నేచురల్ వేస్ లో హెయిర్ డై చేసుకోవడమెలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హెయిర్ డై కేవలం ఆడవాళ్లకే పరిమితం కాలేదు. పురుషులు కూడా హెయిర్ డై పట్ల మక్కువ కనబరుస్తున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ వెంట్రులకు తెల్లబడడం సాధారణం. అధ్యయనాల ప్రకారం మహిళల్లో ఏభై శాతం మంది తరచూ హెయిర్ డై చేయించుకుంటారని తెలుస్తోంది. అయితే, బ్లీచ్ చేసుకోవడం సురక్షితమేనా? అయితే, ఈ విషయాలను తెలుసుకునే ముందు హెయిర్ కి సంబంధించి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి.

యుమేలానిన్ అలాగే ఫియోమెలనిన్ అనే రెండు పిగ్మెంట్స్ వలన హెయిర్ కి సహజసిద్ధమైన రంగు అలవడుతుంది. బృనేట్ అలాగే డార్కెర్ హెయిర్ కలర్స్ లో యుమేలానిన్ అనేది లభిస్తుంది. ఫియోమెలనిన్ అనేది రెడ్ హెయిర్ కలర్ లో ఉంటుంది. పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు గ్రే హెయిర్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, హెయిర్ కలర్ ను మార్చుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది?

DIY home remedies to Dye your hair,Hair dye is quite a common sight today. But, it is equally damaging too. Its most common side effects are hair damage and split ends. That is where home remedies come into the picture. Simple home-based ingredients, including lemon, henna, or honey, could work wonders for your hair, l

బ్లీచ్ చేసుకున్నప్పుడు హెయిర్ లో నున్న నేచురల్ పిగ్మెంట్ అనేది తొలగించబడుతుంది. హైడ్రోజెన్ పెరాక్సయిడ్ అనేది సాధారణ బ్లీచింగ్ ఏజెంట్. హైడ్రోజెన్ పెరాక్సయిడ్ అనేది హెయిర్ షాఫ్ట్ లో కి ప్రవేశించి ఆక్సిజెన్ ను విడుదల చేస్తుంది. అప్పుడు పిగ్మెంట్స్ అనేవి విచ్చిన్నమయి హెయిర్ కలర్ అనేది నెమ్మదిగా చేరుతుంది. మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ హెయిర్ డైయింగ్ ప్రోడక్ట్స్ లో హానీకర కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.

కొన్ని డైయింగ్ ప్రోడక్ట్స్ చర్మంతో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు స్కాల్ప్ పై దురద, హెయిర్ లాస్, హెయిర్ బ్రేకేజ్ వంటి అలర్జిక్ రియాక్షన్స్ ఎదురవుతాయి. అయితే, ఈ సమస్యను నిర్మూలించేందుకు ఇతర రెమెడీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవి కెమికల్ ఫ్రీ అలాగే సురక్షితమైనవి. హెయిర్ ను డై చేసుకునే 7 నేచురల్ మార్గాలను తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను చదవండి మరి.

మీ హెయిర్ ను ప్రిపేర్ చేయండి:

ఈ కింద వివరించబడిన మెథడ్స్ ను పాటించే ముందు మీ హెయిర్ ను గుడ్ కండిషన్ లో ఉంచుకోవడం అవసరం. లేదంటే, డ్రై హెయిర్ సమస్య వేధించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమస్యను అరికట్టాలంటే, మీ హెయిర్ కు వారానికి రెండు లేదా మూడు సార్లు నూనెను పట్టించాలి. హెయిర్ ను బ్లీచ్ చేయడానికి కనీసం మూడు వారాల ముందు ఆయిలింగ్ ను ప్రారంభించండి. వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ మాస్క్ ను వాడండి.

 1. నిమ్మరసంతో హెయిర్ ను బ్లీచ్ చేయండి:

1. నిమ్మరసంతో హెయిర్ ను బ్లీచ్ చేయండి:

నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అందుకే ఇది హెయిర్ పై బెస్ట్ బ్లీచింగ్ గా ఉపయోగపడుతుంది. నిమ్మరసం అనేది హెయిర్ కలర్ ను లైటెన్ చేయడానికి తోడ్పడుతుంది.

