For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వండర్ ఫుల్ గా జుట్టు రాలడం తగ్గించే 10 కామన్ ఫుడ్స్

|

జుట్టు రాలడం అనేది ఒక సంకేతంగా గుర్తించాలి . నిద్రించే పిల్లో మీద, స్నానం చేసే బాత్ రూమ్ లో తలదువ్వుకొనే డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఎక్కడపడితే అక్క జుట్టు రాలి ఉండటాన్ని చూస్తే? ఖచ్చితంగా ఆందోళ చెందుతారు. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని వివిధ రకాల ట్రీట్మెంట్లు, డైట్ లో మార్పులు, ఇతర చిట్కాలను ఉపయోగిస్తుంటా. అయితే ఇలా సెడన్ గా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు వేగంగా తీసుకొనే నిర్ణయాల వల్ల జుట్టుకు మరింత నష్టం కలగవచ్చు.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

హెయిర్ ట్రీట్మెంట్లు, మెడిసిన్స్, స్పాల చుట్టూ తిరగకుండా ..జుట్టు రాలడానికి ముఖ్య కారణాన్ని కనుగొనాలి. కారణం ప్రారంభదశలోనే గుర్తించినట్లైతే చికిత్సనందివ్వడం సులభం అవుతుంది. దాంతో మరింత హెయిర్ ఫాల్ డ్యామేజ్ అవ్వకుండా జుట్టును కాపాడుకోగలం. జుట్టు రాలడానికి వివిధ కారణాలున్నాయి. అందులో పౌష్టికాహార లోపం కూడా ఒకటి. సరైనా ఆహారంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే జుట్టు రాలడం అరకట్టవచ్చు.

చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?

జుట్టుకు పోషణను అందించే మరియు జుట్టును స్ట్రాంగ్ మార్చి, హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి కొన్ని కామన్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎపెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆ కామన్ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

గుడ్డు:

గుడ్డు:

జుట్టు రాలడం అరికట్టడంలో గుడ్డు గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే గుడ్డులో అధికమొత్తంలో న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్(బి7 లేదా బయోటిన్, బి12, డి) మినిరల్స్(ఐరన్, జింక్) ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉన్నాయి . ఇవి జుట్టు రాలడం అరికట్టి , జుట్టును స్ట్రాంగ్ గా , పొడవుగా, ఒత్తుగా, హెల్తీగా పెరగడానికి సహాయపడుతాయి.

లీన్ మీట్:

లీన్ మీట్:

లీన్ పౌల్ట్రీ మీట్ లో బెస్ట్ క్వాలిటీ ప్రోటీనులున్నాయి. ఇవి హెల్త్ హెయిర్ పొందడానికి వివిధ రకాలుగా సహాయపడుతాయి. ప్రోటీనుల లోపం వల్ల హెయిర్ ఫైబర్స్ ను బ్లాక్ చేస్తుంది. అందువల్ల మన రెగ్యులర్ డైట్ లో ఈ న్యూట్రీషియన్ లోపం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. చర్మరంద్రాలు మూసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ మరింత తీవ్రం అవుతుంది. అలా జరగకూడదనుకుంటే లీన్ మీట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఆయిలీ ఫిష్:

ఆయిలీ ఫిష్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నా చేపలను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది. దాంతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది . ఇంకా జుట్టు వాల్యూమ్ మరియు షైనింగ్ పెరుగుతుంది. కాబట్టి, ఆయిలీ ఫిష్ సాల్మన్, మకరేల్, సార్డిన్స్ ను రెగ్యులర్ గా తినాలి.

 గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్:

నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీనులు, విటమిన్ బి5, విటమిన్ డి, మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . హెయిర్ ఫాలీసెల్స్ యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఫలితంగా జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ ఆరోగ్యానికి అమేజింగ్ ఫుడ్ . వీటిలో ఎక్కువగా విటమిన్స్ (బి1, బి6, బి7, బి9, ఇ), ప్రోటీన్స్, న్యూరిషింగ్ ఆయిల్స్, మరియు మెగ్నీషియం అధికంగా ఉండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

లెంటిల్స్:

లెంటిల్స్:

లెంటిల్స్ రిచ్ ప్రోటీన్ ఫుడ్స్, మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో లెంటిల్స్ ను జోడించడం వల్ల ఫ్రీక్వెంట్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది . మరియు ఇందులో విటమిన్ బి7, విటమిన్ బి9, ఐరన్, మరియు జింక్ ఎక్కువగా ఉన్నాయి. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది .దాంతో హెయిర్ రూట్స్ హెల్తీగా ఉంటాయి . జుట్టు రాలడం తగ్గుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫ్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. రెగ్యులర్ గా గ్రీన్ లీఫ్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీనులు, విటమిన్స్ (ఎ, బి9, సి)పుష్కలంగా అందుతాయి. మినిరల్స్ (క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం), ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు నేచురల్ మాయిశ్చరైజర్స్ అందుతాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.

క్యారెట్ :

క్యారెట్ :

విటమిన్ లోపం వల్ల హెయిర్ ఫాల్ తీవ్రంగా ఉంటుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చేరి ఆరోగ్యానికి , అందానికి సహాయపడుతాయి. ముఖ్యంగా తలలో డ్రైనెస్ ను పోగొడుతుంది . క్యారెట్ తినడం వల్ల తలలో తేమను పొందవచ్చు దాంతో డ్రైహెయిర్, జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

క్యారెట్స్ లాగే, స్వీట్ పొటాటోలో కూడా బీటా కెరోటీన్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే విటమిన్ ఎ' గా మన శరీరంలో మారుతుంది . ఇది డ్రైహెయిర్ ను నివారించి అనారోగ్యకరమైన హెయిర్ ఫోలిసెల్స్ ను నివారిస్తుంది. దాంతో హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు,

ఓట్స్:

ఓట్స్:

హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఓట్స్ సహాయపడుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఓట్స్ లో ఐరన్, జింక్, ఓమేగా 3 ప్యాటీ యాసిడ్స్, ఫాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైరీ ఫైబర్లు అధికంగా ఉన్ానయి . ఇవి హెయిర్ ఫోలిసెల్స్ నుండి గ్రహించి జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.

English summary

TOP 10 Common Foods That Treat Hair Loss Wonderfully

TOP 10 Common Foods That Treat Hair Loss Wonderfully,Losing hair at an alarming rate? Finding hair everywhere -from your pillows to your bathroom floor? You can actually stop it by modifying your diet to some extent.
Story first published: Thursday, December 17, 2015, 17:53 [IST]
Desktop Bottom Promotion