For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బామ్మ చిట్కా : మాయిశ్చర్డ్ హెయిర్ కోసం బేకింగ్ సోడా కండిషనర్

బామ్మ చిట్కా : మాయిశ్చర్డ్ హెయిర్ కోసం బేకింగ్ సోడా కండిషనర్

|

ఈ మధ్యకాలంలో హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో విపరీతంగా లాంఛ్ అవుతున్నాయి. ఇవి హెయిర్ ను అందంగా మారుస్తాయని ఆయా బ్రాండ్స్ వాటి ప్రకటనల్లో హోరెత్తిస్తున్నాయి. అయితే, హెయిర్ కేర్ కి మనం కేవలం మార్కెట్ లో లభ్యమయ్యే ఈ ప్రోడక్ట్స్ పైనే ఆధారపడాలా? అవసరమే లేదు. వంటింటి అరలో లభ్యమయ్యే ఎన్నో ఇంగ్రిడియెంట్స్ హెయిర్ కేర్ కి తోడ్పడతాయి.

అవును. గత కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చాలా మంది హెయిర్ కేర్ కై హోమ్ రెమెడీస్ ను వాడి శిరోజాల పోషణను అందుకున్నారు. ఇటువంటి బ్యూటీ సీక్రెట్స్ ఒక తరం నుండి ఇంకొక తరానికి చేరుతూ ఉంటాయి. ఇవి బామ్మ చిట్కాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ బ్యూటీ సీక్రెట్స్ ని పాటించి హెయిర్ ను అందంగా మరల్చుకున్నవారెందరో ఉన్నారు.

Grandmas Secret: DIY Baking Soda Conditioner For Moisturized Hair

అటువంటి ఒక బ్యూటీ సీక్రెట్ బేకింగ్ సోడా. అవును, మీరు చదివింది సరైందే. బేకింగ్ సోడా హెయిర్ కేర్ కై అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. గ్రేట్ లుకింగ్ హెయిర్ ను మీ సొంతం చేస్తుంది. మీ హెయిర్ ను దృఢంగా మార్చుతుంది.

హెయిర్ కి పోషణని అందించడానికి ఎన్నో మార్గాలున్నాయి. హెయిర్ ను మాయిశ్చరైజ్ చేయడం బేకింగ్ సోడా యొక్క ప్రముఖ లక్షణం. ఈ లక్షణం వలెనే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా, హెయిర్ కండిషనర్ గా వాడినప్పుడు ఇది హెయిర్ ని మాయిశ్చరైజ్ చేసి హెయిర్ ను చక్కగా కండిషన్ చేస్తుంది.

ఇది కేవలం హెయిర్ ను కండిషన్ చేయడమే కాదు హెయిర్ లోని మాయిశ్చర్ ని నిలిపి వేసేందుకు కూడా తోడ్పడుతుంది. ఇది టెక్స్చర్ ని మృదువుగా మార్చి హెయిర్ ను పొడిబారకుండా చేస్తుంది.

ఈ రోజు బోల్డ్ స్కై లో డీఐవై బేకింగ్ సోడా హెయిర్ కండిషనర్ గురించి తెలుసుకుందాం. ఈ కండిషనర్ హెయిర్ ను మాయిశ్చరైయిజ్ చేసి ఆరోగ్యవంతంగా మార్చుతుంది. శిరోజాల అపియరెన్స్ కూడా బాగుంటుంది.

బేకింగ్ సోడా ను హెయిర్ మాయిశ్చరైజేషన్ కోసం ఎందుకు వాడాలి?

స్కాల్ప్ పై పేరుకుపోయిన టాక్సిన్స్, ఇంప్యూరిటీస్, ప్రోడక్ట్ బిల్డ్ అప్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించే కాంపౌండ్స్ బేకింగ్ సోడాలో పుష్కలంగా లభిస్తాయి. వీటిని తొలగించడం ద్వారా హెయిర్ లో తగినంత మాయిశ్చర్ నిలిచి ఉంటుంది. మౌస్, సెరమ్, క్రీమ్ వంటి కమర్షియల్ హెయిర్ మాయిశ్చరైజింగ్ ప్రోడక్ట్స్ కంటే బేకింగ్ సోడా అనేది సురక్షితమైనది అలాగే అత్యంత సమర్థవంతమైనది. ఇందులో కఠినమైన కెమికల్స్ ఉండవు. అందువలన బేకింగ్ సోడాను ఉపయోగించడం వలన హెయిర్ పై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ అనేది ఫ్లేకీగా అలాగే డ్రై గా మారదు.

బేకింగ్ సోడా హెయిర్ కండిషనర్ ను తయారుచేయడమెలా?

ఇది ట్రైడ్ అండ్ టేస్టేడ్ రెమెడీ. ఈ రెసిపీ మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.


