For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం నివారించి, జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించే 10 సింపుల్ టిప్స్

జుట్టు రాలడానికి ఎన్ని కారణాలున్నా, జుట్టు సంరక్షణకు అంతకంటే ఎక్కవ మార్గాలే ఉన్నాయి. జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పదార్థాలను బ్యూటీ ప్రొడక్ట్స్ గా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు పెరుగు, నిమ్మరసం, నూనె లే

|

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. హెయిర్ ఫాల్ కు అనేక కారణాలున్నాయి. వాతావరణ మార్పుల నుండి డైట్ వరకూ, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జుట్టు రాలడానికి అనేక కారణాలున్నాయి. జుట్టు రాలడానికి ఎన్ని కారణాలున్నా, జుట్టు సంరక్షణకు అంతకంటే ఎక్కవ మార్గాలే ఉన్నాయి. జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పదార్థాలను బ్యూటీ ప్రొడక్ట్స్ గా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు పెరుగు, నిమ్మరసం, నూనె లేదా ఉడికించిన మందారపువ్వులు మరియు మరికొన్ని ఇతర పదార్థాలను మీ జుట్టుకు ఉపయోగిస్తుంటారు !

ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ తీసుకొనే బదులు, నేచురల్ గా హెయిర్ ఫాల్ తగ్గించడానికి కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించడం మంచిది. కొన్నిసింపుల్ కిచెన్ రెమెడీస్ తోనే జుట్టు రాలడాన్ని అరకట్టవచ్చు, అలాగే ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెయిర్ కేర్ వస్తువుల్లో ఆమ్లా(ఉసిరి), ఆముదం, గుడ్డు, పెరుగు, వెనిగర్, మెహింది, వేపాకు, ఆలివ్ ఆయిల్ వంటివి వివిధ జుట్టు రాలడం అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం కోసం ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు గుడ్లు, కొబ్బరి మరియు ఆమ్లా వంటివి మన వంటగదిలో చాలా సులభంగా లభ్యం అవుతాయి. జుట్టు రాలడాన్ని అరకట్టడం కోసం వీటిని హోం మేడ్ హెయిర్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని పదార్థలు హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం కోసం ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

జుట్టు సమస్యలను నివారించడంలో తప్పకుండా ఉపయోగించాల్సిన వాటిలో ఇదిఒకటి. కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల హెయిర్ ను సాప్ట్ గా మార్చుతుంది. తలలో మలినాలను తొలగిస్తుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

హెయిర్ ఫాల్ కు ముఖ్యం కారణం విటమిన్ లోపం . ఆమ్లాలో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆమ్లాను మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. అలాగే ఆమ్లా జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

 గుడ్డు :

గుడ్డు :

జుట్టు రాలడం నివారించడంలో గుడ్డు గ్రేట్ గా సహాయపడుతుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్స్, మినిరిల్స్ అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. ఎగ్ వైట్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. తలకు పూర్తిగా అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీళ్ళు, షాంపుతో తలస్నానం చేయాలి.

 ఆక్యుప్రెజర్

ఆక్యుప్రెజర్

ఆక్యు ప్రెజర్ వల్ల జుట్టు పెరగడాన్ని క్రమబద్దం చేస్తుంది. బాలయం , ఇది ఒక ఆక్యుప్రెజర్ థెరఫీ . తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా పద్మాసనం వేసి కూర్చొని ఫిగర్ టిప్స్ నెయిల్స్ ను రబ్ చేయాలి.

యోగ:

యోగ:

జుట్టు రాలడం తగ్గించడంలో మరో యోగాసన కపాల భాతి, బాలయాం, ఆనుమోలివమ్ ఇవన్నీ జుట్టు పెరగడానికి సహాయపడుతాయి. ఈ ఆసనాలు డైజెస్టివ్ సిప్టమ్ ను శుభ్రం చేస్తుంది. హెయిర్ ఫోలీసెల్స్ కు రక్త ప్రసరణను, ఆక్సిజెన్ అందిస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

డైట్ :

డైట్ :

జుట్టు పెరదలకు హెల్తీ డైట్ గ్రేట్ గా సహాయపడుతుంది. రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉండేలా చేసుకోవాలి. రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, కొత్త హెయిర్ ఫోలిసెల్స్ వస్తాయి. అందుకు బీన్స్, చీజ్, నట్స్, పాలు , త్రుణ ధాన్యాలు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఐరన్ :

ఐరన్ :

ఐరన్ లోపం వల్ల జుట్టు వీక్ గా మారుతుంది.దాంతో జుట్టు రాలడం అధికమవుతుంది. కాబట్టి, ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, సోయాబీన్స్, దాల్, రెడ్ కిడ్నీబీన్స్, చికెన్, మీట్, గుడ్డు ,చేపలు వంటి ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

కాలుష్యం నుండి జుట్టుకు రక్షణ:

కాలుష్యం నుండి జుట్టుకు రక్షణ:

జుట్టు ఎక్కువగా ఎండ, గాలి, హుముడిటికి, వేడికి గురి కాకుండా చూసుకోవాలి. బయట వెళ్ళాలనుకున్నప్పుడు, తలకు క్యాప్, స్కార్ఫ్ వంటివి చుట్టుకోవడం వల్ల పొల్యుషన్ ను జుట్టు రాలడం అరికట్టవచ్చు.

ఆముదం మరియు బాదం ఆయిల్ :

ఆముదం మరియు బాదం ఆయిల్ :

జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఆముదం బాదం ఆయిల్ రెండూ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టును వదులుగా ఉంచాలి:

జుట్టును వదులుగా ఉంచాలి:

జుట్టుకు స్ట్రెటనింగ్, కర్లింగ్, బ్లో డ్రైయింగ్ పెర్మింగ్ వంటివి చేయడం నివారించాలి. జుట్టు రాలడానికి ఇవి కామన్ రీజన్స్ . వీటితో పాటు, యోగ, డైట్, వ్యాయామం వంటివి తప్పకుండా ఫాలో అవ్వాలి.

English summary

10 Simple and Effective tips to reduce hair-fall

10 Simple and Effective tips to reduce hair-fall,It’s not rare to find your comb clogged with your hair strands every day. But hair loss can be controlled easily, with the right hair care routine and awareness.
Story first published: Monday, February 6, 2017, 14:22 [IST]
Desktop Bottom Promotion