For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అల్లం వలన జుట్టు పొందే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

  |

  అల్లం- మన దైనందిన ఆహారపదార్ధాల తయారీలో వినియోగించే ముఖ్యమైన దినుసు. ఎదో ఒక సందర్భంలో మనందరం అల్లం టీ కొరకు అల్లాడినవారమే! అవునా, కాదా? అల్లంతో మన చర్మం మరియు జుట్టుకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అల్లంలో ఉండే సుగుణాలు మన చర్మ మరియు కేశ సౌందర్య సంరక్షణకు ఉపయోగపడతాయనడంలో అనుమానమే లేదు! కనుక మన దైనందిన కేశ సంరక్షణ కొరకు అల్లం వినియోగించడానికి ఆలోచన ఎందుకు?

  అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మరియు మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున, ఇది జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఎదుగుదలను పెంపొందించడంతో పాటుగా చుండ్రు, మాడు పోరిబారడం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.

  Surprising Benefits Of Ginger For Hair That You Didnt Know

  కనుక మనందరం అల్లం చేసే అద్భుతాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం. అల్లం చేసే మేలు ఏమిటి? మనకు అల్లం మామూలుగా ఆరోగ్యానికి చేసే మంచి గురించి తెలుసు.మనకు తెలియని ఆసక్తికరమైన అంశాలను గురించి, జుట్టుకు చేసే మేలు గురించిన సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

  1. చికాకు పుట్టించే చుండ్రు నుండి విముక్తి:

  1. చికాకు పుట్టించే చుండ్రు నుండి విముక్తి:

  నిజమే, చుండ్రు కలిగించే అసౌకర్యం అంతాఇంతా కాదు. కానీ మనమేమి చేయగలం? ఎన్ని రకాల షాంపూలు వాడినా ఉపశమనం దొరకదు. పార్లర్లకు వెళ్లి ప్రతిసారి ఖరీదైన చికిత్సలు చేయించుకోలేము. ఇటువంటి సమయంలో అల్లం మనకు అక్కరకు వస్తుంది. అల్లంలో ఉండే యాంటీమోక్రోబియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడటమే కాక జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

  2. అయ్యయ్యో! జుట్టు తెగ రాలిపోతుందే!:

  2. అయ్యయ్యో! జుట్టు తెగ రాలిపోతుందే!:

  జుట్టు రాలడానికి చుండ్రు కూడా ఒక ముఖ్య కారణం. కానీ దాన్ని నిరోధించడానికి మన దగ్గర మంచి పరిష్కారం ఉంది. అల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ జుట్టుకు పోషణను అందించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

  3. కాస్త ఆగండి, మీరు పొడిబారిన జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా?:

  3. కాస్త ఆగండి, మీరు పొడిబారిన జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా?:

  ఇది మనం ఎదుర్కొనే అవాంతరం. పొడిబారిన జుట్టు పెళుసుగా మారి, సులువుగా తెగిపోతుంది. ఇటువంటప్పుడు అల్లం సహజమైన కండీషనర్ గా పనిచేసి జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. ఇది మీ జట్టులోని తేమను కోల్పోనివ్వదు.

  4. మీ జుట్టు కోరుకునేది పోషణ మాత్రమే:

  4. మీ జుట్టు కోరుకునేది పోషణ మాత్రమే:

  అవును , ఈ పని అల్లం చేసి చూపిస్తుంది! అల్లంలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణను అందించి ఆరోగ్యంగా , బలంగా మారుస్తాయి.

  5. వావ్! అల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

  5. వావ్! అల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

  ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అల్లంలో ఉండే "జింజెరాల్" రక్తనాళాలను విశ్రాంతపరచి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది కేశాలకు అవసరమైన పోషణను అందించి జుట్టును పెరిగేట్టు చేస్తుంది.

