Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడానికి ఉత్తమ చిట్కాలు
అమ్మాయిలకు జుట్టు పొడవుగా ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. జుట్టు పొడవుగా ఉండే అమ్మాయింటే అబ్బాయి ఎక్కువగా ఇష్టపడుతారని కూడా అంటుంటారు. అయితే అలాంటి పొడవు జుట్టు ఉన్నవారిని ఈ మద్యకాలంలో చాలా అరుదుగా చూస్తున్నాము. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కొంత మంది జుట్టును పాడు చేసుకుంటే, మరికొంత మందికి జీవనశైలిలో మార్పలు, నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతున్నట్లు ఎక్కువ మంది చెబుతుంటారు.
ముఖ్యంగా వింటర్ సీజన్ లో మరింత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుంది. చలికాలంలో జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని రెమెడీస్ ను ఉన్నాయి. చలికాలంలో వీచే కఠినమైన గాలుల తలలోకి నేరుగా చేరడం వల్ల ఈ కఠినమైన గాలులు తల మాడును డ్రైగా మార్చడం వల్ల హెయిర్ రూట్స్ ను వీక్ గా మార్చుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తలలో డస్ట్ చేరడం వల్ల హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. ఈ సమయంలో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత నష్టం జరిగే ప్రమాధం ఉంది. అందుకు కొన్ని వింటర్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెమెడీస్ ఉపయోగించడం వల్ల జుట్టు చాలా త్వరగా మరియు మందంగా నేచురల్ గా పెరుగుతాయి. కాబట్టి, ఈ చిట్కాలు ఖచ్చితంగా ఉపయోగపడుతాయి.
మీ జుట్టు నేచురల్ గా మందంగా, మంచి షైనింగ్ తో కనిపించాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది. చలికాలంలో తలకు ఎక్కువగా నూనె రాయడం మరియు హెయిర్ స్ప్రేస్ ఉపయోగించడం మంచిది కాదు. ఈ క్రింది సూచించిన రెమెడీస్ జుట్టు వేగంగా పెరగడానికి మరియు మందంగా పెరగడానికి సహాయపడుతాయి. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం...

రెగ్యులర్ ట్రిమ్మింగ్:
ప్రతి 6 నుండి 8 వారాలకొకసారి జుట్టును ట్రిమ్ చేయడం వల్ల జుట్టు రూట్స్ నుండి చివరి వరకూ వేగంగా పెరుగుతుంది. తరచూ ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లడాన్ని నివారించవచ్చు.

హాట్ ఆయిల్ మసాజ్:
జుట్టు మందంగా మరియు వేగంగా పెరగాలంటే కనీసం వారానికొకసారైనా హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు యొక్క స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. హెయిర్ రూట్స్ కు రక్తప్రసరణ మెరుగ్గా ఉండి, జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

జుట్టుకు గుడ్డు:
ఎగ్ వైట్ లో ఉండే హీలింగ్ ప్రొపర్టీస్ గురించి మనకు తెలిసిందే. గుడ్డును జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. అంతే కాదు సాఫ్ట్ గా మారుతుంది. కాబట్టి, మీ జుట్టుకు ఎగ్ వైట్ అప్లై చేయడం ఒక ఉత్తమ పద్దతి. దీని ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుంది.

బ్రష్ కేర్:
ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం తలను దువ్వుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ పెరిగి హెయిర్ ఫాలిసెల్స్ చురుగ్గా మారి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బ్లో డ్రైయ్యర్ కు దూరంగా:
జుట్టు ఆరబెట్టుటకు బ్లో డ్రయ్యర్ ను వాడకుండటం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. రెగ్యులర్ హెయిర్ డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు ఎక్కువ హాని కలుగుతుంది. సాధ్యమైనంత వరకూ బ్లో డ్రయ్యర్ వాడకాన్ని మానేయాలి.

పొటాటో రైస్ :
జుట్టుకు పోషకాలను అందివ్వడం అనేది ఒక బెస్ట్ హోం రెమెడీ. తగినన్ని పోషకాలు అందండం వల్ల జుట్టు మందంగా..త్వరగా నేచురల్ గా పెరుగుతుంది. పొటాటో ఉడికించిన నీటిని తలకు పట్టించడం వల్ల జుట్టు పొడవుగా మరియు బ్యూటిఫుల్ గా పెరుగుతుంది. అందుకు బంగాళదుంపలోని స్ట్రార్చ్ బాగా సహాయపడుతుంది.

నేచురల్ ఆయిల్ :
ల్యావెండర్, రోజ్మెరీ మరియు కొబ్బరి నూనెలు ఒక బెస్ట్ నేచురల్ ఆయిల్స్. వీటిని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల జుట్టు మందంగా నేచురల్ గా పెరుగుతుంది.

ఉల్లిపాయ రసం:
కొద్దిగా నీటిలో ఉల్లిపాయలు వేసి ఉడికించి ఆ నీటిని తలకు జుట్టుకు పట్టించాలి. అలాగే ఉల్లిపాయలను మిక్సీలో పేస్ట్ చేసి అలా వచ్చే రసాన్ని కూడా నేరుగా తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల మరియు స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.

జుట్టుకు ఆల్కహాల్:
నెలకొక సారి ఒక గ్లాసు బీర్ తో తలను వాష్ చేయాలి. ఒక గ్లాస్ బీర్ ను వాటర్లో మిక్స్ చేసి తలకు పోసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది.

వెనిగర్:
వెనిగర్ మరో హోం రెమెడీ. వెనిగర్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్ అందివ్వడంతో పాటు, సాఫ్ట్ గా మార్చుతుంది.

కండీషనర్:
జుట్టుకు ఎప్పుడూ కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కండీషనర్ తలకు అంటకుండా చేయాలి. కండీషనర్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

ప్రతి రోజూ తలస్నానం చేయాలా?:
ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో మరియు కేశాల్లో నేచురల్ ఆయిల్స్ ను కోల్పోతుంది. దాంతో జుట్టు నేచురల్ షైనింగ్ ను కోల్పోతుంది. దాంతో మీ జుట్టు చూడటానికి డల్ గా కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

హ్యాట్స్:
డైరెక్ట్ సన్ లైట్ నుండి జుట్టుకు రక్షణ కల్పించడానికి ఒక మంచి హ్యాట్ ను ఉపయోగించాలి. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.

తడి జుట్టు సీక్రెట్:
తడిగా ఉన్న జుట్టును ఎప్పుడు కూడా దువ్వకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువగా చిట్లడం జరుగుతుంది. కాబట్టి నేచురల్ గా జుట్టు ఆరిన తర్వాత తలను దువ్వుకోవాలి.

సిల్కీ పిల్లో కవర్స్:
కాటన్ పిల్లో కవర్స్ కు బదులుగా సిల్క్ పిల్లో కవర్స్ ను ఎంపిక చేసుకోవాలి. కాటన్ కవర్స్ కంటే సిల్క్ కవర్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండదు.

ఒత్తిడి తగ్గించుకోవాలి:
మీ జుట్టు మందంగా మరియు షైనీగా లేకపోవడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

పౌష్టికాహారం:
వేళకు భోజనం, పౌష్టికాహారం తీసుకోవడం, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల జుట్టు వేగంగా మరియు మందంగా పెరగడానికి సహాయపడుతుంది.

నిద్ర:
రోజుకు 7-8గంటలు నిద్రతప్పనిసరిగా అవసరం అవుతుంది. ప్రతి రోజూ సరైన నిద్రను పొందడం వల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications











