For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లిప్స్ సమస్యను పరిష్కరించేందుకు తోడ్పడే లెమన్ బ్యూటీ టిప్స్

|

నల్లటి, డల్ మరియు పొడిబారిన లిప్స్ సమస్య నుంచి ఉపశమనం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే. ఎక్కువగా స్మోక్ చేయడం, ఎండలో ఎక్కువసేపు గడపడం, కఠినమైన కెమికల్స్ ను వినియోగించడం, కేఫయిన్ ను తీసుకోవడం వంటివాటివలన డార్క్ మరియు డల్ లిప్స్ సమస్య ఎదురవుతుంది.

పెదవుల వద్ద సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అందువలన, కఠినమైన కెమికల్స్ ను వాడటం వలన ఎండ వలన జరిగే హానీ కంటే ఎక్కువ హానీ జరిగే ప్రమాదం ఉంది. అందువలన, డార్క్ లిప్స్ ను తొలగించేందుకు నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ను వాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ రోజు నిమ్మను వాడటం ద్వారా డల్ మరియు డార్క్ లిప్స్ సమస్యను ఎలా తొలగించుకోవాలి తెలుసుకుందాం.

How To Use Lemon To Treat Dark Lips

నిమ్మలో నేచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇవి స్కిన్ టోన్ ను మెరుగు పరుస్తాయి. అలాగే, నేచురల్ క్లీన్సర్ లా పనిచేసి పేరుకుపోయిన డెడ్ స్కిన్ ను తొలగించి పోర్స్ ను శుభ్రపరుస్తాయి. ఇప్పుడు, రెమెడీస్ గురించి చర్చించుకుందాం.

నిమ్మ మరియు షుగర్:

నిమ్మ మరియు షుగర్:

ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడి కొత్త సెల్స్ ను రిస్టోర్ చేస్తుంది. మొదటగా, నిమ్మకాయను తీసుకొని రెండు సగాలుగా కట్ చేసుకోవాలి. ఒక స్లైస్ పైన కాస్తంత షుగర్ ను చల్లుకోవాలి. దీన్ని అప్పర్ మరియు లోయర్ లిప్స్ పై సున్నితంగా సర్క్యూలర్ మోషన్ లో రబ్ చేసుకోవాలి. ఇది పదిహేను నిమిషాల వరకు అలాగే ఉండాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో పెదవులను శుభ్రపరుచుకోండి. ఈ రెమెడీను వారానికి మూడు సార్లు పాటించండి. గొప్ప ఫలితాలను గమనించండి.

నిమ్మ, తేనే మరియు గ్లిజరిన్

నిమ్మ, తేనే మరియు గ్లిజరిన్

నిమ్మ, తేనే మరియు గ్లిజరిన్ ల కాంబినేషన్ అనేది పెదాలపై నుంచి ట్యాన్ ను తొలగిస్తుంది. ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు తేనెను ఒక పాత్రలోకి తీసుకోండి. నిద్రపోయే ముందు పెదాలపై ఈ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి ఉదయాన్నే నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఈ పద్దతిని ప్రతిరోజూ నిద్రపోయే ముందు పాటిస్తే అద్భుతమైన ఫలితాన్ని గమనించగలుగుతారు.

Most Read:కీళ్ళవాతం (గౌట్) నుంచి ఉపశమనాన్ని అందించే 10 ఎసెన్షియల్ ఆయిల్స్

నిమ్మ మరియు క్యాస్టర్ ఆయిల్:

నిమ్మ మరియు క్యాస్టర్ ఆయిల్:

డార్క్ లిప్స్ సమస్యను ఈ సింపుల్ రెమెడీతో పరిష్కరించుకోవచ్చు. ఒక పాత్రలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ను తీసుకోండి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. అవసరమైతే నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి ఉదయాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవచ్చు. లేదంటే పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవచ్చు. ఆ తరువాత లిప్ బామ్ ను అప్లై చేయాలి.

నిమ్మ మరియు ఆల్మండ్ ఆయిల్:

నిమ్మ మరియు ఆల్మండ్ ఆయిల్:

ఆల్మండ్ ఆయిల్ తో మిక్స్ చేసిన నిమ్మరసం అనేది పెదాలను నరిష్ చేసి హైడ్రేట్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ మరియు లెమన్ జ్యూస్ లను ఈక్వల్ క్వాన్టిటీలలో తీసుకోండి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి రెండు నుంచి మూడు నిముషాలవరకు మసాజ్ చేయండి. నలభై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా కూడా పెదవులపై ఉంచి ఆ మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవచ్చు.

Most Read: నా కోడలు నా కొడుకుతో ఎప్పుడు పడుకోవాలనే విషయాన్ని వాళ్ల అమ్మను అడుగుతోంది

నిమ్మ మరియు టర్మరిక్:

నిమ్మ మరియు టర్మరిక్:

తాజా నిమ్మరసంలో చిటికెడు పసుపును జోడించి పదార్థాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయాలి. పదిహేను నిమిషాలవరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తొలగించడానికి చల్లటి నీటిని ఉపయోగించాలి. ఈ ప్రాసెస్ ను ప్రతి రోజూ పాటిస్తే మెరుగైన ఫలితాల్ని పొందగలుగుతారు.

English summary

How To Use Lemon To Treat Dark Lips

How To Use Lemon To Treat Dark Lips,Dark, dull and dry lips is something that we don't wish to have. Of course those pink and glossy lips have always been attractive. Here are some tips using lemon to treat dark lips
Story first published: Monday, October 22, 2018, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more