For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిరోజాల వేగవంతమైన పెరుగుదలకు సహకరించే 8 నేచురల్ మార్గాలివే

ఒత్తైన పొడవైన జుట్టును పొందాలని ఎవరికుండదు? అయితే, సరైన పోషణ లేకపోవటం వలన జుట్టు దెబ్బతింటుంది. సహజసిద్ధమైన పెరుగుదల మందగిస్తుంది. కాబట్టి, హెయిర్ గ్రోత్ ను పెంపొందించేందుకై మనం తీసుకోవలసిన జాగ్రత్తలే

|

ఒత్తైన పొడవైన జుట్టును పొందాలని ఎవరికుండదు? అయితే, సరైన పోషణ లేకపోవటం వలన జుట్టు దెబ్బతింటుంది. సహజసిద్ధమైన పెరుగుదల మందగిస్తుంది. కాబట్టి, హెయిర్ గ్రోత్ ను పెంపొందించేందుకై మనం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? ఈ సింపుల్ టిప్స్ ను పాటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

1. ట్రిమ్మింగ్:

1. ట్రిమ్మింగ్:

ట్రిమ్మింగ్ జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ప్రతి ఎనిమిది నుంచి పది వారాలకి జుట్టును ట్రిమ్మింగ్ చేస్తే జుట్టు పెరుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది.శిరోజాలపై పేర్కొన్న దుమ్మూ ధూళి వలన శిరోజాలు దెబ్బతింటాయి. ఇవన్నీ శిరోజాల చివర్లను రఫ్ గా మార్చి స్ప్లిట్ ఎండ్స్ కి దారితీస్తాయి. తరచూ హెయిర్ ను ట్రిమ్ చేయడం ద్వారా స్ప్లిట్ ఎండ్స్ ని తొలగించుకోవచ్చు. ఇలా చేస్తే, శిరోజాల ఎదుగుదలకు ఎటువంటి అవరోధం ఉండదు.

2. కండిషనర్:

2. కండిషనర్:

శిరోజాల చివర్లు ఎక్కువగా చిట్లినట్లుంది దెబ్బతిన్నట్టున్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. శిరోజాల మూలాలు దృఢంగా ఉన్నా కూడా చివర్లు మాత్రం చిట్లినట్లవుతాయి. ఎందుకంటే, శిరోజాల చివర్లకు పోషణ లభించదు. ఈ పరిస్థితిని గమనించి మీరు శిరోజాల చివర్లకు కూడా పోషణనివ్వడం ప్రారంభించాలి. ప్రతి హెయిర్ వాష్ తరువాత కండిషనింగ్ చేయడం ద్వారా వెంట్రుకల చివర్లకు పోషణ లభిస్తుంది. శిరోజాలను మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇలా చేస్తే మీ శిరోజాలు ఆరోగ్యంగా మారి శిరోజాల పెరుగుదల బాగుంటుంది.

3. హాట్ ఆయిల్ మసాజెస్:

3. హాట్ ఆయిల్ మసాజెస్:

సరైన హాట్ ఆయిల్ మసాజ్ స్ట్రెస్ బస్టర్ లా పనిచేస్తుంది. మీ హెయిర్ ని మంచి హాట్ ఆయిల్ తో వారానికొకసారి మసాజ్ చేయడం ద్వారా మీ శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. కోకోనట్, ఆలివ్ లేదా ల్యావెండర్ ఆయిల్ ను వాడి ఒత్తైన శిరోజాలను సొంతం చేసుకోండి.

4. ప్రతి రాత్రి రెగ్యులర్ బ్రషింగ్ ను చేయాలి:

4. ప్రతి రాత్రి రెగ్యులర్ బ్రషింగ్ ను చేయాలి:

విపరీతమైన బ్రషింగ్ వలన హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుందన్న విషయాన్ని మీరు వినే ఉంటారు. ఎక్కువసార్లు బ్రషింగ్ చేయడం వలన శిరోజాల ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలిసే ఉంటుంది. అయితే, మీరు వాడే బ్రష్ లపై కూడా మీ శిరోజాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీరు గ్రహించాలి. సింథెటిక్ బ్రిజిల్స్ ని వాడటం వలన ఫ్రిక్షన్ ఏర్పడి మీ శిరోజాలు దెబ్బతింటాయి. అందువలన, బోర్ బ్రిజిల్ బ్రష్ ని వాడితే స్కాల్ప్ లో రక్తప్రసరణ పెరుగుతుంది. కాబట్టి, రాత్రి నిద్రపోయే ముందు హెయిర్ బ్రషింగ్ ని మీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. హెయిర్ ని బ్రష్ చేయడం వలన కుదుళ్ళు దృఢంగా మారతాయి. శిరోజాలు వేగంగా పెరుగుతాయి.

