For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిట్లిన జుట్టును నివారించే ఎఫెక్టివ్ కిచెన్ రెమెడీస్ ..!!

జుట్టు చిట్టకుండా ఉండాలంటే కొన్ని ఎఫెక్టివ్ కిచెన్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

|

అందం విషయంలో జుట్టు కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీ జుట్టు హెల్తీగా మరియు షైనీగా ఉంటేనే జుట్టు చూడటానికి అందంగా కనిపిస్తుంది. జుట్టు ఎంత పొడవున్నా, డ్యామేజ్ అయిన జుట్టు కన్నా, చిన్నగా మరియు ఆరోగ్యంగా ఉన్న జుట్టే చూడటానికి అందంగా కనిపిస్తుంది.

జుట్టు ఎంత ఒత్తుగా ఉన్నదనడం కన్నా ఎంత అందంగా మరియు ఆరోగ్యంగా ఉన్నదనేది చాలా అవసరం. చాలా మంది పొడవాటి జుట్టు కలిగి ఉంటుంది. అయితే ఆ జుట్టు డ్రైగా మరియు డ్యామేజ్ అయి ఉంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. జుట్టు సమస్యల్లో జుట్టు చిట్లడం చాలా సహజం. ఈ సమస్యను చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటుంటారు .చిట్లిన జుట్టు జుట్టు పెరగనివ్వకుండా చేస్తుంది మరియు నిర్జీవంగా మరియు కళ లేకుండా చేస్తుంది.

జుట్టు చిట్లడానికి కారణం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా కెమికల్ హెయిర్ డైలను అప్లై చేయడం మరియు సలోన్ లో ఉపయోగించే ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ అంతే కాదు మరీ ముఖ్యంగా హాట్ హెయిర్ స్ట్రెయిట్నర్ ను ఉపయోగించడం వల్ల లేదా బ్లో డ్రైయింగ్ మరియు తడి జుట్టును దువ్వడం వల్ల కూడా జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది. జుట్టు చిట్టకుండా ఉండాలంటే కొన్ని ఎఫెక్టివ్ కిచెన్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఎగ్ మాస్క్

ఎగ్ మాస్క్

గుడ్డులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంంగా ఉంటాయి. చిట్లిన జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్స్ చాలా అవసరం. ఆ ప్రోటీన్స్ గుడ్డులో ఎక్కువగా ఉంటుంది. ఇవి హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా చేస్తుంది. గుడ్డులోని పచ్చసొన తీసుకుని, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి.. రెండూ బాగా కలిసే వరకూ బాగా మిక్స్ చేసి, జుట్టు చివర్లుకు అప్లై చేయాలి. త అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే జుట్టు చిట్లడం తగ్గుతుంది.

 మయోనైజ్:

మయోనైజ్:

మయోనైజ్ ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మయోనైజ్ చిట్లిన జుట్టును నివారిస్తుంది. . ఇది జుట్టును షైనీగా సాప్ట్ గా మార్చుతుంది. ఒక కప్పు మయోనైజ్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అవసరం అయితే నిమ్మరసం కూడా కొద్దిగా మిక్స్ చేయాలి. ఇది జుట్టు చిట్లడం నివారించడంతో పాటు, చుండ్రును కూడా నివారిస్తుంది. మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి, తల మొత్తానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి పండ్లు :

అరటి పండ్లు :

అరటి పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. అరటిపండు తీసుకిుని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో పెరుగు తేనె మిక్స్ చేసి అన్ని మిక్స్ అయిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టును నివారిస్తుంది. జుట్టు చిట్లకుండా అరికడుతుంది. ఒక గంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె:

తేనె:

తేనె డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ను నివారిస్తుంది. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది, బౌన్సీగా, షైనీగా మార్చుతుంది. ఇందులో లక్షణాలు, పోషణ వల్ల తేనె హెయిర్ కండీషనర్ గా గ్రేట్ గా పనిచేస్తుంది.తర్వాత జుట్టును సాఫ్ట్ గా మరియు సిల్కీ హెయిర్ గా మార్చుతుంది. ఒక కప్పు వార్మ్ వాటర్ లో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలిజ కొద్ది సేపటి తర్వాత తలస్నానం చేయాలి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో ఉండే ప్రోటీన్స్ తలకు, జుట్టుకు పోషణను అందిస్తాయి. టాక్సిన్స్ ను తొలగిస్తుంది. జుట్టుకు నేచురల్ షైనింగ్, సాప్ట్ నెస్ ను అందిస్తుంది. బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒకకప్పు పెరుగు, మయోనైజ్ మిక్స్ చేసి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 బీర్ :

బీర్ :

మీ జుట్టును షాంపుతో వాష్ చేసిన తర్వాత, ఒక మగ్గు నీటిలో బీర్ మిక్స్ చేసి తలరా పోసుకోవాలి. ఇలా జుట్టుకు బీర్ ను కండీషనర్ గా ఉపయోగించడం వల్ల ఇది చిట్లిన జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జుట్టు డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది. నిర్జీవంగా ఉన్న జుట్టును గ్రేట్ గా మార్చుతుంది. జుట్టు వాల్యూమ్ పెంచుతుంది. జుట్టుకు షాంపు చేసిన తర్వాత చివరగా బీర్ ను ఒక మగ్గు నీటిలో తలారా పోసుకోవాలి.

English summary

How To Treat Split Ends Using Kitchen Ingredients?

Split ends can really make you have a bad hair day, and here are some kitchen ingredients that could help you solve this issue with ease. Make sure to try these home remedies.
Story first published: Monday, December 26, 2016, 15:11 [IST]
Desktop Bottom Promotion