కావలసిన పదార్థాలు:

పావు కప్పుడు బేకింగ్ సోడా

అర కప్పు మంచి హెయిర్ కండిషనర్

1 షవర్ క్యాప్

1 హాట్ టవల్

తయారుచేసే విధానం:

• ఒక మిక్సింగ్ బౌల్ ను తీసుకుని పైన పేర్కొన్న మోతాదు బేకింగ్ సోడాను అలాగే హెయిర్ కండిషనర్ ను అందులో జోడించండి.

• ఈ పదార్థాలని బాగా కలిపి క్రీమీ పేస్ట్ ను సిద్ధం చేసుకోండి.

• ఆ తరువాత మీరు షాంపూ చేసుకునే వరకు ఆ పాత్రను లిడ్ తో కవర్ చేసుకోండి.

తయారుచేసే విధానం:

• షాంపూ చేసుకున్న తరువాత సిద్ధంగా పెట్టుకున్న కండిషనర్ ను హెయిర్ మొదళ్ళ నుంచి చివరి వరకు అప్లై చేయండి.

• మీ మునివేళ్లతో కొన్ని సెకండ్ల పాటు హెయిర్ ను మసాజ్ చేసుకోండి.

• వేడి టవల్ తో హెయిర్ ను వ్రాప్ చేయండి.

• ఈ డిఐవై హెయిర్ కండిషనర్ ను హెయిర్ పై గంటపాటు ఉంచండి.

• టవల్ మరియు క్యాప్ ను తొలగించి హెయిర్ ను నార్మల్ వాటర్ తో బాగా రిన్స్ చేయండి.

ఈ మాస్క్ ని ఎంత తరచుగా వాడాలి.

ఈ నేచురల్ హెయిర్ కండిషనర్ ని నెలకొకసారి వాడితే హెయిర్ కి తగినంత మాయిశ్చర్ అందుతుంది. హెయిర్ అఫియరెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి సెరమ్ మరియు స్టయిలింగ్ అవసరం లేకుండానే హెయిర్ లుక్ అదిరిపోతుంది.

బేకింగ్ సోడాను హెయిర్ కేర్ కు వాడటం వలన కలిగే మరికొన్ని ప్రయోజనాలు:

• బేకింగ్ సోడా స్కాల్ప్ పై ఉండే అదనపు ఆయిల్ ను గ్రహిస్తుంది. అందువలన ఇది ఆయిలీ టైప్ హెయిర్ కు సరిగ్గా సూట్ అవుతుంది. దీనిని స్కాల్ప్ పై అలాగే హెయిర్ కు అప్లై చేయడం వలన గ్రీజీ హెయిర్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

• దీనిని షాంపూలో కీ ఇంగ్రిడియెంట్ గా వాడతారు. ఇది స్కాల్ప్ ను అలాగే హెయిర్ ను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఇది స్కాల్ప్ పై పేరుకుపోయిన దుమ్ము ధూళిని అలాగే ప్రోడక్ట్ బిల్డ్ అప్ ను తొలగిస్తుంది.

• బేకింగ్ సోడా గొప్పతనమేంటంటే ఇది వాల్యూమ్ ను యాడ్ చేస్తుంది అలాగే నిర్జీవంగా ఉండే శిరోజాలకు జీవాన్ని అందిస్తుంది.

• ఇది సహజంగానే యాంటీ ఫంగల్ అయినందువలన బేకింగ్ సోడా అనేది డాండ్రఫ్ వంటి ఇబ్బందులను సులభంగా తొలగిస్తుంది. డాండ్రఫ్ కి సంబంధించిన ఇచింగ్ మరియు ఫ్లేకీనెస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

• హెయిర్ గ్రోత్ కై ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బేకింగ్ సోడా వలన హెయిర్ కు అందే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇపుడు తెలుసుకున్నాం కదా. అందువలన, ఈ మ్యాజిక్ ఇంగ్రిడియెంట్ ను హెయిర్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుని లాభం పొందండి మరి. బేకింగ్ సోడా హెయిర్ కండిషనర్ ను ఉపయోగించి అద్భుతమైన ప్రయోజనాలను పొందండి. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. అలాగే అత్యంత ప్రభావితమైనది కూడా. కాబట్టి, దీని ఉపయోగించి శిరోజాల అందాన్ని రెట్టింపు చేసుకోండి.

English summary

Grandma's Secret: DIY Baking Soda Conditioner For Moisturized Hair

Baking soda is a highly valued hair care ingredient that can help you get great-looking hair that is healthy and strong. While there are many ways in which it can benefit your hair, its ability to moisturize hair has made it particularly famous all over the world. Especially when used as a hair conditioner, it tends to work perfectly.
Desktop Bottom Promotion