For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోనమ్ కపూర్ లాగా ఎండాకాలం పెళ్ళికూతుళ్ళకి అచ్చం తనలాంటి జడ వేసుకునే చిట్కాలు

|

ఎండల్లో పెళ్ళిచేసుకునే పెళ్ళికూతుళ్ళు తమ మేకప్,హెయిర్ స్టైల్,బట్టలు వంటి అన్నిటిగురించి కంగారు పడుతుంటారు. మిగతా సీజన్లలో పెళ్ళికూతుళ్ళతో పోలిస్తే, ఎలాంటి బట్టలు వేసుకోవాలి నుంచి నీళ్ళకి కరగని మేకప్ వస్తువుల వరకూ, ముఖ్యంగా హెయిర్ స్టైల్, సమ్మర్ పెళ్ళికూతురుకి చాలా పని,కంగారు ఎక్కువ.

పెళ్ళంటే చాలా భారీ బట్టలు,హెయిర్ విగ్గులు,మేకప్ తప్పనిసరి అనేది ఒక పిచ్చి అపోహ.పెళ్ళికూతురు కొంచెం మేకప్ లో, అందమైన జడలో ఎలా అయితే తన సంగీత్ లో సోనమ్ కపూర్ తయారయ్యారో అలాగ తయారయితే చాలా అద్భుతంగా ఉంటారు.

ఫిష్ టెయిల్ జడ ఎలా వేయాలి

సోనమ్ కపూర్ తక్కువ మేకప్ తో చాలా అందంగా ఉన్నారు, పైగా ఫిష్ టెయిల్ జడతో పాత తరంగా ఉన్నా సింపుల్ గా అన్ని ఫంక్షన్లలో మెరిసిపోయారు. సున్నితమైన తెల్లని థీమ్ నుంచి అందమైన సున్నితమైన ఎర్రని మేకప్ తో ఆమె ఎలా పెళ్ళికూతురు కూడా తక్కువ,సున్నితమైన మేకప్ తో అందరికన్నా అందంగా కన్పించవచ్చో చూపించారు. జడలు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చాయి, అయితే మనం కూడా సోనమ్ తన సంగీత్ ఫంక్షన్ కి వేసుకున్న ఫిష్ టెయిల్ జడను నేర్చుకుందాం. ఆమె దానిపై మోగ్రా మల్లెపూలతో అలంకరించుకున్నారు.

మీరు ఈ కింది స్టెప్స్ ఫాలో అయి సోనమ్ సంగీత్ కి ఎలాంటి ఫిష్ టెయిల్ జడ వేసుకుందో అలాంటిదాన్నే మీరూ నేర్చుకోండి;

టిప్ # 1

టిప్ # 1

మీ జుట్టును మంచి దువ్వెనతో చిక్కులు తీసేసుకుని, కొంచెం సీరం రాసుకోండి. దీనివలన మీ హెయిర్ స్టైల్ శుభ్రంగా,అందంగా కన్పడేలా చేస్తుంది.

టిప్ # 2

టిప్ # 2

మీ జుట్టును రెండు సమాన భాగాలుగా వేరుచేయండి.ఇప్పుడు మీ ముందు కుడిభాగం,ఎడమ భాగం రెండూ ఉన్నాయి.

టిప్ # 3

టిప్ # 3

ఎడమ భాగం నుంచి సన్నని పాయ తీసుకోండి. బయటవైపు నుంచి తీసుకోండి. అది 1//2 అంగుళం(1.27 సెంటీమీటర్లు) కన్నా మందంగా ఉండకూడదు.

టిప్ # 4

టిప్ # 4

ఆ సన్ననిపాయను మొత్తం ఎడమభాగం మీదుగా కుడివైపుకి లాగండి.

టిప్ # 5

టిప్ # 5

ఆ పాయను కుడిభాగం కిందపెట్టి పిన్ను పెట్టండి. ఇప్పుడు అది కుడి సెక్షన్ లో భాగమైంది.

టిప్ # 6

టిప్ # 6

రెండు భాగాలను నెమ్మదిగా కొంచెం లాగి గట్టిగా నిలబడేలా చూడండి. మీ చేతులను ఎంతవరకూ వెళ్లగలిగితే అంతవరకూ పైకి వెళ్ళనివ్వండి. జడను ఎంత గట్టిగా వేస్తే,అంత మంచిది. తర్వాత చిందరవందర మెస్సీ లుక్ కోసం వదులు చేసుకోవచ్చు.

