జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి...!

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

బ్యూటీ సమస్యల్లో ఒక సాధారణ సమస్య జుట్టు డ్యామేజ్ అవ్వడం. ఈ మధ్యకాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి.

ముఖ్యంగా హెయిర్ డ్యామేజ్ లో హెయిర్ బ్రేకేజ్, జుట్టు చిట్లడం, జుట్టు రఫ్ గా మారడం, ఇంకా అనేక సమస్యలు హెయిర్ డ్యామేజ్ ను సూచిస్తాయి. అయితే ఇలాంటి లక్షణాలను అలాగే వదిలేయకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు మరింత పాడవకుండా ఉంటుంది.

జుట్టు డ్యామేజ్ కు కారణాలు వివిధ రకాలుగా ఉన్నా వాటిలో కామన్ గా జుట్టుకు హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్స్ హెయిర్ ప్రొడక్ట్స్, సరైన హెయిర్ కేర్ తీసుకోకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది.

homemade packs for damaged hair | how to treat damaged hair | ways to treat damaged hair

కాబట్టి, జుట్టు పాడవకుండా ఉండాలంటే, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇంకా, జుట్టుకు కొన్ని రకాల ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా తగ్గించవచ్చు.

ఈ హెయిర్ మాస్క్ పురాతన కాలం నుండి వాడుతున్నవి, అందులోనే ఎపెక్టివ్ గా పనిచేసేసి, జుట్టు అందంగా మెరిసిపోవాలంటే కొంచెం శ్రద్ద, మరియు సమయం కేటాయిస్తే చాలు మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ లలో యాంటీఇక్సిడెంట్స్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్లజుట్టు ఆరోగ్యాన్ని మరియు అందాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కొన్ని న్యాచురల్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సూచన: ఈ హెయిర్ ప్యాక్స్ ను తలకు వేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి..

1. బట్టర్ + రోజ్ వాటర్

1. బట్టర్ + రోజ్ వాటర్

- బటర్ ను కరిగించి, అందులో 5టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు, తల మాడకు బాగా అప్లై చేసి మర్ధన చేయాలి. - తర్వాత తలకు షవర్ క్యాప్ పెట్టుకుని, ఒక గంట అలాగే ఉంచాలి. - ఒక గంట తర్వాత నార్మల్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారంలో ఒకసారి రిపీట్ చేస్తు జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

2. మిల్క్ పౌడర్ + ఆల్మాండ్ ఆయిల్

2. మిల్క్ పౌడర్ + ఆల్మాండ్ ఆయిల్

- ఒక టీస్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేయాలి.

- షవర్ క్యాప్ తో ఒక గంట సేపు అలాగే ఉండాలి. ఇలా ఉండే అద్భుతమైన మార్పులు కనబడుతాయి.

- ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. అవోకాడో + చమోమిలే టీ

3. అవోకాడో + చమోమిలే టీ

- బాగా పండిన అవొకాడో ను మెత్తగా మ్యాష్ చేయాలి. ఈ పేస్ట్ ను చమోమెలీ టీతో కలపాలి

- ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు న్యాచురల్ గా డ్రైగా మారనివ్వాలి.

- ఒక గంట తర్వాత ట్యాప్ వాటర్ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

4. ఎగ్ వైట్ + ఆపిల్ సైడర్ వినెగార్

4. ఎగ్ వైట్ + ఆపిల్ సైడర్ వినెగార్

- ఒక గుడ్డులోని తెలని పదార్థాన్ని తీసుకుని, దానికి ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.

- ఒక గంట తర్వాత మీకు నచ్చిన షాంపుతో ట్యాప్ వాటర్ తో తలస్నానం చేయాలి.

- ఇలా వారంకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

5. కొబ్బరి నూనె + అరటి

5. కొబ్బరి నూనె + అరటి

- బాగా పండిన అరటికాయను మెత్తగా చేయాలి. తర్వాత అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

- ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

- నిర్జీవంగా కనబడే మీ పాడైన జుట్టును తిరిగి పునర్జీవించడానికి ఈ ప్యాక్ ఎంతగానో సహాయపడుతుంది. మంచి ఫలితాలను ఇస్తుంది.

6. ఆలివ్ ఆయిల్ + పెరుగు

6. ఆలివ్ ఆయిల్ + పెరుగు

- రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కు ఫ్రెష్ పెరుగు కలపాలి. ఈ రెండూ బాగా స్మూత్ గా క్రీమీగా అయ్యే వరకూ కలపాలి. .

- ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్, నార్మల్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

- వారానికి ఒకసారి ఈ అద్భుతమైన ప్యాక్ ఉపయోగించి మీ దెబ్బతిన్న జుట్టు తిరిగి పూర్వస్థితికి వస్తుంది.

7. మయోన్నైస్ + అలోవెరా జెల్

7. మయోన్నైస్ + అలోవెరా జెల్

- ఒక గిన్నె లో, 2 టీస్పూన్స్ మయోన్నైస్ మరియు 3 టీస్పూన్స్ తాజాగా తీయబడిన అలోయి వేరా జెల్ కలపాలి. ఈ రెండు పదార్థాలు బాగా కలగలిసే వరకూ బాగా మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమాన్ని అలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి ఒక గంటసేపు అలాగే ఉంచుకోవాలి.

- తరువాత, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

8. హనీ + గ్రీన్ టీ

8. హనీ + గ్రీన్ టీ

- ఒక బౌల్లో రెండు టీస్పూన్ల గ్రీన్ టీ, 2 టీస్పూన్ల తేనె కలపాలి. ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకూ బాగా మిక్స్ చేయాలి.

- రెండు మిక్స్ చేసిన తర్వాత 10 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత తలకు ప్యాక్ వేసుకోవాలి.

- ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. ఆముదం ఆయిల్ + జోజోబా ఎసెన్షియల్ ఆయిల్

9. ఆముదం ఆయిల్ + జోజోబా ఎసెన్షియల్ ఆయిల్

- ఒక టీస్పూన్ ఆముదం నూనెకు ఒక టీస్పూన్ జోజోబా ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. రెండూ గా మిక్స్ చేయ్యే వరకూ కలిపి తలకు పూర్తిగా అప్లై చేయాలి. .

- 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

- వారానికొకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టుకు మంచి ఫలితం వస్తుంది.

English summary

homemade packs for damaged hair | how to treat damaged hair | ways to treat damaged hair

Damaged hair is one among the common beauty problems that a majority of women are plagued with these days. Hair breakage, split ends, dullness, roughness and many more hair-related problems are sign of damage that you should not turn a blind eye to. As, doing so will not exacerbate the problem and completely ruin the appearance of your precious tresses.