ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్స్ తో నిగనిగలాడే శిరోజాలను సొంతం చేసుకోండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

సిల్కీ, స్మూత్ మరియు ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ కోసం మనమందరం కలలు కంటూ ఉంటాము. అయితే, ఈ రోజుల్లో అటువంటి హెయిర్ ను పొందటం అంత సులువు కాదు. అనేక టెన్షన్స్ అలాగే స్ట్రెస్ వలన శిరోజాల సౌందర్యం దెబ్బతింటుంది.

టౌన్స్ అలాగే సిటీలలో ఉండే పొల్యూషన్ హెయిర్ పై దుష్ప్రభావం చూపుతుంది. ఈ డేమేజ్డ్ హెయిర్ సమస్యను డీల్ చేయడానికి అనేక ఖరీదైన హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ పై ఆధారపడతాము. వీటిలో అనేక ఇనార్గానిక్ మెటీరియల్స్ ఉండటం వలన మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. ఆయా ప్రోడక్ట్స్ ని వాడటం వలన లాభం లేకపోగా మన జేబుకు చిల్లు కూడా అదనంగా ఏర్పడుతుంది.

hair care tips in telugu

కాబట్టి, ఇలా శిరోజాల సౌందర్యం కోసం కమర్షియల్ గా లభ్యమయ్యే కెమికల్ బేస్డ్ హెయిర్ కాస్మెటిక్స్ ను ప్రయత్నించి ఇబ్బందులు పడే కంటే ఇంట్లోనే సులభంగా హెయిర్ మాస్క్స్ ను తయారుచేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే హెయిర్ మాస్క్స్ లో వివరించబడిన పదార్థాలన్నీ సహజసిద్ధమైనవి. ఇవి వంటింట్లో సులభంగా లభిస్తాయి. ఈ మాస్క్స్ ను ప్రిపేర్ చేయడం చాలా సులభం. వీటిని తయారుచేసే విధానాన్ని ఈ ఆర్టికల్ లో స్పష్టంగా వివరించాము.

ఇంకెందుకాలస్యం? మీరు హెయిర్ ట్రీట్ మెంట్ ను ఇంట్లోనే ప్రయత్నించి ఆశించిన ఫలితాలను పొందండి.

1. యోగర్ట్ మాస్క్:

1. యోగర్ట్ మాస్క్:

ఈ మాస్క్ ని అప్లై చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రెండు స్కూప్ ల యోగర్ట్ తో స్కాల్ప్ పై జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత రెగ్యులర్ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి. యోగర్ట్ స్మెల్ అనేది కాస్తంత ఘాటుగా ఉండటం వలన మీ హెయిర్ పై యోగర్ట్ వాసన కాసేపు అలాగే ఉండటం సహజం. ఈ స్మెల్ ని తొలగించేందుకై షాంపూ సెకండ్ కోట్ తో అలాగే గోరువెచ్చని నీటితో హెయిర్ ను వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా సిల్కీ స్మూత్ గా హెయిర్ మారుతుంది. మీరెప్పటినుంచో కోరుకుంటున్నటువంటి హెయిర్ ను ఈ రెమెడీతో సొంతం చేసుకోవచ్చు.

2. హనీ మాస్క్:

2. హనీ మాస్క్:

ఈ మాస్క్ తయారీ కోసం మూడు టేబుల్ స్పూన్ల తేనెలో అర టీస్పూన్ క్యాస్టర్ ఆయిల్ మరియు ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పదార్థాలని బాగా కలిపి వీటిని హెయిర్ పై బ్రష్ తో అప్లై చేయాలి. ఇలా 20 నుండి 30 నిమిషాల పాటు ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను రిన్స్ చేయాలి. హెయిర్ లో స్టికీ నెస్ ను తొలగించేందుకై మీరు షాంపూని వాడవచ్చు. షాంపూని వాడితే కండిషనర్ ని వాడటం మరవవద్దు.

3. ఎగ్ మాస్క్:

3. ఎగ్ మాస్క్:

మీరు వెజిటేరియన్ అయినా లేదా పక్కా నాన్ వెజిటేరియన్ అయినా మీరు ఎగ్ ని హెయిర్ పై న్యూట్రిషన్ గా వాడవచ్చు. రెండు ఎగ్స్ ని బౌల్ లోకి తీసుకుని అందులో ఒక కప్పుడు పాలను జోడించండి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను అలాగే కాస్తంత నిమ్మరసాన్ని తీసుకుని ఈ పదార్థాలని బాగా కలపాలి. వీటిని హెయిర్ పై అప్లై చేసి 15-20 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో హెయిర్ ను రిన్స్ చేయాలి.

4. క్యాస్టర్ ఆయిల్ మాస్క్:

4. క్యాస్టర్ ఆయిల్ మాస్క్:

మూడు టేబుల్ స్పూన్ల కేస్టర్ ఆయిల్ కు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను జోడించండి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ బ్రాందీను కలపండి. ఈ మూడు పదార్థాలను బాగా కలపండి. ఆ తరువాత, ఈ మిశ్రమాన్ని శిరోజాల టిప్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేయండి. 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఆలాగే ఉండనివ్వండి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోండి.

5. కోకోనట్ మాస్క్ :

5. కోకోనట్ మాస్క్ :

దీనికోసం మీరు ఒక టేబుల్ స్పూన్ కన్వెన్షనల్ కోకోనట్ ఆయిల్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను జోడించాలి. ఈ రెండు ఆయిల్స్ బాగా బ్లెండ్ అయ్యేలా కలపాలి. ఆ తరువాత, ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ మిశ్రమం హెయిర్ పై ఉండాలి. ఆ తరువాత, చల్లటి నీటితో అలాగే షాంపూతో హెయిర్ ను రిన్స్ చేయాలి.

6. బనానా మాస్క్:

6. బనానా మాస్క్:

శిరోజాలకు బనానా అంటే ఇష్టం ఎక్కువ. ఈ మాస్క్ కై మీరు రెండు బనానాస్ ను తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ మిల్క్ ను అలాగే రిఫైండ్ ఆయిల్ మరియు తేనెను కూడా తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల తరువాత శిరోజాలను చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా చేస్తే సూపర్ సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

English summary

Homemade Hair Masks For Glossy Hair

All of us dream of silky, smooth and frizz-free hair. Hair masks help us achieve just that. Yoghurt hair mask, egg mask, oatmeal mask, honey mask, coconut mask or coconut oil mask could be an option to getting that shine back. These hair masks provide all the essential nutrition to your hair, making it super smooth and glossy..
Story first published: Monday, April 9, 2018, 12:00 [IST]