For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు వేగంగా పెరిగేలా చేసే ఆయుర్వేదిక చిట్కాలు

By Lekhaka
|

మన శరీరం, చర్మ ఆరోగ్యం కోసం తీసుకున్నన్ని జాగ్రత్తలు జుట్టు కోసం తీసుకోవడం లేదు. చాలా మంది జుట్టును నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా మంది ఎప్పుడూ హెయిర్ ప్రొడక్ట్స్, షాంపులు, కండీషనర్స్ మారుస్తుంటారు. ఇలా మార్చడం వల్ల జుట్టుకు మరింత హాని జరుగుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ లో వివిధ రకాల కెమికల్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి జుట్టు మీద తీవ్ర దుష్ప్రభావాలను చూపుతాయి.

ఇలా తరచూ హెయిర్ ప్రొడక్ట్స్ మార్చే వారు జుట్టు లోపలికి చేతి వేళ్ళను పోనిచ్చి గమనించినట్లైతే జుట్టు ఎంత మేర పల్చబడినదో తెలుస్తుంది. అంతే కాదు జుట్టు లోపలి నుండి చెయ్యి బయటకు తీసినప్పు మీ వేళ్ళ చుట్టూ కొన్ని నిర్జీవమైన జుట్టు ఊడిరావడాన్ని మీరు గమనిస్తారు.

చుండ్రు నివారణకు 12 ఆయుర్వేదిక్ హోం రెమెడీస్ ..!

అనేక జుట్టు సమస్యలను నివారించడంలో ఆయుర్వేదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆయర్వేదం ప్రకారం మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. అంతే కాదు ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే అటువంటి

ఆయుర్వేదిక్ రెమెడీస్ గురించి వెంటనే మనం తెలుసుకుందాం..

1. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తీసుకోవాలి

1. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తీసుకోవాలి

రెగ్యులర్ డైట్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది. మనం రోజూ తినే ఆహారాల నుండి ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్లు హెయిర్ ఫాలీ సెల్స్ కు చేరుతాయి. దాంతో జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

2. హానికరమైన షాంపులను నివారించాలి:

2. హానికరమైన షాంపులను నివారించాలి:

మార్కెట్లో అందుబాటులో ఉండే హానికరమైన షాంపుల జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. వీటికి బదులుగా నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే ఆయుర్వేద పదార్థాలైన శీకాకాయ, కుంకుడు కాయ వంటివి నేచురల్ షాంపుగా, అలోవెర జెల్ ను నేచురల్ కండీషనర్ గా ఉపయోగించాలి. వీటి వల్ల హెయిర్ పిహెచ్ లెవల్స్ పెరుగుతాయి. హెయిర్ రూట్స్ కు మంచి పోషణ అందుతుంది.

3. వారంలో కనీసం 3 సార్లు ఆయిల్ అప్లై చేయాలి:

3. వారంలో కనీసం 3 సార్లు ఆయిల్ అప్లై చేయాలి:

మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి, మీకు అందుబాటులో ఉండే నేచురల్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకోవాలి.

ఉదాహరణకు : దక్షిణ భారతదేశంలో నివశించే వారైతే తప్పనిసరిగా కొబ్బరి నూనెను ఎంపిక చేసుకోవాలి. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే మందారం నూనె కూడా వారంలో రెండు మూడు సార్లు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.

4. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా చేయాలి:

4. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా చేయాలి:

ప్రస్తుత రోజుల్లో పనిఒత్తిడితో జుట్టు రాలడం అధికమవుతున్నది. జుట్టు రాలడం నివారించుకోవాలంటే మొదట ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. అందుకు కష్టమైన ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మెడిటేషన్ చేస్తే చాలు .

5.ఆమ్లా పౌడర్ ను నేచురల్ హెయిర్ డ్రయ్యర్ గా:

5.ఆమ్లా పౌడర్ ను నేచురల్ హెయిర్ డ్రయ్యర్ గా:

ఉసిరికాయ పొడిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసి, 15 నిముషాలు పక్కన పెట్టాలి. తర్వాత జుట్టుకు ప్యాక్ లా వేసుకుని, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. జుట్టుకు నేచురల్ గ్లో వస్తుంది. చుండ్రు నివారిస్తుంది. ఫంగల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

6. హెన్నాను ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మాత్రమే కొనాలి:

6. హెన్నాను ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మాత్రమే కొనాలి:

చాలా దుకాణాల్లో హెన్నా అమ్ముతారు. అయితే 100శాతం నేచురల్ హెన్నాను కొనాలి. ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మాత్రమే హెన్నా కొనాలి. ఇక్కడ న్యాచురల్ గా ఉంటాయి. ఉపయోగించడానికి సురక్షితమైనవి.

7. చుండ్రును నివారించడానికి వేప:

7. చుండ్రును నివారించడానికి వేప:

రెండు కప్పుల నీటిలో గుప్పెడు వేప ఆకులను వేసి బాయిల్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకుని, కూల్ చేయాలి. దీన్ని జగ్ లో ఉంచి స్టోర్ చేయాలి. దీన్ని కండీషనర్ గా ఉపయోగించాలి. వారంలో మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. షాంపు

8. షాంపు

కుంకుడుకాయను తీసుకుని, రెండు కప్పుల నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అదే నీళ్లను కుంకుడు కాయలతో పాటు వేడి చేయాలి. 15 నిముషాలు వేడి చేయాలి. స్టౌ మీద నుండి క్రిందికి దింపి, గోరువెచ్చగా మారిన తర్వాత తలస్నానానికి ఉపయోగించాలి. మిగిలితే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు.

9. అశ్వగంధ

9. అశ్వగంధ

మార్కెట్టో అశ్వగంధ పౌడర్ అందుబాటులో ఉంటుంది.దీన్ని తేనెతో మిక్స్ చేసి తర్వాత ఉపయోగించుకోవాలి. దీన్ని తలకు ఉపయోగించడం వల్ల జుట్టు షైనీగా మరియు సిల్కీగా మారుతుంది.

10. పెరుగు

10. పెరుగు

కొద్దిగా పెరుగు తీసుకుని, జుట్టుకు అప్లై చేయాలి. ఫింగర్ టిప్స్ తో బాగా మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది. ఈ ఆయుర్వేదిక్ చిట్కాను వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Ayurvedic Tips For Healthy Hair

We rarely take care of our hair. Most of the times, we ignore it, or we don't have a chance to take care of it. We are always changing shampoos and conditioners, depending on whatever is available. Doing this harms the state of your precious hair to a major extent.
Story first published:Tuesday, May 30, 2017, 11:08 [IST]
Desktop Bottom Promotion