For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ తో జుట్టు నల్లగా...దట్టంగా..పొడవుగా

|

Carrot Oil make Hair Grow Faster
జుట్టు అందం ముడిచినప్పుడు, వాటి ఆరోగ్యం దువ్వినప్పుడు తెలుస్తుందంటారు. సమయానుకూలంగా నీళ్ళు పోసి, ఎరువు వేస్తే మొక్క ఎలా ఏపుగా పెరుగుతుందో, కనీస జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అంత అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగడం కోసం ఎన్నో రకాలు చిట్కాలు చదివాం..పాటించాం కూడా. అయితే క్యారెట్ కూడా జుట్టుకు సంరక్షణ నిస్తుందని తెలియదు....క్యారెట్ వేసవిలో జుట్టు సంరక్షణకు చాలా దోహదపడుతుంది.

వేసవిలో జుట్టు ఎండిపోయి చివరలు చీలుతుంటాయి. క్యారెట్‌ ఆకులు అటువంటి జుట్టుకు మంచి కండిషనర్‌ గా పనిచేస్తాయి. ఆరు క్యారెట్‌ ఆకులకు ఒక టీ స్పూన్‌ నువ్వుల నూనె చేర్చి మిక్సీలో ముద్ద చేయాలి. ఈ నూనెను తలకు రాసుకుని పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపుగా పెరుగుతుంది.

పెసర పిండిలో క్యారెట్ ఆకులు, నువ్వులనూనె కలిపి ముద్ద చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చిన నీటితో స్నానం చేస్తే జుట్టు చివరలు చీలికలను ఆపి, జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది ఈ పేస్టు.

పైన చెప్పిన వాటితో తైలం కూడా చేసుకోవచ్చు. అరకిలో నువ్వుల నూనెను సన్నని మంటమీద కాచాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల మెంతులు, పావు టీ స్పూన్‌ మిరియాలు, క్యారెట్‌ ఆకుల ముక్కలు వేసి సువాసన వస్తున్నప్పుడు దించేయాలి. చల్లారాక వడపోసి సీసాలో పోసి పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు రాసుకుని శీకాయి లేదా షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా దట్టమైన మేఘంలాగా పెరుగుతుంది. ఈ నూనెను కనుబొమలు, కనురెప్పలకు రాసుకుంటే అవి కూడా నల్లగా, అందంగా పెరుగుతాయి.

English summary

Carrot Oil make Hair Grow Faster and Longer... | క్యారెట్ ఆకులతో జుట్టు సంరక్షణ

Since carrots contain invaluable nutrients like glucose, iron, copper, Vitamins C, D, E, K and most importantly carotene, face masks made made of carrot can help in nourishing the skin in a natural radiant way. Mix the carrot oil with a mashed ripe avocado, apply it to the hair, and leave it for 1 hour before your rinse it off.
Story first published:Saturday, March 10, 2012, 16:34 [IST]
Desktop Bottom Promotion