ఈ సమ్మర్ లో తాజాగా ఉండేందుకై హోంరెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

రోజువారి జీవితంలో శరీర దుర్వాసన అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ముఖ్యంగా, ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. చిన్నపాటి లేదా అప్పుడప్పుడూ వచ్చే శరీర దుర్వాసనని సాధారణంగానే పరిగణించవచ్చు. అయితే, చెమట విపరీతంగా పట్టడంతో పబ్లిక్ లో కొన్ని ఎంబరాసింగ్ మూమెంట్స్ ను ఫేస్ చేయవలసి వస్తుంది.

స్వేద గ్రంధులు అతిగా పనిచేసినప్పుడు ఘాటైన దుర్వాసన శరీరంలోంచి వస్తుంది. చెమటతో బాక్టీరియా కలిసినప్పుడు దుర్వాసన వస్తుంది. వాతావరణం కూడా ఇందుకు తోడవుతుంది. కేఫైనేటెడ్ బెవెరేజెస్ ను తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన డ్రగ్స్ ను తీసుకోవడం, స్పైసీ ఫుడ్స్ ను తీసుకోవడం వంటివి కొన్ని కారణాలైతే, టైట్ బట్టలను ధరించడం, డీహైడ్రేషన్, స్ట్రెస్ మరియు టెన్షన్, ఆల్కహాల్ ను సేవించడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, హార్మోన్ల అసమతుల్యతలు, ప్యూబర్టీ వంటివి శరీర దుర్వాసనను కలిగించే మరికొన్ని కారణాలు.

Home Remedies To Remain Fresh This Summer

కొన్నిసార్లు, స్ట్రాంగ్ డియోడరెంట్స్ ని వాడిన తరువాత కూడా శరీర దుర్వాసన తగ్గదు. డియోడరెంట్స్ అనేవి ఈ సమస్యకు కేవలం తాత్కాలిక పరిష్కారంగానే పనికొస్తాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అలాగే, చెమట విపరీతంగా పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

హైజీన్ గా ఉంటే శరీర దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కొన్ని మెడికేషన్స్ కూడా ఈ సమస్యను నిర్మూలిస్తాయి. అయితే, కొన్ని నేచురల్ రెమెడీస్ అనేవి ఈ సమస్యను నిర్మూలించడానికి సమర్థవంతంగా తోడ్పడతాయి. కాబట్టి, వీటిని పాటించి ఈ సమ్మర్ లో తాజాగా అలాగే ఫ్రెష్ గా ఉండండి.

1. బేకింగ్ సోడా మిక్స్:

1. బేకింగ్ సోడా మిక్స్:

శరీర దుర్వాసనని తగ్గించడానికి బేకింగ్ సోడా తోడ్పడుతుంది. చర్మంలోంచి మాయిశ్చర్ ను ఇది గ్రహించి బాక్టీరియా ను అంతమొందించి నేచురల్ డియోడరెంట్ లా పనిచేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో నిమ్మరసాన్ని కలపండి. ఈ సొల్యూషన్ ను అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి. అలాగే, చెమట చిందే ఇతర బాడీ పార్ట్శ్ వద్ద కూడా ఈ సొల్యూషన్ ను అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఈ పద్దతిని కొన్ని వారాలపాటు రోజూ పాటించండి.

2. ఆల్కహాల్:

2. ఆల్కహాల్:

శరీర దుర్వాసనను తగ్గించడంలో ఆల్కహాల్ అనేది ముఖ్య రెమెడీగా పనికొస్తుంది. ఇది త్వరగా ఏవాపరేట్ చేస్తుంది. తద్వారా స్మెల్ ను తగ్గిస్తుంది. పోర్స్ ని క్లోజ్ చేయడం ద్వారా చెమట ఉత్పత్తిని తగ్గిస్తుంది.

మీరు చేయవలసిందల్లా ఆర్మ్ పిట్స్ వద్ద కాస్తంత ఆల్కహాల్ ను అప్లై చేసి రబ్ చేయాలి. కొన్ని నిమిషాల తరువాత వాష్ చేయాలి. లేదా కాస్తంత ఆల్కహాల్ ను ఒక మగ్గుడు నీటిలోకి తీసుకుని ఈ సొల్యూషన్ తో ఆర్మ్ పిట్స్ ను శుభ్రం చేసుకోవాలి.

3. ఆపిల్ సిడర్ వినేగార్:

3. ఆపిల్ సిడర్ వినేగార్:

యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి బాక్టీరియా వృద్ధిని అరికడతాయి. తద్వారా చర్మంలోని పిహెచ్ లెవెల్ ను బాలన్స్ చేసి శరీర దుర్వాసనను అరికట్టడానికి తోడ్పడతాయి.

