For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారించి, షైనీగా మార్చే హెయిర్ మాస్క్

|

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెర్సటైల్‌ అనే పదార్థంతో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి. శరీరం మాదిరి వాటికీ పోషక విలువలు అవసరం. సహజంగా రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలతాయి. అయితే అంత కంటే ఎక్కువ రాలినపుడే సమస్యగా భావించాలి.

జుట్టు రాలడానికి అనేక కారణాలున్నా, జుట్టు రాలుతున్నా, ఉన్న జుట్టును ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి మరియు షైనింగ్ ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పట్టుకుచ్చులా ఉండాలని వివిధ రకాల షాంపులను ప్రయత్నిస్తుంటారు . అయితే డబ్బు వేస్ట్ తప్ప తగిన ఫలితం మాత్రం ఉండదు.

పొడవైన షైనింగ్ హెయిర్ పొందాలంటే 15 నేచురల్ టిప్స్

జుట్టుకు నేచురల్ గా మంచి మెరుగుపును తీసుకురావడం ఎలా? కొన్నిఎఫెక్టివ్ నేచురల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఉన్నాయి. ఇవి జుట్టును మంచి షైనింగ్ తో మరియు సాఫ్ట్ గా మెరిపిస్తుంటాయి. . ఈ నేచురల్ రెమెడీస్ డ్రై మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తాయి....

కొన్ని సందర్భాల్లో మనం కమర్షియల్ కెమికల్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించి మన జుట్టును షైనీగా మార్చుకుంటుంటాము. ఈ ప్రొడక్ట్స్ జుట్టుకు కేవలం తాత్కాలిక షైనింగ్ ను మాత్రమే అందిస్తుంది. అయితే దీర్ఘకాలంలో ఇది జుట్టును డ్యామేజ్ చేస్తుంది.

జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

కాబట్టి, రసాయనికి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా నేచురల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు సురక్షితం మరియు మీ జుట్టును మీరు హెల్తీగా, మంచి మెరుపుతో, పోషణతో కాపాడుకోవచ్చు. జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందినప్పుడు జుట్టు ఆటోమాటిక్ గా జుట్టు మెరుస్తుంటుంది. మరియు ఆ ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఏంటో ఒకసారి ఈ క్రింది స్లైడ్ ద్వార చూద్దాం....

అరటి, తేనె మరియు బాదం:

అరటి, తేనె మరియు బాదం:

రెండు చెంచా తేనెలో ఒక చెంచా బాదం ఆయిల్ మిక్స్ చేసి అందులో బాగా పండిన అరటి పండును వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా ఒక నెలపాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కాఫీ హెయిర్ మాస్క్:

కాఫీ హెయిర్ మాస్క్:

కాఫీ డికాషన్ ను తయారుచేసి, చల్లార్చాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత కాఫీ డికాషన్ ను ఒక మగ్గు నీళ్ళలో పోసి తలారా పోసుకొని అరగంట తర్వాత తిరిగి మంచినీటిని శుభ్రం చేసుకుంటే జుట్టు ఒత్తుగా మరియు మంచి షైనింగ్ తో కనబడుతుంది . అంతే కాదు ఇది జుట్టును డార్క్ గా మరియు మంచి హెయిర్ కలర్ ను అందిస్తుంది.

నిమ్మరసం మరియు వెనిగర్ హెయిర్ మాస్క్:

నిమ్మరసం మరియు వెనిగర్ హెయిర్ మాస్క్:

ఇది ఆయిలీ హెయిర్ మరియు డ్యామేజ్ జుట్టుకు చాలా ఉత్తమమైనది. కొద్దిగా వెనిగర్ తీసుకొని అందులో లెమన్ జ్యూస్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిచాలి. తర్వాత మసాజ్ చేయాలి . ఇది మీ జుట్టును హెల్తీగా మరియు షైనీగా మార్చుతుంది . సాఫ్ట్ హెయిర్ కు ఇది ఒక బెస్ట్ హోం మేడ్ హెయిర్ మాస్క్ .

మెయోనైజ్ మరియు అవొకాడో ఆయిల్ హెయిర్ మాస్క్:

మెయోనైజ్ మరియు అవొకాడో ఆయిల్ హెయిర్ మాస్క్:

ఒక కప్పు మెయోనైజ్ లో రెండు చెంచాలా అవొకాడో ఆయిల్ మిక్స్ చేసి, దీన్ని మీ జుట్టుకు పట్టించాలి. నాలుగు గంటలసేపు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత తలకు హాట్ వాటర్ లో డిప్ చేసి కాటన్ టవల్ ను తలకు చుట్టాలి.

 ఆలివ్ ఆయిల్ ఎగ్ హెయిర్ మాస్క్:

ఆలివ్ ఆయిల్ ఎగ్ హెయిర్ మాస్క్:

మూడు చెంచాల ఆలివ్ ఆయిల్ ను రెండు గుడ్డు మిశ్రమంలో మిక్స్ చేసి తలకు పట్టించాలి . 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డైగా మారిని మీ జుట్టును మంచి షైనింగ్ తో సాఫ్ట్ గా మార్చుతుంది . షైనీ హెయిర్ పొందడానికి ఇది ఒక ఉత్తమ హెయిర్ మాస్క్.

 వోడ్క మరియు అవొకాడో హెయిర్ మాస్క్:

వోడ్క మరియు అవొకాడో హెయిర్ మాస్క్:

అవొకాడోను మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు అందులో గుడ్డు పగులగొట్టి వేసి, రెండు చెంచాల తేనె మరియు కొద్దిగా ఓడ్కా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

వెనిగర్ హెయిర్ మాస్క్ :

వెనిగర్ హెయిర్ మాస్క్ :

తడిగా ఉన్న జుట్టు మీద కొద్దిగా వెనిగర్ ను స్ప్రే చేసి 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా ఒక నెలపాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. డ్రై డ్యామేజ్ హెయిర్ కు కూడా చాలా ఉత్తమమైనది.

పెరుగు హెయిర్ మాస్క్:

పెరుగు హెయిర్ మాస్క్:

పెరుగును జుట్టుకు మరియు తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది మరియు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ మాస్క్ ......

English summary

8 Homemade Hair Masks For Shiny Hair: Beauty Tip in Telugu

Every girl wants to have shiny hair. Always changing shampoos and thinking that it will make your hair shine is a waste of your money. How to get shiny hair naturally? There are some effective natural homemade hair masks for soft shiny hair. These natural remedies for shiny hair also treats dry and damaged hair.
Desktop Bottom Promotion