కావలసిన పదార్థాలు:

• 1 కప్పుడు తాజా నిమ్మరసం

• సాధారణ హెయిర్ కోసం, పావు కప్పు వెచ్చటి నీళ్లు

• డ్రై హెయిర్ కోసం. పావు కప్పుడు కండిషనర్

• ఒక స్ప్రే బాటిల్

ఎలా వాడాలి

• నార్మల్ హెయిర్ కోసం:

• ఒక స్ప్రే బాటిల్ లో ఒక కప్పుడు తాజా నిమ్మ రసాన్ని అలాగే పావు కప్పుడు నీళ్లను కలిపి బాగా షేక్ చేయాలి.

• డ్రై హెయిర్ కోసం:

• ఒక పాత్రలో, ఒక కప్పుడు తాజా నిమ్మరసాన్ని అలాగే పావు కప్పుడు కండిషనర్ ని జోడించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోయాలి.

• హెయిర్ పై నిమ్మరసం మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. హెయిర్ అంతా కవర్ అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి.

• గంట నుండి రెండు గంటల వరకు ఈ మిశ్రమం హెయిర్ పైన ఉండాలి. ఈ సమయంలో, ఎండలో కూర్చోవాలి.

• ఆ తరువాత హెయిర్ ని నార్మల్ వాటర్ తో వాష్ చేసి కండిషనర్ ని వాడాలి.

• ఈ రెమెడీని వారానికి ఒకసారి వాడాలి. లేదా ఆశించిన ఫలితం పొందే వరకు ఈ రెమెడీని పాటించాలి.

2. ఆపిల్ సైడర్ వినేగార్ మరియు తేనెతో హెయిర్ ను బ్లీచ్ చేసుకోవడం:

2. ఆపిల్ సైడర్ వినేగార్ మరియు తేనెతో హెయిర్ ను బ్లీచ్ చేసుకోవడం:

ఆపిల్ సిడర్ వినేగార్ లోనున్న ఎసిడిక్ ప్రాపర్టీస్ హెయిర్ కలర్ ను లైటెన్ చేయడానికి తోడ్పడతాయి. మరోవైపు, తేనె అనేది సహజసిద్ధమైన హుమెక్టెంట్ గా పనిచేస్తుంది. హెయిర్ ను హైడ్రేట్ చేసి నరిష్ చేసేందుకు అలాగే హెయిర్ ను లైట్ చేసేందుకు ఈ పదార్థం తోడ్పడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

• ఒక కప్పుడు ఆపిల్ సిడర్ వినేగార్

• అర కప్పు తేనె

• ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

• టవల్

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, పైన చెప్పిన పదార్థాలని బాగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ పై ఈవెన్ గా పూర్తిగా అప్లై చేయాలి.

• ఇప్పుడు టవల్ తో హెయిర్ ను కవర్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి.

• మీ హెయిర్ ను మైల్డ్ షాంపూ లేదా కండిషనర్ తో ఉదయాన్నే వాష్ చేయాలి.

• ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు.

3. తేనె మరియు దాల్చిన చెక్కతో హెయిర్ ను బ్లీచ్ చేయడం:

3. తేనె మరియు దాల్చిన చెక్కతో హెయిర్ ను బ్లీచ్ చేయడం:

తేనెలో హైడ్రోజెన్ పెరాక్సయిడ్ అనేది తక్కువగా లభిస్తుంది. ఇది బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి హెయిర్ కలర్ ను లైటెన్ చేయడానికి తోడ్పడుతుంది. హెయిర్ లో మాయిశ్చర్ ని నిలిపి ఉంచడానికి కూడా ఈ పదార్థం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.

దాల్చినలో బ్లీచింగ్ ప్రోపర్టీలు కలవు. అలాగే మ్యాంగనీజ్, ఐరన్, కేల్షియం వంటి హెయిర్ నరిషింగ్ మినరల్స్ ఇందులో లభ్యమవుతాయి.

కావాల్సిన పదార్థాలు:

• రెండు టేబుల్ స్పూన్ల రా హనీ.

• రెండు టీస్పూన్ల దాల్చినచెక్క పొడి.

• రెండు టీస్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్.

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, ఈ పదార్థాలని బాగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ పై ఈవెన్ గా అప్లై చేయాలి.

• మీ హెయిర్ ను షవర్ క్యాప్ తో కవర్ చేసి ఈ మిశ్రమాన్ని కనీసం మూడు లేదా నాలుగు గంటల పాటు హెయిర్ పై ఉండనివ్వాలి.

