For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డును వదిలించుకోవడానికి చిట్కాలు

తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డు సమస్యను ఎదుర్కోవటం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా మీ రూపాన్ని నాశనం చేయగల ఒక వికారమైన స్థితిగా ఉంటుంది మరియు, ఈ ఇబ్బందికరమైన జుట్టు వల్ల బాధపడుతున్న లెక

|

తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డు సమస్యను ఎదుర్కోవటం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా మీ రూపాన్ని నాశనం చేయగల ఒక వికారమైన స్థితిగా ఉంటుంది మరియు, ఈ ఇబ్బందికరమైన జుట్టు వల్ల బాధపడుతున్న లెక్కలేనంతమంది మహిళలు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు.

వివిధ అనివార్య కారకాల వల్ల మీ తలపై చర్మంలో ఆయిల్ అధిక స్థాయిలో ఉత్పత్తికి అయ్యేందుకు దారి తీయవచ్చు మరియు మీ రూపం జిడ్డుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది.

tips to get rid of oily scalp

ఈ బాధించే జుట్టుతో మీరు చాలా బాధపడుతూ ఉండి దానిని వదిలించుకోవాలని కోరుకునే వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారికి ఈరోజు అందించే ఈ వ్యాసం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ఈరోజు, మీ తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డును వదిలించుకోవడానికి పాటించవలసిన చిట్కాలను మరియు ట్రిక్కుల గూర్చి ఒక జాబితాను సిద్దం చేసి, మీ ముందుకు తెచ్చాము.

నిపుణుల చేత ఆమోదించబడిన ఈ ఉపాయాలు మీ యొక్క ప్రపంచాన్ని భిన్నమైన స్థితిలో తయారు చేసేదిగానూ, మరియు మీ జుట్టు యొక్క భిన్నమైన స్థితికి కారణమైన జిడ్డును మరియు అపరిశుభ్రతను నిరోధించడానికి బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా, ఈ చిట్కాలను అమలుపరచడంలో ఏ విధంగానూ డబ్బును ఖర్చు చేయకుండా సులభంగా అనుసరించవచ్చు. కాబట్టి, కేవలం మీ జుట్టు సంరక్షణ కోసం మీరు తరచుగా పాటించే పద్ధతుల్లో కొన్ని మార్పులను చేసి మరియు తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డుకు శాశ్వతంగా 'గుడ్-బై' చెప్పండి.

1. డ్రై షాంపూను ఉపయోగించండి :

1. డ్రై షాంపూను ఉపయోగించండి :

డ్రై షాంపూను తలపై చర్మానికి మరియు జుట్టుకు ఉన్న జిడ్డును వదిలించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడినది. మీ జుట్టు కోసం తల స్నానం చెయ్యడంలో ఉపయోగించి పద్ధతిలో ఈ డ్రై షాంపూను కూడా కొంత మోతాదులో వినియోగించండి. ఇది అధికంగా ఉన్న ఆయిల్ను గ్రహించి, మీ తల చర్మాన్ని శుభ్రంగానూ మరియు క్లియర్ గానూ ఉంచుతుంది.

2. గుడ్డులో ఉండే తెల్లని సొనతో మీ జుట్టుకు ప్యాక్ వెయ్యండి :

2. గుడ్డులో ఉండే తెల్లని సొనతో మీ జుట్టుకు ప్యాక్ వెయ్యండి :

గుడ్డులో ఉండే తెల్లని సొనతో అప్లై చేసే ప్యాక్ అనేది జిడ్డుగా ఉన్న తల-చర్మానికి మరియు జుట్టుకు అనుసరించబడే చాలా పురాతనమైన పద్ధతి. ఈ హైయిర్ ప్యాక్ లో గొప్పగా మూల పదార్థంగా ఉండే ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, మీ చర్మం నుండి అదనంగా ఉత్పత్తి అవుతున్న ఆయిల్ ను సమర్థవంతంగా పోగొట్టగలదు. జిడ్డు సమస్యతో బాధపడుతున్నా మహిళలు, వారానికి ఒకసారైన ఈ ప్యాక్ ను ఇంట్లో తయారు చేసుకొని, తలపై అప్లై చేయడం వల్ల స్వేచ్చగా గాలిలో తేలియాడే అందమైన కురులను సొంతం చేసుకోవచ్చు.

3. తలపై దువ్వేనతో అధికంగా రుద్దడాన్ని మానుకోండి :

3. తలపై దువ్వేనతో అధికంగా రుద్దడాన్ని మానుకోండి :

హైయిర్ బ్రష్ తో మీ చర్మంపై మితిమీరి దువ్వడం వల్ల "సెబుం" ( sebum - క్రొవ్వు మరియు శ్లేషపటలము క్షయము కలిసిన మిశ్రమము) యొక్క అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. అందువల్ల, ప్రజలు తమ జుట్టును రెండుసార్లు మాత్రమే బ్రషింగ్ చేయమని జుట్టు సంరక్షణ నిపుణులు కోరుతున్నారు, ఎందుకంటే అంతకుమించి బ్రషింగ్ చెయ్యడం మంచిది కాదని సూత్ర ప్రాయంగా చెబుతున్నారు.

