For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టుకి న్యాచురల్ కలర్ అందించే హోంమేడ్ హెయిర్ డై..!

By Swathi
|

తెల్లజుట్టు సమస్య ఒకరిది కాదు ఇద్దరిది కాదు.. టీనేజర్స్ నుంచి.. వయసు పెరుగుతున్న వాళ్ల వరకూ అందరిలోనూ కనిపిస్తున్న కామన్ ప్రాబ్లమ్. దీన్ని అధిగమించడానికి రకరకాలుగా ప్రయత్నించి.. చివరికి సైలెంట్ అయిపోతున్నారు. మార్కెట్ లో దొరికే హెయిర్ డై స్ ప్రయత్నించి.. అవి వారానికే జుట్టు రంగుని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం వల్ల.. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటున్నారు.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

అయితే తెల్లజుట్టుని నల్లగా మార్చే హెయిర్ డైలు.. కొంతమందికి బాగానే పనిచేసినా.. కొంతమందికి కొత్త సమస్యలు తీసుకొస్తాయి. అలర్జీ, జుట్టు రాలడం, ముఖంపై పింపుల్స్, గాయాలకు కారణమవుతాయి. కాబట్టి.. న్యాచురల్ గా ఇంట్లోనే హెయిర్ కలర్ తయారు చేసుకుని వేసుకుంటే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫలితాలు ఎక్సలెంట్ గా ఉంటాయి. మరి న్యాచురల్ హెయిర్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

ఉసిరి

ఉసిరి

ఉసిరికి జుట్టుకి డై వేసేంత సత్తా లేకపోయి.. తెల్ల జుట్టుని న్యాచురల్ బ్రౌన్ లేదా రెడ్ కలర్ లోకి తీసుకొస్తుంది. అలాగే జుట్టుకి న్యాచురల్ షైనింగ్ ఇస్తుంది. కాబట్టి ఉసిరికాయ పౌడర్ ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకుని తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. జుట్టు రంగు మారుతుంది.

హెన్నా

హెన్నా

గోరింటాకుతో తయారు చేసిన హెన్నా ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. అయితే దీనికి ఆయిల్, కరివేపాకు మిక్స్ చేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనె తీసుకుని వేడి చేయాలి. ఉడికేటప్పుడు కొన్ని కరివేపాకు వేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత.. ఒక టైట్ కంటెయినర్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే జుట్టుకి కలర్ వేసుకోవాలని భావిస్తారో అప్పుడు దీనిలోకి హెన్నా వేసి.. కొన్ని నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత జుట్టుకి అప్లై చేసి.. మూడు నాలుగు గంటల తర్వాత షీకాయ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉంటుంది.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

6 నుంచి 8 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. మూడు టీ స్పూన్ల తాజా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి.. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప పొట్టు

బంగాళదుంప పొట్టు

5 బంగాళదుంపలు తీసుకుని పొట్టు తీయాలి. ఈ పొట్టుని ఒక కప్పులో పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండుకప్పుల నీళ్లు వేసి.. బంగాళదుంప పీల్ కలపాలి. బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు మంట తగ్గించి.. 5 నిమిషాలు అలానే మంటపై ఉంచాలి. ఇప్పుడు ప్యాన్ పక్కనపెట్టి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టాలి. అందులోకి కొన్ని చుక్కల సాండల్ వుడ్ ఆయిల్ కలిపి... ఒక గాజు డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీన్ని జుట్టు శుభ్రం చేసుకున్న తర్వాత జుట్టుకి అప్లై చేసుకుంటే సరిపోతుంది.

టీ

టీ

కాఫీ, టీ రెండింటిలోనూ జుట్టుకి కలర్ తీసుకొచ్చే సత్తా ఉంటుంది. టీ పౌడర్ లేదా టీ బ్యాగ్స్ తీసుకుని.. బాగా ఉడకిన తర్వాత వడకట్టాలి. ఈ డికాషన్ ని జుట్టుకి అప్లై చేసి.. కొన్ని గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఫలితాలు మీరే చూస్తారు.

వాల్ నట్ షెల్స్

వాల్ నట్ షెల్స్

వాల్ నట్స్ కి ఉండే టెంక జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎప్పుడైనా ఊహించారా ? వాల్ నట్ టెంకను పొడి చేసి.. ఉడుకుతున్న నీటిలో మిక్స్ చేయాలి. అరగంటపాటు బాగా మరగనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి.. తెల్లబడిన జుట్టుకి ఈ లిక్విడ్ అప్లై చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే వేడి నీటితో శుభ్రపరుచుకోకూడదు.

కాఫీ

కాఫీ

కాఫీ కూడా జుట్టుకి న్యాచురల్ హెయిర్ కలర్ లా పనిచేస్తుంది. కాఫీ డికాషన్ తయారు చేసుకోవాలి. అది బాగా నల్లగా, స్ట్రాంగ్ ఉండాలి. దీన్ని జుట్టుకి పట్టించి.. కొన్ని గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదంటే.. కాఫీ డికాషన్ కి కొద్దిగా హెయిర్ కండిషనర్ మిక్స్ చేసి రాసినా మంచి ఫలితం ఉంటుంది.

చూశారుగా సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ కలర్స్. ఇప్పుడే ట్రై చేయండి మరి..

Story first published:Tuesday, May 10, 2016, 12:39 [IST]
Desktop Bottom Promotion