For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జుట్టు నష్టాన్ని అరికట్టే ఉత్తమమైన ఆహార పదార్ధాలు !

  |

  మనలో చాలామంది ఒక్కసారైనా తమ జీవితాల్లో జుట్టును అధికంగా కోల్పోతున్నామని బాధను తప్పక పొంది ఉంటారు. మీ జుట్టును సంరక్షించుకోవడం కోసం పాటించే బాహ్య సంరక్షణ పద్ధతులను & కేర్ టిప్స్ను ఆశించిన ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా, మీరు ఇంకా మీ జుట్టును కోల్పోతున్నారా ? అయితే ఇప్పుడు మాత్రం మీ శరీర అంతర్గత వ్యవస్థతో సంబంధం ఉన్న డైట్ & పోషకాహారాల గురించి తెలుసుకో వలసిన సమయం ఆసన్నమైంది.

  వాస్తవానికి, మీరు పోషకాహార లోపంతో ఉన్నట్లయితే, జుట్టుకు నష్టం జరగకుండా 'బాహ్య కేశ సంరక్షణ' ఏదీ కూడా మీకు సహాయం చేయదు. సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం జుట్టును పట్టి ఉంచి, చాలా ఆరోగ్యకరమైన జుట్టును పెంపొందించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఒత్తిడి, ఆయిలీ జుట్టు, చుండ్రు, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటి జుట్టును కోల్పోవడానికి దోహదం చేసే వివిధ కారణాలుగా ఉన్నప్పటికీ, ఇక్కడ మీరు మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ డైట్ను సవరించవచ్చు, అది ఎలానో చూద్దాం.

  Does Hair Fall Bother You? Here Are 10 Best Foods To Arrest Hair Fall

  కాబట్టి, మీ జుట్టు పతనాన్ని నిరోధించి - మందపాటి కుదుళ్లను తిరిగి పొందేందుకు సహాయం చేసే టాప్ ఫుడ్స్ జాబితాను ఇక్కడ చూడవచ్చు.

  మొలకెత్తిన ధాన్యాలు & పెరుగు :

  మొలకెత్తిన ధాన్యాలు & పెరుగు :

  మొలకెత్తిన ధాన్యాలలో విటమిన్-C తో పూర్తిగా నిండి ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించగలదని నిరూపించబడింది. పొడవాటి, ఒత్తైన జుట్టు కోసం కావలసినంత మోతాదులో విటమిన్లు - C, K లు అవసరమవుతాయి. మొలకెత్తిన ధాన్యాలు & బీన్స్లో ఉండే విటమిన్ E కూడా జుట్టుకు రక్త ప్రసరణను పెంచుతుంది, దీనితో మీ జుట్టు మూలాలు బలంగా మారి, మరింత అందంగా పెరుగుతాయి.

  పాలకూర :

  పాలకూర :

  పాలకూర (బచ్చలికూర) లో ఐరన్, విటమిన్ - A, C & ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. కైరో విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ఐరన్ లోపం & విటమిన్ D తక్కువ స్థాయిలో మీ జుట్టు మూలాలు సన్నబడటంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. వీటిలో ఐరన్ మాత్రమే కాకుండా, ఇది జుట్టుకు ఒక సహజ కండీషనర్గా కలిగి ఉండే సెబం అనే సమ్మేళనము కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇవి మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం & ఒమేగా -3 ఆమ్లాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది, అవన్నీ కూడా మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించడానికి బాగా సహాయపడతాయి. జుట్టు మూలాలకు పోషకాలను రవాణా చేయటానికి ఐరన్ చాలా అవసరం & ఈ లోపం కారణంగా జుట్టుకు ఏ విధమైన నష్టము జరగదు. ఆకుపచ్చని ఆకుకూరలు, లెటుస్, టర్నిప్ గ్రీన్స్ మొదలైన వాటిలో ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదపడే ఐరన్ను కలిగి ఉంటాయి.

