For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో తలలో చెమట...జుట్టు సంరక్షణ...!

వేసవిలో తలలో చెమట...జుట్టు సంరక్షణ...!

|

Tips to avoid hair sweating in Summer Season
ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది వెంట్రుకలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారవుతాయి. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్‌ కిరణాల కారణంగా కొనలు చిట్లి, పొడిబారినట్లు కనిపిస్తాయి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ కురులు పట్టుకుచ్చుగా వుంటాయి.

1. వేసవిలో రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు ఇతర ప్రాడెక్టుల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా హెయిర్‌ డ్రైని వాడకూడదు. హెయిర్‌ స్ప్రేలు వాడటం తగ్గించాలి.
2. వేసవిలో చెమట నుంచి జుట్టును రక్షించేందుకు రెండురోజులకొకసారి షాంపూ చేయాలి. షాంపూ చేసిన ప్రతిసారీ కండీషనర్‌ ను తప్పనిసరిగా వాడాలి. ఇవి జట్టులోని తేమను కోల్పోకుండా నిగనిగలాడేలా చేయడమేకాక ఒత్తుగా, పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది.
3. వేసవి వచ్చేసరికి అందరూ స్విమ్మింగ్‌ పట్ల ఆసక్తి చూపుతారు. స్విమ్మింగ్‌ పూల్‌ నీళ్లలో కలిపే క్లోరిన్‌ జుట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి స్విమ్మింగ్‌ క్యాప్‌ తప్పనిసరిగా ధరించాలి.
4. వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది. కొబ్బరినూనెను కానీ మరే ఇతర హెయిర్‌ ఆయిల్‌ ను కాని గోరువెచ్చగా చేసి కురులకు పట్టించి మర్దనా చేసి టవల్‌ ను గట్టిగా చుట్టాలి. తర్వాత షాంపూ చేయాలి.
5. కొబ్బరినీళ్లు, పళ్లరసాలు, సలాడ్లను తరచూ తీసుకుంటుండాలి. ఇవి చర్మం ఇంకా కేశాలు పొడిబారకుండా నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి.
6. ఎక్కువ మోతాదులో నీరును తాగాలి. శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పంపబడుతుంది కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం చాల మంచిది.

వీటితోపాటు పుష్టికరమైన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. అవకాయలో చర్మం ఇంకా జుట్టుకు అవసరమైన ఎన్నో పోషక తత్త్వాలు లభిస్తాయి. ఇది చర్మాన్ని, ఇంకా జుట్టులోని తేమతత్త్వాలు కోల్పోకుండా సంరక్షిస్తుంది. చర్మం తాజాగా వుండేలా చేయడమే కాక నిగారింపునిస్తుంది.

English summary

Tips to avoid hair sweating in Summer Season | వేసవిలో తలలో చెమట...

Is the sweating excessive hair that makes these beautiful braids you love, stickiness and unbearable to the point that you wish you were bald. Well that transpiration summers is really hard to avoid the scorching heat, yet, we can reduce the to some extent with these simple tips.
Desktop Bottom Promotion