For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకి దోసకాయ రసం లాభం చేకూరుస్తుందా?

|

జుట్టుకి వచ్చే సమస్యలు కేవలం జుట్టు ఆరోగ్యాన్ని,సహజ అందాన్ని పాడుచేయటమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ కాలంలో ప్రతిఒక్కరికీ ఏదో ఒక జుట్టు సమస్య తప్పనిసరిగా వస్తోంది.

జుట్టు ఊడిపోవటం, వెంట్రుకల చివర్లు విరిగిపోవటం, చుండ్రు, ఎండిపోయిన మాడు వంటి సమస్యలు అందరికీ సాధారణమైపోయాయి. ఈ సమస్యలకి చికిత్సగా చాలామంది ఖరీదైన చికిత్సలకి వెళ్తున్నారు లేదా రసాయనాలతో కూడిన కమర్షియల్ జుట్టు ఉత్పత్తులని వాడుతున్నారు.

Is Cucumber Juice Beneficial For Hair?

ఈ రెండు పద్ధతులు మీకు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇవ్వొచ్చేమో కానీ దీర్ఘకాలంలో జుట్టుని పాడుచేస్తాయి.

ఇలాంటి రిస్క్ తో కూడిన పద్ధతులను పాటించేకన్నా, సహజ చికిత్సలు ప్రయత్నిస్తే జుట్టు సమస్యలతో పోరాడి,జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమేకాక, పోయిన జుట్టు అందం తిరిగొస్తుంది.

సహజంగా చికిత్స చేసుకోడానికి మీకు ఇంటి చిట్కాలు అవసరం. ఇవి చవకైనవి, సురక్షితమైనవి, సులభంగా దొరుకుతాయి. వీటిని పాటించి చూడటం మంచిది.

Is Cucumber Juice Beneficial For Hair?

జుట్టు సంరక్షణకి ఇంటి చిట్కాలు వాడటం ఎందుకు ముఖ్యం?

జుట్టు ఆరోగ్యం, సౌందర్యాన్ని నిలిపి వుంచటానికి విటమిన్లు, ఖనిజలవణాలు ముఖ్యం. ఈ పదార్థాలు చాలారకాలైన జుట్టు సమస్యలతో పోరాడి ఏ స్టైలింగ్ అవసరం లేకుండానే మీ జుట్టు అందంగా కన్పడేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని నిలుపుకోటానికి పండ్లు, కొన్ని ఆహారపదార్థాలు తినటమనేది సహజ పద్ధతి అయినా, మీ జుట్టుకి చికిత్స చేయటానికి ఈ పదార్థాలతో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.

మేము చెప్పేది శరీరం లోపలికి కాకుండా తల పైన రాసుకుని వాడుకునే ఇంటి చిట్కాల గురించి. ఆలివ్ నూనె, గుడ్లు, ఆలోవెరా జెల్, తేనె మొదలైన ఎన్నో ముఖ్య చిట్కాలు జుట్టు ఆరోగ్యానికి అవసరం. ఈ చిట్కాలు ముఖ్యమైన పోషకాలు,విటమిన్లు, మినరల్స్ ,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను జుట్టుకి అందిస్తాయి. ఇలాంటి ఇంటి చిట్కాలతో జుట్టుకి చికిత్స చేయటం అనేది జుట్టు ఊడిపోవటం, సన్నబడటం, చుండ్రు వంటి సమస్యలకి ప్రాచీన పరిష్కార పద్ధతి.

గుడ్లు, ఆలివ్ నూనె జుట్టుకి ఎన్ని లాభాలు అందిస్తాయో అందరికీ పాపులర్ గా తెలిసిన విషయమే అయినా, గత కొన్నేళ్ళుగా సహజ పదార్థాలైన దోసకాయ రసం కూడా జుట్టు సంరక్షణ పదార్థంగా ప్రసిద్ధి చెందింది.

Is Cucumber Juice Beneficial For Hair?