5. తడి జుట్టును టవల్ తో కవర్ చేయకండి

5. తడి జుట్టును టవల్ తో కవర్ చేయకండి

మనలో చాలా మందికి తలస్నానం చేసిన తరువాత తడిజుట్టును టవల్ లో బంధించడం అలవాటైపోయింది. అయితే, ఇలా చేయడం వలన కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. తడి జుట్టు వలన హెయిర్ ఫాల్ ప్రాబ్లెమ్ అధికమయ్యే ప్రమాదం ఉంది. తడిజుట్టును టవల్ తో చుట్టేయడం వలన ఈ సమస్య మరింత పెరిగే ఆస్కారం ఉంది. టవల్ ఫైబర్స్ కి వెంట్రుకలు రబ్ అవడం వలన వెంట్రుకలు రాలే ప్రమాదాన్ని గమనించి ఈ అలవాటును మానుకోవాలి. లేదంటే, మైక్రో ఫైబర్ టవల్స్ ను వాడటాన్ని ప్రిఫర్ చేయాలి.

6. జుట్టును అప్ సైడ్ డవున్ చేసుకోవాలి

6. జుట్టును అప్ సైడ్ డవున్ చేసుకోవాలి

ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. అయితే, శిరోజాలను అప్ సైడ్ డవున్ చేయడం వలన మీరు ఎన్నో అద్భుతాలను గమనించగలుగుతారు. ప్రతి రోజూ, మీ శిరోజాలను మూడు నిమిషాల పాటు అప్ సైడ్ డవున్ చేయాలి. దీనివలన, సర్క్యూలేషన్ మెరుగవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా మెరుగవుతుంది.

7. ఒత్తిడికి గుడ్ బై చెప్పండి:

7. ఒత్తిడికి గుడ్ బై చెప్పండి:

ఒత్తిడి వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య తలెత్తుతుంది. నిజానికి, హెయిర్ ఫాల్ కి ఒత్తిడి మూలకారణం. పెర్సనల్ ప్రాబ్లెమ్స్ అనేవి హెయిర్ పై దుష్ప్రభావం చూపిస్తాయి. ఒత్తిళ్లను కంట్రోల్ చేసుకోకపోతే హెయిర్ ఫాల్ సమస్య తీవ్రతరంగా మారవచ్చు. మెడిటేషన్, యోగా లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లను చేస్తూ ఒత్తిళ్లను నియంత్రించుకోండి. లేదంటే, హెయిర్ గ్రోత్ కి ఒత్తిడి అనేది అవరోధంగా మారే అవకాశం ఉంది.

8. ఎగ్ మాస్క్:

8. ఎగ్ మాస్క్:

ఎగ్ మాస్క్ అనేది హెయిర్ గ్రోత్ కు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఎగ్ లో శిరోజాల పోషణకు అవసరమయ్యే ప్రోటీన్స్ లభ్యమవుతాయి. ఇవి మీ శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడతాయి. అందువలన, న్యూ హెయిర్ ఫార్మేషన్ అనేది సజావుగా జరుగుతుంది. ఒక టీస్పూన్ నూనెలో (ఆలివ్ ఆయిల్ ని ప్రిఫర్ చేస్తే మంచిది) ఒక ఎగ్ వైట్ ను కలిపి ఈ మిశ్రమాన్ని శిరోజాలపై అలాగే స్కాల్ప్ పై అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత షాంపూ చేయాలి. నెలకొకసారి ఇలా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

English summary

8 natural ways to make your hair grow faster

Who doesn’t yearn for long lustrous hair? But often due to inadequate nourishment and damage, our natural hair growth is hindered. So what can we do so as to increase the pace of our hair growth? Just follow these simple tips and see the astounding results on your own.
Story first published:Friday, March 2, 2018, 18:03 [IST]
Desktop Bottom Promotion