4. హీట్ స్టైలింగ్ పరికరాలకు దూరంగా ఉండండి :

4. హీట్ స్టైలింగ్ పరికరాలకు దూరంగా ఉండండి :

మనలో చాలామంది నిఠారుగా (లేదా) వంపులు తిరిగిన జుట్టు కోసం నిరంతరాయంగా హీట్-స్టైలింగ్ (వేడిని కలుగజేసే) సాధనాలను ఉపయోగిస్తారు. ఇది చర్మం యొక్క "సెబుం" అనే జిడ్డును అధికంగా ఉత్పత్తి చేసేందుకు దారితీస్తుంది, అందువల్ల అది జిడ్డు కలిగిన జుట్టుకు దారితీస్తుంది. కాబట్టి, హీట్-స్టైలింగ్ టూల్స్ నుండి దూరంగా ఉండటం మంచిది.

5. మీ తలపై చర్మమును తాకడాన్ని నివారించండి :

5. మీ తలపై చర్మమును తాకడాన్ని నివారించండి :

మీ తలపై చర్మము అధిక మొత్తంలో మలినాలను, ధూళి మరియు దుమ్మును కలిగి ఉండడం చేత కూడా మీ తలపై చర్మముపై సెబుంను అధికంగా-ఉత్పత్తి అయ్యేందుకు దారితీస్తుంది. అలాగే మీ చేతులు మీ తలపై చర్మాన్ని తాగడం వల్ల చేతులకు ఉన్న దుమ్ము మొత్తం కూడా తలపైకి బదిలీ కాబడేందుకు ఉన్న ఒక మార్గమని చెప్పవచ్చు. కాబట్టి, మీరు మీ తలని చేతులతో తాకేటప్పుడు మీ చేతులు శుభ్రంగా ఉన్నవని ఖచ్చితంగా నిర్ధారించుకుని, తలకు పట్టే జిడ్డును నివారించుకోండి.

6. ఆపిల్ సైడర్ వినెగార్ను అప్లై చేయాలి :

6. ఆపిల్ సైడర్ వినెగార్ను అప్లై చేయాలి :

ఆపిల్ సైడర్ వినెగార్లో ఎసిటిక్ ఆమ్లం అధికముగా ఉండటం వల్ల మీ తలపై ఉన్న జిడ్డుకు కారణమైన దుమ్ము (వ్యర్ధాల)ను శిధిలాలను నుండి తొలగించడం వల్ల, జిడ్డు ఉత్పత్తి కాకుండా నిరోధించవచ్చు. జిడ్డు సమస్య పరిష్కారం కోసం మంచినీటితో ఈ వెనిగర్ను కలిపి మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రకమైన పద్ధతిని వారానికి ఒకసారి ఉపయోగించడం వలన మీ జుట్టుకు ఉన్న జిడ్డు సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

7. జిడ్డుగా ఉన్న జుట్టుకి, సరిగ్గా సరిపోయే ఉత్పత్తి సాధనాలను వాడండి :

7. జిడ్డుగా ఉన్న జుట్టుకి, సరిగ్గా సరిపోయే ఉత్పత్తి సాధనాలను వాడండి :

మీ జుట్టు జిడ్డుగా గాని ఉంటే, అప్పుడు ఈ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇటువంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ను వాడటం వల్ల మీ తలచర్మంపై అదనముగా ఉన్న ఆయిల్ను గ్రహించి, మీ తలపై ఉన్న తంతువుల (కణాల) ను జిడ్డగా మార్చకుండా నిరోధించే పదార్ధాలను ఇవి కలిగి ఉంటాయి.

8. మీ తలపై చర్మాన్ని మరియు జుట్టును శుభ్రం ఉంచండి :

8. మీ తలపై చర్మాన్ని మరియు జుట్టును శుభ్రం ఉంచండి :

ఇది వినడానికి తెలివిలేనిదిగా అనిపించవచ్చు; ఏమైనప్పటికీ, మీ తలపై మురికిని కలిగి ఉండి, మీ జుట్టు దుర్బలమైన పరిస్థితిని కలిగి ఉండి, ఆయిల్ గా ఉన్న మీ జుట్టును మరియు వెంట్రుకలను ఎల్లవేళలా శుభ్రంగా చేసుకొని, ఉండటంవల్ల జిడ్డు వల్ల మీ జుట్టుకు కలిగే హానిని కలుగ చేసే సమస్యలను అధిగమించవచ్చు. అందుకోసం మీరు మీ జుట్టును పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

English summary

tips to get rid of oily scalp | tricks to get rid of oily scalp | how to get rid of oily scalp | easy method to get rid of oily scalp

Breaking the taboo around mental health issues is one of the biggest concerns of this decade because of the number of myths flying around about the different illnesses. Take for example depression, which is believed to be a simple case of extreme sadness, but which in reality is an insidious problem that can only be treated by medical professionals.
Story first published:Wednesday, January 10, 2018, 15:31 [IST]
Desktop Bottom Promotion