ఒక కాటన్ బాల్ ని ఆపిల్ సిడర్ వినేగార్ లో కలిపి దాంతో అండర్ ఆర్మ్స్ ని రబ్ చేయాలి. ఆ తరువాత 2 - 3 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. తరువాతగా షవర్ తీసుకోవాలి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు పాటించాలి. ఉదయం ఒకసారి అలాగే నిద్రపోయే ముందు ఇంకొకసారి ఇలా పాటిస్తే మీరు ఇంప్రూవ్మెంట్ ను గమనించగలుగుతారు.

4. రోజ్ వాటర్:

4. రోజ్ వాటర్:

రోజ్ వాటర్ అనేది ఎంతో సూతింగ్ రెమెడీ. ఇది అండర్ ఆర్మ్ దుర్వాసనను తగ్గించేందుకు తోడ్పడుతుంది. కాస్తంత రోజ్ వాటర్ ను అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి. ఇది ప్రభావిత ప్రాంతాన్ని డియోడరైజ్ చేస్తుంది. ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని బాత్ టబ్ లో యాడ్ చేస్తే రోజంతా ఫ్రెష్ గా ఉంటారు.

5. టమాటో పల్ప్:

5. టమాటో పల్ప్:

టమాటోలో నున్న ఎసిడిటీ అనేది దుర్వాసనను కలిగించే బాక్టీరియాను ఎలిమినేట్ చేస్తుంది. అలాగే, టమాటోస్ పోర్స్ ని బాగా కుదిస్తాయి. తద్వారా, శరీర దుర్వాసన తగ్గుముఖం పడుతుంది.

టమాటోలో నుంచి పల్ప్ ను సేకరించండి. దీనిని డైరెక్ట్ గా ఆర్మ్ పిట్స్ వద్ద అప్లై చేయండి. పదిహేను నిమిషాల వరకు ఇలా ఉండనివ్వండి. ఆ తరువాత, చల్లటి నీటితో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచండి. ఆశించిన ఫలితాన్ని పొందేవరకు, ఈ రెమెడీని కొన్ని వారాల పాటు ప్రయత్నించండి.

6. నిమ్మ:

6. నిమ్మ:

నిమ్మ అనేది శరీర దుర్వాసనను తొలగించేందుకు ఉపయోగపడే కామన్ రెమెడీ. కొన్ని తరాల నుంచి ఈ రెమెడీను పాటిస్తున్నారు.

ఒక నిమ్మను రెండు భాగాలుగా కట్ చేయండి. ఒక సగాన్ని తీసుకుని అండర్ ఆర్మ్స్ వద్ద రబ్ చేయండి. చర్మంలోకి జ్యూస్ ఇంకిపోయేలా చూడండి. ఈ జ్యూస్ సహజంగా ఆరేవరకు ఆగండి. ఆ తరువాత షవర్ తీసుకోండి. దుర్వాసన పోయేవరకు ఈ రెమెడీని రోజుకు ఒకసారి పాటించండి.

7. లెట్యూస్:

7. లెట్యూస్:

శరీర దుర్వాసనను తగ్గించేందుకు లెట్యూస్ అనేది మంచి హెర్బల్ రెమెడీగా పనిచేస్తుంది. కొన్ని లెట్యూస్ లీవ్స్ ని క్రష్ చేసి వాటినుంచి జ్యూస్ ని సేకరించండి. ఈ జ్యూస్ ని ఆర్మ్ పిట్స్ వద్ద రబ్ చేయండి. బెస్ట్ రిజల్ట్స్ కోసం, స్నానం చేసిన తరువాత ఈ రెమెడీని పాటించండి. లెట్యూస్ జ్యూస్ ను రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోండి.

8. శాండల్ వుడ్ పౌడర్:

8. శాండల్ వుడ్ పౌడర్:

శాండల్ వుడ్ పౌడర్ లో వివిధ బ్యూటీ బెనిఫిట్స్ కలవు. అండర్ ఆర్మ్ స్మెల్ ని తగ్గించేందుకు శాండల్ వుడ్ పౌడర్ తోడ్పడుతుంది.

కాస్తంత శాండల్ వుడ్ పౌడర్ ను అలాగే నీళ్లను కలిపి ఒక పేస్ట్ ను తయారుచేసుకోండి. ఆర్మ్ పిట్స్ వద్ద ఈ పేస్ట్ ను అప్లై చేయండి. బాగా ఆరనిచ్చి ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్ చేయండి.

English summary

Home Remedies To Remain Fresh This Summer

Home Remedies To Remain Fresh This Summer,Body odour is something that most of us face in our daily life, especially during the summers. Mild or occasional body odour can be considered normal. Body odour can be eliminated by maintaining body hygiene and also through other medications.