• హెయిర్ ను తేలికపాటి షాంపూ మరియు కండిషనర్ తో వాష్ చేయాలి.

• ఈ ప్రాసెస్ ను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పాటిస్తే ఆశించిన ఫలితాలు లభ్యమవుతాయి.

4. హెన్నా మరియు చమోమైల్ టీ తో హెయిర్ బ్లీచింగ్:

4. హెన్నా మరియు చమోమైల్ టీ తో హెయిర్ బ్లీచింగ్:

హెన్నా అనేది నేచురల్ డై. ఇది గ్రే హెయిర్ ను కవర్ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే, మీకు డార్క్ బ్రౌన్ లేదా బ్లాక్ హెయిర్ కలిగి ఉంటే మీ హెయిర్ కలర్ ను లైట్ చేసి రెడ్డీష్ హైలైట్స్ ను అందించేందుకు తోడ్పడుతుంది.

చమోమైల్ టీలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలవు. దీన్ని హెన్నాతో కలిపి హెయిర్ మాస్క్ లా వాడటం వలన మంచి హెయిర్ కలర్ లభిస్తుంది.

కావలసిన పదార్థాలు:

అర కప్పుడు హెన్నా పౌడర్

అర కప్పుడు చమోమైల్ టీ

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, ఈ పదార్థాలని తీసుకుని పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ పై ఈవెన్ గా అప్లై చేయాలి. ఆ తరువాత షవర్ క్యాప్ తో కవర్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ పై కనీసం రెండు మూడు గంటల పాటు ఉండనివ్వాలి.

• ఆ తరువాత తేలికపాటి షాంపూతో అలాగే కండిషనర్ తో వాష్ చేయాలి.

• ఈ మాస్క్ ను వారానికి ఒకసారి వాడాలి.

5. చమోమైల్ టీ మరియు పెరుగుతో హెయిర్ బ్లీచింగ్:

5. చమోమైల్ టీ మరియు పెరుగుతో హెయిర్ బ్లీచింగ్:

చమోమైల్ టీలో హెయిర్ కలర్ ను లైటెన్ చేయడానికి అలాగే బ్రైటన్ చేయడానికి అవసరమైన న్యూట్రియెంట్స్ కలవు. అలాగే హెయిర్ ను రిజెనువేట్ చేసి సిల్కీ షైన్ ను పొందటానికి కూడా ఇది తోడ్పడుతుంది.

పెరుగులో తేలికపాటి బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలవు. అలాగే ఇందులో లభించే లాక్టిక్ యాసిడ్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెయిర్ ను నరిష్ చేసి రీహైడ్రేట్ చేసేందుకు తోడ్పడతాయి.

కావలసిన పదార్థాలు:

• నాలుగు చమోమైల్ టీ బ్యాగ్స్

• అర కప్పుడు ప్లెయిన్ పెరుగు

• రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం

• రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె (డ్రై హెయిర్ సమస్యను అరికట్టేందుకు)

• వేడి నీళ్లు

ఎలా వాడాలి:

• ఒక కప్పుడు వేడినీటిని ఒక జార్ లోకి తీసుకుని అందులో నాలుగు చమోమైల్ టీ బ్యాగ్స్ ను కలపాలి. ఈ టీబ్యాగ్స్ ను వేడి నీళ్లు కలిగిన జార్ లో పదినిమిషాల పాటు ఉంచాలి.

• ఆ తరువాత టీ బ్యాగ్స్ ను తీసేసి టీను చల్లారనివ్వాలి.

• ఒక పాత్రలో అర కప్పుడు ప్లెయిన్ పెరుగును,చమోమైల్ టీను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను జోడించాలి.

• ఈ పదార్థాలని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ పై ఈవెన్ గా అప్లై చేయాలి.

• ఎండలో గంట పాటు కూర్చోవాలి లేదా హెయిర్ అనేది పూర్తిగా ఆరేవరకు చేయాలి.

• ఆ తరువాత తేలికపాటి షాంపూ మరియు కండిషనర్ తో వాష్ చేయాలి.

• ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటించాలి.

English summary

DIY home remedies to Dye your hair

DIY home remedies to Dye your hair,Hair dye is quite a common sight today. But, it is equally damaging too. Its most common side effects are hair damage and split ends. That is where home remedies come into the picture. Simple home-based ingredients, including lemon, henna, or honey, could work wonders for your hair, l