For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు కలిగే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ..!

మీరు తలస్నానం ఎన్ని రోజులకు చేస్తుంటారు? ప్రతి ఒక్క మహిళ ఇతరులతో అడిగే ప్రశ్న. ఎందుకంటే కొంత మంది జుట్టు రోజురోజుకు ఫ్రెష్ గా, నునుపుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. ఆ సందేహంతోనే ఇతరులను ఇటువంటి ప్ర

|

మీరు తలస్నానం ఎన్ని రోజులకు చేస్తుంటారు? ప్రతి ఒక్క మహిళ ఇతరులతో అడిగే ప్రశ్న. ఎందుకంటే కొంత మంది జుట్టు రోజురోజుకు ఫ్రెష్ గా, నునుపుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. ఆ సందేహంతోనే ఇతరులను ఇటువంటి ప్రశ్నల అడగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే రెగ్యులర్ ప్రతి రోజూ తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిదేనా? రోజు తలస్నానం చేయడం వల్ల తల మరియు స్లాప్(తల)లో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ కు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ప్రతి రోజూ తలస్నానానికి మీరు ఉపయోగించే షాంపు మంచిది మన్నికైనది కాకపోతే, ఆ షాంపులో ఉండే కెమికల్స్ జుట్టు రాలడానికి దారితీస్తుంది మరియు తలలో చుండ్రు పెరిగేలా చేస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం, రెగ్యులర్ గా ప్లెయిన్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయని నిర్ధారించారు. అంటే ప్రతి రోజూ తలస్నానం చేయడం ద్వారా జుట్టు రఫ్ గా మారుతుంది . తలస్నానానికి ఉపయోగించే నీళ్ళు మరింత హార్డ్ గా ఉండటం వల్ల మీ జుట్టుకు హాని కలిగిస్తుంది. సాఫ్ట్ వాటర్ తో పోల్చితే హార్డ్ వాటర్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జుట్టుకు హాని ఎక్కువగా కలిగిస్తాయి. అందువల్ల మీరు ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడమే మంచిది. వే

వేడి నీళ్ళు జుట్టులోని బలాన్ని తగ్గించి నీర్జీవంగా మరియు బలహీనంగా మార్చుతుంది. ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడానికి మరో కారణం కూడా ఉంది. రోజూ తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ కోల్పోవడం వల్ల ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ కు కారణం అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ హెయిర్ వాష్ నివారించడం ఉత్తమం. అంతే కాదు, ప్రతి రోజూ తలస్నానం చేయకుడదు అనడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి...

 జుట్టు రాలుతుంది:

జుట్టు రాలుతుంది:

ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం జరగుతుంది. రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ సెన్సిటివ్ గా మారుతాయి. ఇది జుట్టు ఎక్కువగా రాలడానికి కారణమవుతుంది

డ్రై హెయిర్ :

డ్రై హెయిర్ :

ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోతాయి,. దాంతో జుట్టు డ్రైగా మారుతుంది. జుట్టు హెల్తీగా మరియు షైనీగా పెరగాలంటే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ తప్పనిసరిగా అవసరమవుతాయి.

జుట్టు చిట్లడం:

జుట్టు చిట్లడం:

జుట్టులో నేచురల్ ఆయిల్స్ తగ్గడం వల్ల జుట్టు డ్రైగా మారడంతో జుట్టు చివర్లు చిట్లడం ప్రారంభమవుతుంది. కాబట్టి, రోజూ తలస్నానం చేయడం మంచిది పద్దతి కాదు.

చుండ్రు:

చుండ్రు:

రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో చుండ్రు పెరుగుతుంది, డ్రైహెయిర్, ఆయిల్ హెయిర్ వల్ల ఉండే చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది.

తలలో దురద పెరుగుతుంది:

తలలో దురద పెరుగుతుంది:

ఎక్కువ సార్లు తలస్నానం చేయడంవల్ల తలలో దురద పెరుగుతుంది. తలలో పిహెచ్ లెవల్స్ హెచ్చుతగ్గుల వల్ల తల దురదకు కారణమవుతుంది.

హెయిర్ బ్రేకేజ్ :

హెయిర్ బ్రేకేజ్ :

రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాలీసెల్స్ వీక్ గా మారుతాయి. దాంతో జుట్టు పెరుగుదల సగంలోనే ఆగిపోతుంది. లేదా జుట్టు తెగడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించుకోవాలంటే, రోజూ తలస్నానం చేయడాన్ని తగ్గించుకోవాలి.

 హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ప్రతి రోజూ రెగ్యులర్‌గా తలస్నానం చేయడం వల్ల జుట్టుకున్న తడి ఆర్పడానికి హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది. సో.. రెగ్యులర్ హెయిర్ బాత్‌ను తగ్గించడం మంచిది.

జుట్టు చిక్కుబడటం ఎక్కువ అవుతుంది:

జుట్టు చిక్కుబడటం ఎక్కువ అవుతుంది:

రోజూ తలస్నానం చేయడం వల్ల తలలో మాయిశ్చరైజింగ్ గుణాలు తగ్గిపోతాయి. దాంతో జుట్టు ఎక్కువగా చిక్కు పడుతుంది. ఏ రోజైతే తలస్నానం చేయకుండా ఉండరో.. షాంపును వాడకపోవడం వల్ల జుట్టు చిక్కుపడకుండా, పొడిబారకుండా అందంగా కనబడుతారు.

English summary

What Happens When You Wash Your Hair Too Often?

Washing your hair is something that you may consider to be the safest thing ever for your hair, isn't it? Well, you'd be surprised to know about what happens to your hair if you wash it too much.Here, we will be sharing all the ways in which your hair can actually be harmed if you wash your hair too much.
Story first published: Thursday, October 27, 2016, 14:53 [IST]
Desktop Bottom Promotion