  చిటికెలో మీకుమీరుగా ఇంట్లో కూర్చుని తాయారు చేసుకోగలిగే హెయిర్ మాస్కులు:

  చిటికెలో మీకుమీరుగా ఇంట్లో కూర్చుని తాయారు చేసుకోగలిగే హెయిర్ మాస్కులు:

  1. అల్లం మరియు కొబ్బరినూనె: అల్లంను కొబ్బరినూనెతో కలిపి వాడితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

  కావలసిన పదార్థాలు:

  1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం

  1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె

  వాడే విధానం: చిన్న గిన్నె తీసుకుని అందులో అల్లం తరుగు వేయండి. దీనికి కొబ్బరినూనె చేర్చి బాగా కలపండి

  ఒక ఐదునిమిషాలు ఆగి, జుట్టును పాయలుగా విడదీస్తూ, మొత్తం అంతటికీ శుభ్రంగా పట్టేలా ఈ మిశ్రమాన్ని రాసుకుని, అయిదు నిమిషాలు పాటు మర్దన చేసుకోండి.

  ఈ మిశ్రమాన్ని మాడుకు కూడా బాగా పట్టించి మర్దన చేసుకోండి. అరగంట తరువాత జుట్టును చల్లని నీటితో షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఆశించిన ఫలితాన్ని అందుకోవచ్చు.

  2. అల్లం మరియు నిమ్మరసం:

  2. అల్లం మరియు నిమ్మరసం:

  నిమ్మరసంతో కలిపి అల్లాన్ని ఉపయోగించినపుడు, మాడు యొక్క pH సమతుల స్థితికి చేరుకుని లోపలనుండి పోషణను అందిస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  2 టేబుల్ స్పూన్ల తురిమిన అల్లం

  ½ టేబుల్ స్పూన్ నిమ్మరసం

  3 టేబుల్ స్పూన్ల నువ్వులనూనె

  వాడే విధానం: చిన్న గిన్నె తీసుకుని అందులో అల్లం తరుగు వేయండి. దీనికి నిమ్మరసం, నువ్వులనూనె చేర్చి బాగా కలపండి. ఒక ఐదునిమిషాలు ఆగి, జుట్టును పాయలుగా విడదీస్తూ, మొత్తం అంతటికీ శుభ్రంగా పట్టేలా ఈ మిశ్రమాన్ని రాసుకుని, అయిదు నిమిషాలు పాటు మర్దన చేసుకోండి.

  ఈ మిశ్రమాన్ని మాడుకు కూడా బాగా పట్టించి మర్దన చేసుకోండి. అరగంట తరువాత జుట్టును చల్లని నీటితో షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఆశించిన ఫలితాన్ని అందుకోవచ్చు.

  3. అల్లం, దోసకాయ మరియు నిమ్మరసం:

  3. అల్లం, దోసకాయ మరియు నిమ్మరసం:

  దోసకాయలో విటమిన్ ఎ, సిలికా మరియు సల్ఫర్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహించి, రాలడాన్ని అరికడుతుంది.

  కావలసిన పదార్థాలు:

  2 టేబుల్ స్పూన్ల తురిమిన అల్లం

  ½ టేబుల్ స్పూన్ తురిమిన దోసకాయ

  1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె

  1 టేబుల్ స్పూన్ తులసి నూనె

  వాడే విధానం: చిన్న గిన్నె తీసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలను అన్నిటిని ఒకదాని తరువాత ఒకటి వేసి స్థిరమైన మిశ్రమాన్ని తయారు చేయండి. ఒక ఐదునిమిషాలు ఆగి, జుట్టును పాయలుగా విడదీస్తూ, మొత్తం అంతటికీ శుభ్రంగా పట్టేలా ఈ మిశ్రమాన్ని రాసుకుని, అయిదు నిమిషాలు పాటు మర్దన చేసుకోండి.

  ఈ మిశ్రమాన్ని మాడుకు కూడా బాగా పట్టించి మర్దన చేసుకోండి. అరగంట తరువాత జుట్టును చల్లని నీటితో షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఆశించిన ఫలితాన్ని అందుకోవచ్చు.

  English summary

  Surprising Benefits Of Ginger For Hair That You Didn't Know

  Ginger is rich in antioxidants and is loaded with manganese and copper. Ginger is said to be one of the essential ingredients to promote hair growth. And yes, along with promoting hair growth, ginger also helps to control the commonly faced hair problems like dandruff and dryness or flakiness. Ginger offers a lot of health benefits for our skin as well as our hair.
  Story first published: Saturday, May 19, 2018, 17:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more