్కాను రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల అవాంచిత వెంట్రుకల శాశ్వత నివారణకు మీకు ఎంతగానో సహాయపడుతుంది.

కావలసినవి:

1 స్పూన్ - టూత్ పేస్టు

2 స్పూన్ల - శనగపిండి

4-5 స్పూన్ల - పాలు

ఎలా చెయ్యాలి:

ఎలా చెయ్యాలి:

పైన పేర్కొన్న పదార్ధాలను ఒక గిన్నెలోకి చేర్చి, బాగా కలపాలి. అలా తయారైన పేస్టును మీ చేతి వేళ్ళతో కావలసిన శరీర భాగాలపై వెంట్రుకలను నివారించేందుకు అప్లై చెయ్యండి. 20-25 నిముషాల పాటు అలానే వదిలేయండి. ఆ తరువాత, జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో ఒక దూది సహాయంతో రద్దుతూ ఉండాలి. సరసన ఒక పత్తి ప్యాడ్ తో మిశ్రమం రుద్దు. మెరుగైన ఫలితాలను పొందటానికి వారంలో రెండుసార్లు ఈ పద్ధతిని పాటించండి.

English summary

Five Beauty Hacks Of Toothpaste

Toothpaste is one of the basic ingredients that we use in our everyday life. This common domestic item can be used for several beauty issues, ranging from skin, hair, lips, etc. It can help in removing unwanted hair, reducing split ends, removing pimples and dark spots.
Story first published: Wednesday, March 14, 2018, 7:00 [IST]