దోసకాయ రసం జుట్టుకి ఏ లాభాలు అందిస్తుంది?

అవును, దోసకాయ రసం జుట్టుకి లాభదాయకమే. జుట్టుకి దోసకాయ రసం ఈ కింది విధాలుగా ఉపయోగపడుతుంది.

-దోసకాయ రసంలో సిలికా, చాలా ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ పదార్థాలు దోసకాయ రసాన్ని జుట్టు పెరిగేలా చేస్తాయి.

-దోసకాయ రసంలో ఎక్కువుండే నీటిశాతం మీ జుట్టు కుదుళ్లకి,వెంట్రుకలకి తేమని అందించి జుట్టు అందంగా మారేలా చేస్తుంది.

-దోసకాయ రసంలో ఉండే ఖనిజలవణాలు వెంట్రుకలు విరిగిపోవటంతో పోరాడుతుంది. వెంట్రుకను బలంగా మార్చటంతో ఎక్కువ శాతం ఊడిపోకుండా చేస్తుంది.

-విటమిన్ ఎ, బి5,సి,కె పుష్కలంగా ఉండటంతో మంటగా,దురదగా ఉన్న మాడుకు ఉపశమనాన్ని అందిస్తుంది.

-జుట్టుకి తేమని అందించే గుణంతో,దోసకాయ రసం జుట్టు ఎండిపోకుండా చూస్తుంది. పొడి,చెక్కులుగా ఊడిపోయే తల మాడులున్నవారికి ఈ చిట్కా చాలా లాభాన్నిస్తుంది.

Is Cucumber Juice Beneficial For Hair?

దోసకాయ రసం హెయిర్ మాస్క్

సులభంగా తయారవుతుంది, చవక కూడా అవటంతో దోసకాయ రసం హెయిర్ మాస్క్ అంత పాపులర్ అయింది. జుట్టు ఎదగటానికి సాయపడటం దగ్గరనుంచి, వెంట్రుకలకి కాంతినివ్వటం వరకూ, ఈ ఇంట్లో తయారుచేసిన దోసకాయ మాస్క్ మీ జుట్టుకి లాభాలు అందిస్తుంది.

కావాల్సిన పదార్థాలు

2 పెద్ద చెంచాల దోసకాయ రసం

1 పెద్ద చెంచా ఆలోవెరా జెల్

1 చిన్నచెంచా ఆలివ్ నూనె

ఎలా తయారుచేయాలి ;

-దోసకాయను పెద్దముక్కలుగా కోసి జ్యూసర్ లో మిక్సీ పట్టండి.

-వచ్చిన దోసకాయ రసాన్ని బౌల్ లోకి తీసుకుని, తాజాగా తీసిన ఆలోవెరా జెల్ ను అందులో వేయండి.

-చెంచాతో రెండు పదార్థాలను కలపండి.

-ఆఖరుగా 1 చెంచా ఆలివ్ నూనెను ఈ మిశ్రమంలో కలపండి.

-కొంచెంసేపు కలిపితే మీ హెయిర్ మాస్క్ రెడీ.

ఎలా రాసుకోవాలి ;

-మీ జుట్టును పాయలుగా విడదీసి తయారుచేసిన మిశ్రమాన్ని కుదుళ్ళకి,మాడుకి పట్టించి నెమ్మదిగా మర్దన చేయండి.

-ఈ మాస్క్ను 30 నిమిషాలపాటు ఎండనివ్వండి.

-మిగిలిన పదార్థం పోవడానికి షాంపూతో తలంటుకుని, జుట్టులోనే ఉండిపోయే కండీషనర్ రాసుకోండి.

-ఈ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ ను వారంకోసారి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.

English summary

Is Cucumber Juice Beneficial For Hair?

Issues like hair fall, thinning, split ends, dandruff, dry scalp, etc., have become exceedingly common among people worldwide. And to treat these problems, most people either go for expensive procedures or use commercial hair products that are infused with harsh chemicals.
Story first published: Wednesday, August 15, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more