Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
ఒత్తిడిని తగ్గించుకో.. జుట్టురాలడాన్నిఅరికట్టు..!
ఈ మధ్యకాలంలో స్త్రీలలో జుట్టు రాలటం సర్వ సాధారణమైపోయింది. అదే ఉద్యోగినులైతే ఈ సమస్య మరింత అధికం. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవడానికి టైమ్ లేదంటారు . ముఖ్యంగా, నిద్రలేమి, సరిగా విశ్రాంతి ఉండటం లేదు. అదే ఉమ్మడి కుటుంబాలైతే మరింత ఒత్తిడి అధికం. ఉద్యోగినులకు ఆఫీస్ పనులలో ఒత్తిడి, ప్రమోషన్లకై ఆరాటం, పోటీ కారణంగా దిగులు, నెలనెలా ఋతుక్రమ సమయంలో ఒత్తిడి, చిరాకు, అభద్రతా భావన, వారిలో గోచరిస్తాయి. వీటి కారణంగా శిరోజాలపై ప్రభావం వుంటుంది.
చుండ్రు సమస్యవుంటే ఒత్తిడి పెరిగి జుట్టు రాలుతుంది. ఓ పక్కన అత్తింటి వారింట్లో పనులు, మరొక ప్రక్క పిల్లలను సముదాయించడం, భర్త అవసరాలు చూడటం అలా రోజంతా బిజీ బిజీ. దీనితో ఒత్తిడి మరింత పెరిగి శిరోజాలు రాలిపోతుంటాయి. ఉద్యోగినులు సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలి. లేకపోతే ‘ఎనిమియా 'కు లోనగుతారు. కాలక్రమేణా జుట్టురాలి పోతుంది. చిన్న వయస్సులోనే వయస్సు మీద పడుతున్నట్లు లక్షణాలు కనబడుట. ఈ లక్షణాలన్నింటిని తీరా మీకు తీరని నష్ట కలిగినంత తర్వాత మనం తెలుసుకోగలుగుతాం. జుట్టు రాలడం అనేది ఒక్క ఒత్తిడి వల్ల మాత్రమే కాదు మరిన్ని ఇతర ప్రభావాల వల్ల కూడా జుట్టుకు నష్టం వాటిళ్ళు తుంది. కాబట్టి జుట్టురాలడాన్ని వెంటనే పసిగట్టి అందుకు కారణం ఏంటో తెలుసుకొని జుట్టును కాపాడుకోవడం మంచిది. ఒత్తిడి వల్ల జుట్టు రాలడం మాత్రమే కాదు జుట్టు మీద ఇతర ప్రభావాలేంటో... ఎలా ఉంటాయో తెలుసుకోండి.
గ్రే హెయిర్: ప్రస్తుకాలంలో 20 ఏళ్ళకే కేశాలు రంగు మారుతున్నాయి. ఇలా ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ ఉందన్న స్ట్రెస్ హెయిర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. మీరు పనిచేసే చోటో పని ఒత్తిడి మరియు లక్ష్యాలను భయపడటం, వంటి వాటి వల్ల మీలో త్వరగా మీ బాస్, మధ్య వయస్సు వలే లేదా గ్రే హెయిర్ ఉన్నవారిలా మీరు కనబడవచ్చు.
జుట్టు రాలడం: ఒత్తిడి వల్ల శరీరంలోని న్యూట్రీషియన్స్ అన్ని మాయం అవుతాయి, దానికి తోడు కేశాలకు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో మీ జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. మీకు ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేదా ఏ ఇతర కారణాలు లేకుండానే అధికంగా జుట్టు రాలుతుంటే కనుక దానికి ప్రధాన కారణం ఒత్తిడే(స్ట్రెస్). ఈ ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్స్ లో అసమతుల్యత వల్ల జుట్టు అధికంగా రాలడానికి కారణం అవుతుంది.

అకాలంలోనే(తక్కువ వయస్సులోనే)బట్టతల: ఇలా చిన్న వయస్సులోనే బట్టతల రావడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది ఖచ్చితంగా స్ట్రెస్ యొక్క ప్రధాన లక్షణమనే చెప్పవచ్చు. చాలా వరకూ అధిక ప్రొఫైల్ కార్పొరేట్ స్థానాల్లో పని చేయడం వల్ల అధిక ఒత్తిడికి గురికావల్సి వస్తుంది. అధిక ఒత్తిడి వల్ల మీకు నడి నెత్తి మీద నుండి జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది.
చిట్లిన వెంట్రుకలు: కొంత మందిని గమనించినట్లైతే గ్రేహెయిర్ తో పాటు వెంట్రుకలు చిట్లడం, డ్యామేజ్ అవ్వడం వంటి సమస్య ఉంటుంది. ఇటువంటి జుట్టు ఉండటానికి కారణం స్ట్రెస్ మరియు ఏజింగ్. ఒత్తిడి మిమ్మల్ని వయస్సు మీద పడ్డవారుగా కనబడేలా చేస్తుంది. అందువల్లే హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది.
పొడి బారిన తల చర్మం: పొడి బారడం అనేది అనారోగ్యకరమైన కేశాలకు చిహ్నాం. ఒత్తిడి వల్ల ఏర్పడే హార్మోనుల అసమతుల్యత వల్లే కేశాలు పొడి బారడం, తలమాడు పొడిబారడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications
