For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనె జుట్టుకు మంచిదని తెలిపే 5 గొప్ప కారణాలు

|

ప్రకృతి పరంగా ప్రసాధించిన బ్యూటీ వస్తువులలో కొబ్బరి నూనె ఒక మంచి బహుమతి మనకు. కొబ్బరి నూనెను బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను వివిధ రకాలు గా ఉపయోగించుకోవచ్చు మంచి ఫలితాన్ని పొందవచ్చు. బ్యూటీ విషయంలో శరీరంలో అన్ని భాగాలకు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. మరియు దీని వలన అనేక ప్రయోజనాల పొందవచ్చు. కొబ్బరి నూనె నేచురల్ గా యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్నది. అలాగే lauricఆమ్లంను కూడా కలిగి ఉన్నది . ఇది జుట్టు పెరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఇతర నూనె కంటే కొబ్బరి నూనె కేశాలకు అతి త్వరగా పడుతుంది.

కొబ్బరినూనె కేశాలకు చాలా అద్భుతంగా పనిచేసి కేశాలకు మంచి షైనింగ్ తో పాటు నునుపుదాన్ని అంధిస్తుంది. కొబ్బరి నూనెలో కేశాలకు అవసరం అయ్యే ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల కేశాలు ఒత్తుగా పెరగడానికి మరియు సాఫ్ట్ గా ఉండటానికి, జుట్టు రాలడం తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో మరో అద్భుత గుణం చుండ్రును వదిలించే లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి, వారానికొకసారి తలకు కొబ్బరి నూనెను పెట్టుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కొబ్బరి నూనె తలకు పెట్టుకోవడం వల్ల కలిగే ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు క్రింది విధంగా...

5 Reasons Coconut Oil Is Good For Hair

1. జుట్టు చిక్కు లేదా ముడులు పడకుండా సహాయపడుతుంది: మీ జుట్టు చిందరవందరగా మారి లేదా ముడులు, లేదా చిక్కు ఎక్కువగా పడటం నివారించాలంటే, జుట్టుకు క్రమతప్పకుండా వారానికొకసారి కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. దాంతో మీ జుట్టు ముడులు లేదా చిక్కు పడకుండా ఉండటమే కాకుండా, ఇంతముందు ఉన్న చిక్కును సులభంగా వదిలిస్తుంది.
2. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది: కొబ్బరి నూనె తరచూ తలకు పట్టించడం వల్ల హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది. కేశ కణాలు చాలా డ్రైగా ఉంటే కొబ్బరి నూనె అది స్ట్రాంగ్ గా చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కొత్తగా వచ్చే కేశ కణాలను మరింత స్ట్రాంగ్ గా పెరిగేలా చేస్తుంది.
3. జుట్టు రాలడం తగ్గించడానికి సహాయపడుతుంది: ఈ మద్యకాలంలో స్త్రీ, పరుషుల ఇరువురిలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. కాబట్టి, అలా జుట్టు రాలనివ్వకుండా, హెయిర్ రూట్స్ ను బలంగా మార్చడానికి కొబ్బరి నూనె గొప్పగా సహాయపడుతుంది. ఇంకా మీరు తలస్నానం చేసే ప్రతి సారి, తలస్నానం చేయడానికి 1 గంట ముందు కొబ్బరి నూనెను తలకు పట్టించడం వల్ల కేశాలు బలంగా మారుతాయి.
4. చుండ్రును వదిలిస్తుంది: జుట్టు సమస్యల్లో మరో సమస్య చుండ్రు . ప్రస్తుత రోజులో పోషకాహార లోపం, విటమిన్స్, హార్మోనుల లోపం, మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వల్ల చుండ్రు సమస్య చాలా మందిలో అధికంగా ఉంది. ఈ సమస్యను నివారించుటకు వారానికొకసారి కొబ్బరి నూనెను తరచూ తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీరు కొన్ని వారాల తర్వాత ఫలితాన్ని చూడవచ్చు.
5. మంచి షైనింగ్ ను అంధిస్తుంది: కొబ్బరి నూనెను తరచూ తలకు అప్లై చేయడం వల్ల కేశాలకు నేచురల్ షైన్ వస్తుంది.

English summary

5 Reasons Coconut Oil Is Good For Hair

You might have seen tons of advertisements on television stating that coconut oil is good for your hair. Though you might have ignored that boring and repeated advertisement like a million times, you should have at least once paid attention to what they are actually advising you on.
Story first published: Tuesday, May 6, 2014, 17:43 [IST]
Desktop Bottom Promotion