For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయ స్త్రీల కేశ సౌందర్యం యొక్క టాప్ 10 రహస్యాలు...

|

ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే మన ఇండియన్ స్త్రీలకు జుట్టు అందంగా...ఒత్తుగా...పొడవుగా ఉంటుందని అంటుంటారు. అలాంటి అందమైన జుట్టు పెరుగుదల వెనకు ఒక పెద్ద సీక్రెట్టే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి నిగనిగలాడే అందమైన జుట్టును పొందడానికి మన ఇండియన్ మహిళలు నేచురల్ రెమెడీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ముఖ్యంగా అలాంటి హోం రెమెడీస్, నేచురల్ రెమెడీస్ లో ఆమ్లా, శీకాకాయ్, కొబ్బరినూనె వంటివి తప్పనిసరిగా ఉంటాయి....

READ MORE: జుట్టు పెరుగుదలకు 30 వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

రసాయనిక షాంపులను ఉపయోగించకుండా ఇలాంటి హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్లే అలాంటి అందమైన ప్రకాశవంతమైన జుట్టు సొంతమవుతుందని చెప్పవచ్చు . మరో విషయం ఏంటంటే, మన ఇండియన్ స్త్రీలు ప్రతి రోజూ తలస్నానం చేయరు, మరియు తలస్నానానికి హాట్ వాటర్ ను ఉపయోగించకపోవడం కూడా జుట్టు పెరుగుదల రహస్యంలో ఒక కారణం కావచ్చు . ఇలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వల్లే మన ఇండియన్ స్త్రీలు అందమైన కేశ సౌందర్యంను కలిగి ఉన్నారు.

READ MORE:జుట్టు సంరక్షణకు అద్భుతంగా సహాయపడే అలోవెరా జెల్

భారతీయ స్త్రీల కేశసౌందర్యం వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఈ క్రింది విధంగా...

ఆరోగ్యకరమైన నూనెలు:

ఆరోగ్యకరమైన నూనెలు:

కొబ్బరి నూనె మరియు ఆముదం నూనెను కొన్ని వేల సంవత్సరాల నుండి కేశాలకు ఉపయోగిస్తున్నారు. ఈ రెండు నూనెలను మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు మరింత ఉత్తమంగా పెరుగుతుంది. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు పట్టించే ముందు గోరువెచ్చగా చేయాలి.

జుట్టు సమస్యలను నివారించే నేచురల్ పదార్థాలు:

జుట్టు సమస్యలను నివారించే నేచురల్ పదార్థాలు:

చుండ్రు, డ్రై హెయిర్ లేదా రఫ్ హెయిర్ మరియు చిట్లిన జుట్టును నివారించుకోవడానికి ఇండియన్ స్త్రీలే ఏమాత్రం కెమికల్ ప్రొడక్ట్స్ ను ఇష్టపడరు. ఈ సమస్యలను నివారించుకోవడానికి ప్రక్రుతిసిద్దంగా లభించే ఆమ్లా, హెన్నా మరియు నువ్వుల ననూనె ఉపయోగించి ఈ హెయిర్ సమస్యలకు చెక్ పెడుతారు.

హెయిర్ వాష్ ట్రిక్స్ :

హెయిర్ వాష్ ట్రిక్స్ :

భారతీయ స్త్రీలు ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకు కారణం అయ్యే రహాస్యాల్లో ఒకటి. ఒక వారంలో రెండు సార్లు తలస్నానం చేయడం, అందుకు నేచురల్ షాంపును ఉపయోగించడం మరియు నేచురల్ కండీషనర్ ను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మంచి షైనింగ్ తో నిగనిగలాడుతూ అందంగా కనబడుతుంది.

వాటర్ :

వాటర్ :

తలస్నానానికి ఉపయోగించే నీరు సాప్ట్ వాటర్ అయినట్లైతే జుట్టు ఆరోగ్యంగా పెరుగుటకు ప్రోత్సహిస్తుంది . హార్డ్ వాటర్ , బోర్, బావీ నీళ్లు జుట్టును మరియు జుట్టు యొక్క ఫాలీ సెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి మరియు జుట్టు చిట్లడానికి కారణం అవుతాయి. . ప్రతి ఒక్క ఇండియన్ మహిళ జుట్టు పెరుగుదల రహాస్యాలలో ఇది ఒకటి.

నేచరల్ షాంపు:

నేచరల్ షాంపు:

భారతీయ స్త్రీలు, తలస్నానానికి ఉపయోగించే నేచురల్ పదార్థాల్లో శీకాకాయ, కుంకుడుకాయ చాలా ఉత్తమమైనవి . శీకాకాయ ఇది ఒక నేచురల్ ఉత్పత్తి . ఇది జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

తలదువ్వుడంలో మెలుకువలు:

తలదువ్వుడంలో మెలుకువలు:

వెడల్పాటి దువ్వెనతో తలను దువ్వడం మరింత ఉత్తమం మరియు సురక్షితం. ఇండియన్ మహిళలు తడి జుట్టును దువ్వకపోవడం కూడా జుట్టు పెరుగుదలకు గల రహస్యం. . జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు చిట్లడం మరియు జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

చిట్లిన జుట్టును ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయడం:

చిట్లిన జుట్టును ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయడం:

భారతీయ స్త్రీలు చాలా మంది అమావాస్య రోజును కేశాలను ట్రిమ్ చేయడం లేదా కట్ చేయడం వల్ల బాగా పెరుగుతాయన్న ఒక నమ్మకం చాలా మందిలో ఉండి.

సన్ లైట్:

సన్ లైట్:

భారతీయ మహిళలు తలస్నానం చేసిన తర్వాత ఎలాంటి హీట్ ప్రొడక్ట్స్ లేదా డ్రైయర్స్ ఉపయోగించకుండా, నేచురల్ సన్ లైట్ లో కేశాలను తడి ఆర్పుకుంటారు.

నిద్ర:

నిద్ర:

భారతీయ మహిళలకు అందమైను జుట్టును కలిగి ఉండటకు మరో కారణం , వారు నిద్రించే ముందు ఎలాంటి క్లిప్స్, బ్యాండ్స్, లేదా హెయిర్ బ్యాండ్స్ ను ఉపయోగించకపోవడం. నిద్రించే సమయంలో లూజ్ హెయిర్ ను ఇష్టపడుతుంటారు. అలా చేయడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ముడులు:

ముడులు:

జుట్టు తరచూ చిక్కుబడటం, ముడులుగా , డ్రైగా ఉండటం, చేతి వేళ్ళతో వాటిని నెమ్మదిగా తీయడం వల్ల జుట్టు రాలడంను అరికట్టవచ్చు.

English summary

10 Secrets Behind Every Indian Woman's Hair: Hair Care Tips in Telugu

10 Secrets Behind Every Indian Woman's Hair: Hair Care Tips in Telugu, It is rightly said that Indian women have the best features in the world and one of them being great hair. Indian women have a long list of secrets when it comes to their lustrous hair.
Desktop Bottom Promotion