For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతలకు రకరకాల కారణాలు...?

|

How to Prevent Balding Hair...!
కురులకు కొత్త సొగసులు అద్దుకునేందుకు నేటి యువతరం ఆసక్తి చూపుతోంది. చిన్నతనంలోనే వెంట్రుకలు రాలిపోవడం..నగర జీవన విధానంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో బట్టతల వచ్చేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి...ఇటీవలి కాలంలో మధ్య వయస్కులతోపాటు యువత, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్ట రాలిపోవడం ఒకటి. గతంలో ఈ సమస్య నుండి బయటపడేందుకు విగ్‌లు పెట్టుకోవడం, హెయిర్‌ స్ప్రేస్‌ వాడడం వంటివి చేసేవారు. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక అధునాతన పరిశజ్ఞానం బట్టతలతో బాధపడుతన్న వారి సమస్యలను సులువుగా తీర్చగలుగుతోంది.

కొందరిని గమనించే ఉంటారు. తలలో అక్కడక్కడా జుట్టు పూర్తిగా రాలిపోయి కేవలం మాడు మాత్రమే కనిపిస్తుంటుంది. ప్యాచ్‌ల్లా కనపడతాయి. దీనిని అరికట్టేందుకు అందుబాటులో ఉన్న చికిత్స హెయిర్ ప్లాంటేషన్. దీన్ని ఒకటి రెండు సిటింగ్‌లలో చేస్తారు. జుట్టును అమర్చే చోట మత్తుమందు ఇస్తారు. ఇప్పుడు తలలో మిగిలిన భాగంలో ఆరోగ్యంగా ఉన్న శిరోజాలను తీసుకుని లేనిచోట అమరుస్తారు. అయితే దీన్ని ఒకటి రెండు విడతల్లో చేయించుకంటే సరిపోతుంది. అయితే ఇంటివంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే హెయిర్ ఫాలింగ్ అరకట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

1. ముఖ్యంగా షాంపూలను, హెయిర్‌ ఆయిల్స్‌ను మార్చుతూ, ప్రయోగాలు చేయడం మంచిది కాదు. దానివల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
2. ఎక్కువగా హెయిర్‌ ఫాల్‌ ఉంటే వెంటనే డాక్టర్స్‌ను సంప్రదించడం ద్వారా సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. డాక్టర్‌ సలహా మేరకు రక్తపరీక్షలు చేయించుకు విటమిన్స్‌, ఐరన్‌ టాబ్లెట్స్‌ వాడాలి.
3. ధైరాయిడ్‌ వంటి వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారిలో హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్‌ గట్టిగా చేసే షాంపూలు వాడుతూ అవసరం మేరకు కండీషనర్స్‌ కూడా వాడాలి.
4. జుట్టు ఆయిలింగ్‌, మసాజ్‌లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్‌ లాస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే గమంచి, అరికట్టగలిగితే చాలా వరకు బట్టతల రాకుండా వారించవచ్చు.
5. హర్మోన్స్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ కు సంబంధించిన చికిత్స తీసుకునే వారిలో జుట్టు రాలడం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లలో, జీవనవిధానంలో కొద్దిపాటి మార్పులు తీసుకుంటే చాలా వరకు జుట్టు రాలడం నివారించవచ్చు.

English summary

How to Prevent Balding Hair...! | బట్టతలను అరికట్టే మార్గాలు...!

Hair Loss: Some men gradually lose their hair over the front, top, and crown of their head, but most men still do not understand the root cause of hair loss this is called male pattern baldness. Usually this is genetic. Hair transplantation: there are two procedures in hair transplantation fue and fut techniques.
Story first published:Monday, May 14, 2012, 17:35 [IST]
Desktop Bottom Promotion