జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్ ఫ్రూట్స్ చాలా అవసరం..

By Sindhu
Subscribe to Boldsky

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది ఒక్క మహిళలల్లోనే కాదు, పురుషుల్లో కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా అందుకు కారణం వంశపారంపర్యం, ఒత్తిడి, ఆహార అసమతుల్యతలు మరియు ఎక్కువ స్థాయిలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉండటం. ఈ కారణాల చేత జుట్టు రాలిపోతుంటే కనుక మీరు మీ జుట్టును కాపాడుకోవడానికి తిరిగి కొత్త జుట్టు పెరగడానికి పండ్లు బాగా సహకరిస్తాయి.

ప్రతి రోజూ ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలకు ఎలా ఉపయోగపడుతాయో... అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడుకోవచ్చు.ప్రతి రోజూ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పండ్లలో ఉన్న విటమిన్స్ మరయు మినిరల్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అటువంటివి కొన్ని మీకోసం.....

ఆరెంజ్ /విటమిన్ సి: కురుల పెరుగుదలకు బయోప్లెవనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణను అంధించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీరు తినేటటువంటి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రికాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.

క్యారెట్/ బీటా కెరోటీన్: శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మార్చి శరీరానికి అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను)సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ క్యాన్టలూపే(దోసకాయలో)అధికంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీ/ ఫోలిక్ ఆసిడ్: ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా అంటే విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురుకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

కివి/విటమిన్ ఇ: విటమిన్ ఇ వల్ల తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణకు కావల్సినంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు మామిడి పండ్లు, కివి పండ్లు రెండూ అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉండి. కురుకు పెరగడానికి దోహదం చేస్తుంది.

అరటి/మెగ్నీషియం: మెగ్నీషియం కూడా ఆరోగ్యకరమైన కురుల పెరుగుదలకు బాగా దోహదపడుతుంది. అందుకు అరటి పండులో కావల్సినన్ని మినిరల్స్ అందుతాయి. తర్వాత అత్తిపండ్లు మరియు ఆర్టిచోక్స్ లో కూడా అధికంగా మెగ్నీషియం ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

కీరదోసకాయ/ఇన్ అసిటోల్: విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. దీని తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా ఉండేటటువంటి దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడం మంచిది.

ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఐరెన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది. కేశాలకు తగినంత రక్త ప్రసరణ జరిగేందుకు కావల్సిన హెయిర్ పాలిసెల్ కు కావల్సిన న్యూట్రియట్స్ ను అందజేస్తుంది.

ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు. ఈ పండులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి మరియు సి, ఫోలిక్ ఆసిడ్స్, జింక్, సోడియం, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం ఇందులో కంటే అరటిపండులో 80శాతం అధికంగా ఉంటుంది. ఈ పండులో ఉన్నా ఈ విటమిన్స్, న్యూట్రిషయన్స్ అన్నీ కూడా కురులు పెరగడానికి బాగా దోహదపడుతాయి.

పీచెస్: ఇందులో ఐరన్, హీమోగ్లోబిన్ పెంచడానికి ఎసెన్సియల్స్, ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ అందించుటలో ఈ ప్రూట్స్ బాగా ఉపయోగపడుతాయి. అనీమియాతో బాధపడేవారికి కావలసినంత ఐరన్ ను అందిస్తుంది. జుట్టు పెరగుదలకు, వెంట్రుకలకు కావలసిన విటమిన్స్ అందజేస్తుంది.

గుమ్మడి/జింక్ కోసం: జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్ తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషేన్ సిఫార్సు చేస్తోంది. జింక్ కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Fruits to Promote Hair Growth and Stop Hair Fall | కురుల పెరుగుదలకు విటమిన్ ఫ్రూట్స్...!

    Hair loss affects both men and women and can be caused by heredity, stress, malnutrition and high levels of dihydrotestosterone (DHT). Whether you are losing your hair or just want longer or thicker hair, eating fruits high in certain vitamins and minerals, such as vitamins C and E, can promote hair growth.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more