Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
దుర్గాపూజ స్పెషల్: చీరలోకి అద్భుతంగా కనిపించే బాలీవుడ్ హెయిర్ స్టైల్స్
దుర్గాపూజలో అస్సలు తీరికే ఉండదు ఇంకా స్త్రీలందరూ పండగ సమయంలో రకరకాల చీరలు ధరించటంలో బిజీగా ఉంటారు. చీరతో పాటు మీ హెయిర్ స్టైల్ కూడా సరిపోతేనే మీరు అందంగా మెరిసిపోతారు. కానీ మీ జుట్టు కోసం ఏం చేయాలి?
చీర కట్టుకున్నాక, అమ్మాయిల ముఖ్యసమస్య జడను ఏం చేయాలని? అన్నిరకాల పూజల మధ్య, ఆన్ లైన్ లో వివిధ హెయిర్ స్టైల్స్ ను వెతికే తీరిక ఉండదు. అందుకని ఎక్కువ సమయం పట్టకుండా మిమ్మల్ని అందంగా మార్చేసే ఈ హెయిర్ స్టైల్స్ మీకోసం.
దుర్గాపూజ ప్రత్యేకం
ఇవి ఇంట్లోనే సులభంగా చేసుకోగల బాలీవుడ్ హీరోయిన్ల హెయిర్ స్టైల్స్. వీటిని చీరతో ఫర్ఫెక్ట్ గా ప్రయత్నించవచ్చు.
ఈ హెయిర్ స్టైల్స్ ను చీర కట్టుకునే ముందే మలుచుకోండి. కొంచెం ఎక్కువసమయం మీ జుట్టుకి కేటాయించకండి. అయిపోయాక అప్పుడు చీర కట్టుకోవచ్చు. మేకప్ మర్చిపోకండేం!

షష్టి – ఒకవైపు హెయిర్ స్టైల్
ఈ మొదటి రోజున, మీ హెయిర్ స్టైలింగ్ కి ఎక్కువ సమయం ఇవ్వనక్కర్లేదు. ఒకవైపు నీటుగా పాపిడి తీసి వదిలేయండి చాలు. వెనకవైపు, చిన్నగా లేదా ఎంత పొడవుగానైనా జుట్టును వదిలేయవచ్చు. మీకు పక్కపాపిడి సాధారణంగా అలవాటు ఉంటే, పండగల సమయంలో మధ్యపాపిడి ప్రయత్నించవచ్చు. అందుకని షష్టికి మీ జుట్టు పాపిడి మార్చడంపై దృష్టిపెట్టండి.

సప్తమి – అల్లికలతో కూడిన పోనీటెయిల్ మరియు ముందువైపు ట్విస్టులు
ఇది చేయటం సులభంగా కన్పించవచ్చు కానీ సమయం బానే పడుతుంది. మొదట జుట్టును సరిగ్గా దువ్వండి. తర్వాత ముందువైపున్న పాయలను తీసుకుని వాటిని అల్లడమో లేదా మెలికలు తిప్పటమో చేసి ఉంచుకోండి. వెనకవైపు, చిన్నగా అల్లుకుని పైకి ముడిలా పెట్టి ఆఖరున జుట్టును వదిలేయండి. సమయం ఎక్కువ పట్టినా, సప్తమికి ఈ లుక్ ను ప్రయత్నించండి. ఎంతైనా దుర్గా పూజ అయిపోతున్నప్పుడైనా కొత్త హెయిర్ స్టైల్స్ ప్రయత్నించి, మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి కదా?

అష్టమి – పెద్ద ముడి
ఒకవేళ మీరు గమనించారో లేదో, ఏ స్త్రీ అష్టమి నాడు చీర కట్టుకోకుండా ఉండదు. అష్టమి దుర్గాపూజ ఉత్సవాలలోనే దేశీయమైన రోజు. మీ లుక్ కూడా దేశీయంగా ఉండటానికి, వెనకవైపు అందమైన బన్ను లేదా ముడి చాలా బావుంటుంది. మీ హెయిర్ బన్నును క్లిప్పులు, రిబ్బన్లలతో గట్టిగా పెట్టుకోండి లేకపోతే మీ ఉరుకులపరుగులలో అది చెదిరిపోతుంది. ముడిపైన అందంగా పూలు కూడా అలంకరించుకోవచ్చు.

నవమి – జుట్టును విరబోసుకుని చివర్లలో కర్ల్స్ చేయండి
ఇక ఈరోజు దుర్గాపూజకి ఆఖరిరోజు. ఈరోజు విరబోసిన జుట్టు, కర్ల్స్ ఎలా ఉంటాయి? మీ జుట్టును అల్లకుండా, అలానే వదిలేసి చివర్లన మాత్రం చిన్నగా కర్ల్ లేదా మెలిపెట్టి ఉంచండి. దీన్ని మీరు ఎలక్ట్రానిక్ హెయిర్ స్టైలర్ తో చేయవచ్చు లేదా సులభంగా మీ జుట్టును తడిచేసుకుని కొన్నిగంటల వరకూ గట్టిగా అల్లి ఉంచండి. సాయంత్రం మండపాలకి వెళ్ళే సమయానికల్లా, మీ జుట్టు చివరన కర్ల్స్ తయారవుతాయి.

దశమి – చెదిరిపోయిన హెయిర్ స్టైల్ లుక్
దశమికల్లా మీరు అలసిపోయి ఉంటారు. ఆఖరిరోజు పూజన సింపుల్ గా ఉండటానికి మీ జుట్టును చెదిరిపోయినట్టు కన్పించే ముడి లేదా పోనీటెయిల్ వేసుకోండి. ఇది చాలా సులభం, సమయం కూడా పట్టదు. ఇది పీకూ చిత్రంలో దీపికా పడుకోనె వేసుకున్నట్లు చీరపై కూడా బావుంటుంది. చివర్లవైపు చిందరవందరగా ఉన్నా, ముందువైపు నీటుగా దువ్వి తయారవ్వండి.



Click it and Unblock the Notifications
