For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై, డ్యామేజ్ అయిన జుట్టుని నివారించే.. పవర్ ఫుల్ ఆయిల్స్..!!

By Swathi
|

జుట్టు డ్రైగా, డ్యామేజ్ అయి ఉంటే.. ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా.. ఆకర్షణీయంగా కనిపించదు. ఫెస్టివల్స్, అకేషన్స్ లో డిఫరెంట్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు.. డ్రై హెయిర్ చాలా సమస్యగా మారుతుంది. కాబట్టి.. ఇలాంటప్పుడు న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించడం చాలా సేఫ్.

massage oils

డ్రై హెయిర్ చూడ్డానికే కాదు.. మేనేజ్ చేయడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. పొడిబారిన జుట్టు చాలా తేలికగా బ్రేక్ అవడం, ఇతర సమస్యలు తీసుకురావడానికి కారణమవుతుంది.

అంతేకాదు.. డ్రై హెయిర్ చూడ్డానికి కూడా చాలా నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా రెడీ అయినప్పుడు జుట్టు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడే.. మొత్తం లుక్ బావుంటుంది. కాబట్టి డ్రై హెయిర్ నివారించడానికి న్యాచురల్ ఆయిల్స్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

అందమైన జుట్టు పొందడానికి కొబ్బరినూనె చక్కటి ఆప్షన్. డ్యామేజ్ హెయిర్ ని , డ్రై హెయిర్ ని నివారించడానికి కొబ్బరినూనెతో స్కాల్ప్ ని, జుట్టుని మసాజ్ చేసి.. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టుని బలంగా, హెల్తీగా మారుస్తుంది. అలాగే.. వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి.. వారానికి కనీసం ఒకసారి.. ఆలివ్ ఆయిల్ మసాజ్ చేస్తే.. హెల్తీ హెయిర్ పొందుతారు.

ఆముదం

ఆముదం

ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు.. ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. కాబట్టి.. ఆముదంను ఉపయోగిస్తే.. కేవలం ఒకేనెలలో డ్యామేజ్ జుట్టుని నివారించవచ్చు.

బాదాం ఆయిల్

బాదాం ఆయిల్

బాదాం ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది.. స్కాల్ప్ కి, జుట్టుకి పోషణ అందించి, జుట్టుని బలంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. కాబట్టి.. బాదాం ఆయిల్ తో మసాజ్ చేస్తే.. డ్యామేజ్ జుట్టుని నివారించవచ్చు.

ఉసిరి నూనె

ఉసిరి నూనె

ఉసిరి నూనెలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి.. డ్యామేజ్, డ్రై అయిన జుట్టుకి ఉసిరి నూనె చక్కటి పరిష్కారం. కాబట్టి హెయిర్ వేగంగా, బలంగా పెరగాలంటే.. ఉసిరి నూనె ఉపయోగించాలి.

ఆవ నూనె

ఆవ నూనె

ఆవనూనెను జుట్టుకి చాలామంది ఉపయోగించరు. ఎందుకంటే.. ఈ ఆయిల్ స్మెల్ బాగోదు. కానీ.. మంచి షాంపూ ఉపయోగిస్తే.. ఆ స్మెల్ పోతుంది. ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల.. దురదతో ఉన్న స్కాల్ప్ ని, చుండ్రుని నివారించడం తేలికవుతుంది.

ఆర్గాన్ ఆయిల్

ఆర్గాన్ ఆయిల్

ఆర్గాన్ ఆయిల్ ఖరీదైనది. కానీ.. చాలా బెన్ఫిట్స్ కూడా.. అంతే గ్రేట్ గా ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ జుట్టులోని ప్రతి స్ట్రాండ్ కి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టు స్ట్రాంగ్ అండ్ షైనీగా కనిపించడానికి సహాయపడుతుంది. కాబట్టి డ్యామేజ్ అండ్ డ్రై హెయిర్ కి ఇదో చక్కటి ఆప్షన్.

English summary

Best Massage Oils For Dry, Damaged Hair

Best Massage Oils For Dry, Damaged Hair. The festive season can wreak havoc on hair because of how much we style the hair during this season.
Story first published: Monday, October 10, 2016, 16:38 [IST]
Desktop Bottom Promotion