Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి టాప్ 10 విటమిన్స్-మినిరల్ ఫుడ్స్
జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి టాప్ 10 విటమిన్స్-మినిరల్ ఫుడ్స్
వ్యక్తిత్వాన్ని స్పష్టంగా, ఆకర్షణీయంగా వెల్లడించడంలో జుట్టు తీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆరోగ్యవంతమైన కేశ పోషణకు పౌష్టికాహారం ఎంతో అవసరం. శరీర పోషణలో కేశ పోషణ కూడా ఒక భాగం. జుట్టు మెరవడానికీ, బలంగా ఉండడానికీ వాటికి పోషక విలువల్ని అందించాలి. ప్రొటీన్స్ మరియు విటమిన్లు పోషణ, సంరక్షణలోనూ ప్రధానపాత్ర వహిస్తాయి. సరైన పోషకాహారం లేకపోతే వయసుకన్నా ముందే జుట్టు పాలిపోడం, నెరిసిపోడం, ఊడిపోడం జరుగుతుంది.

చాలా మంది ఒంటిపై చూపిన శ్రద్ద జుట్టుపై చూపించరు. అసలు దాని గురించే పట్టించుకోరు. జుట్టును అందంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అలా అనుకూనే వారు తక్కువ. నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువగా ఉంటారు. దానికి కారణం వారు పని ఒత్తిడి అని చెబుతారు. షాంపూలొచ్చాక తేలిక అయింది కాబట్టి కొంతలో కొంత నయం. లేకుంటే నూనె అంటుకుని మర్దనా చేసి, కుంకుడు కాయలుపయోగించి తీరికగా తలంటి పోసుకోడమంటే ఈ రోజుల్లో మహిళలకు కష్టమే. అందుకే కేశ ఆరోగ్యానికి కూడా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ 'విటమిన్ ఇ’ఆహారాలు..!
కురుల కోసం మంచి ఆహారం అందుకు ప్రత్యేకించి ఏమీ లేదు. తీసుకునే ఆహారంలో సమతౌల్యం పాటిస్తే చాలు పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే ముఖంలో కాంతి, కేశాలలో మెరుపు తగ్గే అవకాశముంది. విటమిన్స్ కూడా ఆరోగ్యవంతమైన కేశాలకు అవసరం. పాలు, పన్నీర్, మాంసం, చేపలు, వెన్న, గుడ్లు, క్యారెట్, టమాటా, ఆకుపచ్చని కూరలు, అరటి, నిమ్మ, నారింజ, లాంటి వాటిలో ప్రొటీన్స్‌లు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలు
జుట్టు పెరుగుదలలో విటమిన్ బి ప్రధాన పాత్రపోషిస్తుంది . జుట్టు రాలడం అరికట్టాలంటే మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి అధికంగా ఉండే అన్ని రకాల ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. ఈ విటమిన్స్ మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మార్చుతాయి. జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్స్ చాలా మేలు చేస్తాయి. వీటితో పాటు మరికొన్ని జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆహారాలు మీకోసం...

విటమిన్ సి:
కురుల పెరుగుదలకు బయోప్లె వనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి ఎంతో ఉపయో గపడు తాయి. తల మాడుకు కావల్సింత రక్త ప్రసరణను అందించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో విలమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు విటమన్ సి ఎక్కువగా ఉన్న ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రి కాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.

విటమిన్ ఇ:
విటమిన్ ఇ కురులకు మెరుపు వస్తుంది. పెలుసుగా ఉన్న కురు లు పట్టుకుచ్చులా మారు తాయి. తల మాడుకు రక్త ప్రసరణకు కావల్సి నంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉన్న మామిడి పండ్లు, కివి ఎక్కువగా తీసుకోవాలి. చేపలల్లోనూ ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.

బీటా కెరోటీస్:
శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మారి శరీరానికి, కురులకు సహజత్వాన్ని అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను) సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ అధికంగా ఉంటే దోసకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కురులు రాలిపోకుండా నివారించవచ్చు.

ఫోలిక్ ఆసిడ్:
ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురులకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.

మెగ్నీషియం:
కురుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మెగ్నీషియం ఎంతగానో దోహదడుతుంది. అరటి పండులో ఈ పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

అసిటోల్:
విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా కూరగాయలు, పండ్లు దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడంతో అందమైన కేశసంపదను పొందవచ్చు.

విటమిన్ డి :
హెయిర్ ఫోలిసెల్స్ కు విటమిన్ డి చాలా ముఖ్యంగా అవసరం అవుతుంది . ఇది జుట్టు పెరుగుదలకు విటమిన్ డికి సంబంధం కలిగి ఉంటుంది . ఇది హెయిర్ ఫోలీ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ డి స్టెమ్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . జుట్టుకు అవసరం అయ్యే పోషకాలను కూడా అందిస్తుంది.

బి2 లేదా రొబోఫ్లెవిన్ :
మష్రుమ్స్ లో విటిమన్స్ అధికంగా ఉన్నాయి. ఆస్పరాగస్ మరియు త్రుణధాన్యాలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ బి2 అధికంగా ఉండటం వల్ల వీటిని స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ పొందడానికి తీసుకోవచ్చు.

నియాసిన్ :
విటమిన్ బి3 లేదా నియాసిన్ బీఫ్ లివర్, ఫిష్, బీట్ రూట్, పీనట్, బీఫ్ మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ లో బి3 అధికంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యలను నివారించుకోవడం కోసం ఈ విటమిన్ ఫుడ్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

విటమిన్ బి5 లేదా పాంటోథెనిక్ యాసిడ్ :
ఈ విటమిన్స్ గుడ్డు పచ్చసొన, కార్న్, కేల, లెగ్యుమ్స్ , కాలీఫ్లవర్, బ్రొకోలీ, చికెన్, సాల్మన్ మరియు ధాన్యాలో అధికంగా ఉంటాయి . ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడటానికి నివారిస్తుంది. హెయిర్ గ్రోత్ కు సహాయపడే ఉత్తమ ఆహారాలివి.

విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్ :
ఈ విటిమన్స్ ను అరటిపండ్లు, ఆస్పరాగస్, పచ్చిబఠానీలు, బెల్ పెప్పర్స్, బేక్డ్ పొటాటోస్, నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు అవొకాడోల్లో అధికంగా ఉన్నాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పొందవచ్చు.

విటమిన్ బి7 లేదా బయోటిన్ :
స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ ఉల్లిపాయ, బాదం, సెరల్స్, ఈస్ట్, అరటి మరియు సాల్మన్ వంటి ఫుడ్స్ లో అధికంగా ఉన్నాయి . ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ మరియు జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది . మరియు ఇవి హెయిర్ ఫాల్ అరికడుతాయి . జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

విటిమన్ బి12 :
విటమిన్ బి12 అధికంగా ఉండే చేపలు, చికెన్, లివర్, గుడ్డు, పాలు, పెరుగు మరియు చీజ్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. వీక్ గా ఉన్న హెయిర్ ను బలంగా మార్చడానికి ఈ విటమిన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు జుట్టు రాలడం నివారిస్తాయి.

ఐరన్:
ఇనుము లోపం వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

కొబ్బరి నీళ్ళు మరియు నీరు :
నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, సలాడ్ లు అధికంగా తీసుకోవాలి. వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడం అరికడుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.



Click it and Unblock the Notifications