టిప్ # 7

టిప్ # 7

కుడి భాగం నుంచి సన్నని పాయ తీసుకోండి. బయటవైపు నుంచి తీసుకోండి. అది 1//2 అంగుళం(1.27 సెంటీమీటర్లు) కన్నా మందంగా ఉండకూడదు.

టిప్ # 8

టిప్ # 8

ఆ సన్ననిపాయను మొత్తం కుడిభాగం మీదుగా ఎడమవైపుకి లాగండి.

టిప్ # 9

టిప్ # 9

ఆ పాయను ఎడమభాగం కిందపెట్టి పిన్ను పెట్టండి. ఇప్పుడు అది ఎడమ సెక్షన్ లో భాగమైంది.

టిప్ # 10.

టిప్ # 10.

మీ జుట్టు చివరకొచ్చేవరకూ ఒకవైపు నుంచి మరోవైపు అలా అల్లుకుంటూ రండి. ఆఖరున కనీసం ఒక అంగుళం (2.54సెంమీలు) అల్లకుండా వదిలేస్తే బ్యాండు పెట్టుకోవచ్చు.

టిప్ # 11

టిప్ # 11

జుట్టు కిందకెళ్ళే కొద్దీ సన్నని వెంట్రుకలను కలుపుకుంటూ అల్లండి.ఇది మీ జడను మరింత సమంగా కన్పడేలా చేస్తుంది; మీ జుట్టు ఎప్పుడూ కిందకొచ్చేసరికి సాధారణంగా సన్నగా ఉంటుంది.

టిప్ # 12

టిప్ # 12

అల్లాక కింద ఒక బ్యాండు పెట్టేసేయండి. కావాలంటే జుట్టు వెంట్రుకలను కొన్ని తీసుకుని ఆ బ్యాండు చుట్టూ చుట్టేసి దాన్ని దాచేయవచ్చు. వెంట్రుకలను బాబీ పిన్ తో కదలకుండా చేయండి.

టిప్ # 1 3

టిప్ # 1 3

మీ అరచేతుల మధ్య జడను మెల్లగా రుద్దుతూ చిందరవందర మెస్సీ లుక్ ఉండే జడను తయారుచేయండి. కానీ మీకు ఎక్కువ లేయర్లు ఉంటే ఈ స్టెప్ చేయవద్దు. లేకపోతే మొత్తం లూజయిపోయి నిజంగానే ఎక్కువ చిందరవందర అయిపోతుంది.

ఈ జడ వేసేది క్యాజువల్ లుక్ కోసమో లేదా మోడ్రన్ పార్టీకో అయితే మీరు రంగురంగుల బీడ్స్ లేదా సన్నని టయారా లేదా కొన్ని అందమైన ఫంకీ క్లిప్స్ తోనో స్టైల్ చేయవచ్చు.

కానీ ఇది ఒక సంప్రదాయ ఫంక్షన్ కి అయితే, సోనమ్ లుక్ లో లాగ ఒక మల్లెపూల దండను పెట్టుకోవచ్చు. మంచి వాసననిస్తూ, తెలుపును సున్నితంగా చూపించే మోగ్రా మల్లెపూల దండ అందర్నీ ఆశ్చర్యపర్చి,మీ సంప్రదాయ భారతీయ డ్రస్ అందాన్ని,లుక్ ను మరింత అద్భుతంగా మార్చేస్తుంది.

సోనమ్ కన్పించిన లుక్ చాలా హుందాగా ఉంది,అస్సలు అతిగా లేదు. మీరు కూడా మీ పెళ్ళిరోజున ఈ సింపుల్,పాతకాలపు లుక్ ను ప్రయత్నించి అందంగా కన్పించవచ్చు.


English summary

Hair braiding tips for the summer bride just like Sonam Kapoor

A bride will look more beautiful in a subtle and light makeup followed by a trail of beautiful braid just like Sonam Kapoor dressed up for her Sangeet and rocked as well. Fishtail braid looks neat and can be paired with ethnic jhumkas. If it is for a casual look, you can style it up with cool funky colourful beads or a tiara.
Story first published:Friday, May 11, 2018, 17:24 [IST]
Desktop Bottom Promotion