  నట్స్ :

  నట్స్ :

  వాల్నట్స్ & ఆల్మండ్స్ వంటి నట్స్ను గుప్పెడు మోతాదులో తీసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అనుకూలమైన అంశాలను కలిగి ఉంటాదని నిర్ధారించుకోండి. వాల్నట్లలో విటమిన్లు B1, B6 & B9, బయోటిన్, విటమిన్ E, మాంసకృత్తులు & మెగ్నీషియములు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, సూర్యరశ్మి ద్వారా జుట్టును నష్టం కలిగించే పరిస్థితులను నివారిస్తుంది. జింక్, ఐరన్ & సెలీనియం వంటి గొప్ప సమ్మేళనాలు వాల్నట్స్లో ఉన్నాయి.

  జుట్టు సంరక్షణకు దోహదం చేసే బాదంలో కూడా తక్కువ మూలకాలను కలిగి ఉండదు. అలాగే అవి మెగ్నీషియమును గొప్ప స్థాయిలో కలిగి ఉంటాయి, అది, మీ జుట్టును బలంగా ఉంచి, జుట్టు పగిలిపోడాన్ని నిరోధించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. మీరు కూడా అద్భుతమైన జుట్టు సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతిరోజు నీటిలో 4 - 5 బాదం గింజలను కొన్ని గంటల పాటు నానబెట్టి, దాని పై ఉన్న తొక్కను తీసి, తినండి.

  క్యారెట్లు :

  క్యారెట్లు :

  పొడవైన నల్లని జుట్టుని కలిగి ఉండడంతోపాటు, దాని మొదళ్ళు బలంగా, దృఢంగా ఉండడం కోసం మీ రోజువారి ఆహారంలో క్యారెట్లను చేర్చండి. ఈ క్యారెట్లు మన కళ్ళకి చాలా మంచివని మనందరికీ తెలుసు ఎందుకంటే వీటిలో వకంటే వీటిలో విటమిన్ A మూలకం మోతాదులో లభ్యమవుతుంది. దానివల్ల మీ జుట్టు మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది. విటమిన్-ఎ లోపం కారణంగా పొడిజుట్టుకు, దురద చర్మానికి దారితీస్తుంది. క్యారెట్లలో పూర్తి మొత్తంగా లభించే పోషకాలను పొందటం కోసం, పచ్చి క్యారెట్లను తినటం చాలా ఉత్తమమైన మార్గము. ఇది నిర్జీవమైన జుట్టును, పట్టులాగా తయారుచేస్తుంది.

  గుడ్లు :

  గుడ్లు :

  గుడ్లు - విటమిన్ B12, మాంసకృత్తులు, జింక్, ఐరన్ & ఒమేగా కొవ్వు ఆమ్లాల వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉంటాయి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు చాలా అవసరమైనవి. జుట్టు నిర్మాణంలో 70% ప్రోటీన్లను కలిగి ఉంటుంది, గుడ్లలో ఉన్న ప్రోటీన్లు మీ జుట్టు నిర్మాణంలో దెబ్బతిన్న కెరాటిన్ అంతరాలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది, తద్వారా జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. గుడ్డులో ఉండే తెల్లనిసొన అనేది ప్రోటీన్కు ఉత్తమ మూలకంగా ఉంది. అంతేకాకుండా ఇది పొటాషియం, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, నియాసిన్ & సోడియం వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది, ఇవన్నీ జుట్టు పెరుగుదలకు బాగా అవసరమవుతాయి.

  ఆరెంజ్స్ :

  ఆరెంజ్స్ :

  విటమిన్ సి, ఫ్లేవానాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్, ఫైబర్ & మెగ్నీషియం వంటి మూలకాలు అన్ని నారింజల్లో పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు, దాని నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాక, జుట్టును నివారించడంలో ప్రధాన సమస్యగా ఉన్న చుండ్రును చికిత్స చేయడానికి నారింజ బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్-సి, ఐరన్ను సంగ్రహించగల శక్తిని శరీరానికి చేకూరుస్తుంది. ఈ ఐరన్ లోపం కారణంగా మీ జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది.

  English summary

  Does Hair Fall Bother You? Here Are 10 Best Foods To Arrest Hair Fall

  In fact, if you are nutrient-deficient, no amount of external hair care will help in arresting hair loss. A well-balanced nutritious diet can play a vital role in arresting hair fall and maintaining healthy hair. Although there are various reasons that can contribute to hair loss such as stress, oily scalp, dandruff, insomnia, hormonal imbalance and so on, here let us look at how you can modify your diet to improve the health of your hair.
  Story first published: Saturday, April 28, 2018, 14:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more