For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ పదార్థాలు కొబ్బరినూనెకు జోడిస్తే జుట్టుకు మంచిది ?

By Nutheti
|

కొబ్బరి నూనె జుట్టుకి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. పూర్వకాలంలో శరీరానికి కూడా కొబ్బరినూనె అప్లై చేసేవాళ్లు. చర్మంతో పాటు, జుట్టుని కూడా స్మూత్ గా చేయడానికి ఈ కొబ్బరినూనె సహాయపడుతుంది.

తాజాగా ఉండే కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు, తలలో ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి, చుండ్రు సమస్యలు తగ్గించడానికి, జుట్టు చిట్లిపోవడాన్ని అరికట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనెకు కొన్ని పదార్థాలు కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మరింత లాభాలు పొందవచ్చు.

hair

తాజా పెరుగుకి కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవడం వల్ల ఆయిలీ జుట్టు నుంచి విముక్తి పొందవచ్చు. ఎక్కువ జిడ్డుతనాన్ని తగ్గించి జుట్టుకి సహజ మెరుపునిస్తుంది కొబ్బరినూనె. ఇలాంటి మాస్క్ లు చాలానే ఉన్నాయి. ఎలాంటి పదార్థాలు కొబ్బరినూనెతో కలిపి పెట్టుకోవాలి, రాత్రంతా తలకు పెట్టుకోగలిగే మాస్క్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి?

ఈ హెయిర్ మాస్క్ లను రాత్రంతా తలకు ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.. రకరకాల జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కొబ్బరినూనె మాస్క్ లను ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది.

curd

కొబ్బరినూనె, పెరుగు
అర కప్పు కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేయాలి. అది చల్లారిన తర్వాత 3 స్పూన్ల తాజా పెరుగును కలపాలి. ఇది బాగా మిక్స్ అయ్యేంతవరకు కలపాలి. తర్వాత తలకు, మాడుకు పట్టించాలి. రాత్రంతా తలకు ఈ ప్యాక్ అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

honey

కొబ్బరినూనె, తేనె
అరకప్పు కొబ్బరినూనెను వేడి చేసి పక్కనపెట్టుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి బాగా కలపాలి. ఇప్పుడు తలకు పట్టించి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ముందుగా జుట్టుని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూతో స్నానం చేయడం వల్ల చిట్లిపోయిన జుట్టుని నివారిస్తుంది.

egg

కొబ్బరినూనె, గుడ్డు
అరకప్పు కొబ్బరి నూనె తీసుకుని అందులో ఒక గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. పేస్ట్ లా తయారైన తర్వాత తలకు పట్టించి రాత్రంతా.. అలానే వదిలేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇది డ్యామేజ్ జుట్టుని నివారించడానికి, జుట్టుకి ప్రొటీన్లు అందించడానికి గుడ్డులోని తెల్లసొన ఉపయోగపడుతుంది.

English summary

Overnight Coconut Oil Hair Mask Recipes in telugu

Coconut oil is a powerful ingredient to apply on your hair. In the ancient times, people used to apply coconut oil even on the body. The oil is gentle and soothing for the skin as well as the hair.
Story first published: Wednesday, November 18, 2015, 14:23 [IST]
Desktop Bottom Promotion