For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిట్లిన జుట్టు అందవిహీనంగా కనబడుతోందా? ఇలా చేయండి

చిట్లిన జుట్టు అందవిహీనంగా కనబడుతోందా? ఇలా చేయండి

|

జుట్టు సమస్యలు అనేకం. అందులో ఒకటి జుట్టు చివర్లు చిట్లడం. ఇది చాలా మందికి ఉండే సాధారణ సమస్య. ఈ సమస్యను మనం తెలిసో తెలియకో నిర్లక్ష్యం చేయడం వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. దానికి తోడు మనం నిత్యం జుట్టుకు చేసే ప్రయోగాలు మరియు హెయిర్ స్టైలింగ్ అలవాట్ల వల్ల జుట్టు మరింత చిట్లి డ్యామేజ్ అవుతుంది. జుట్టును చాలా ఒత్తిడితో దువ్వడం లేదా హీటింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది.

ఇంకా జుట్టును మరింత నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా జుట్టు మరింత పాడవుతుంది. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా చిట్లుతుంది. జుట్టు చిట్లిన తర్వాత ఏం చేయలేం. మరింత నష్టం జరుగుతుంది. అయితే ముందుగా గుర్తించినట్లైతే కొన్ని చిట్కాలు మరియు నివారణ మార్గాలను అనుసరించడం వల్ల ఉన్న జుట్టు మరింత డ్యామేజ్ కాకుండా నివారించవచ్చు.

8 Effective Tips To Tackle Split Ends

కాబట్టి, ఈ రోజు మీకు మేము సూచించే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను అనుసరిస్తే చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. మీ సమస్యను నివారిసతుంది. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..!

1. మీ జుట్టుకు కావల్సింది ఆయిల్ ట్రీట్మెంట్

1. మీ జుట్టుకు కావల్సింది ఆయిల్ ట్రీట్మెంట్

జుట్టుకు నూనె రాయడం చాలా అవసరం. నూనె రాయడం వల్ల జుట్టు చిట్లడం తగ్గుతుంది.. జుట్టుపై నూనె ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా నిలుస్తుంది. దాంతో జుట్టు పాడవకుండా నివారిస్తుంది. నూనె రాయడం వల్ల షాంపుతో స్నానం చేసేప్పుడు కూడా జుట్టుకు హాని జరగకుండా ఉంటుంది. నూనెల్లో ఉండే లూబ్రికెంట్స్ మరియు పోషకాలు జుట్టుకు ఆయిల్ మసాజ్ ప్రయోజనాలను అందించి జుట్టు పాడవకుండా నివారిస్తుంది. అందువల్ల మీరు తలస్నానం చేసే ప్రతి సారి ముందుగా నూనెతో జుట్టుకు మసాజ్ చేసి ఒకటి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

2. తల దువ్వడంలో తగు జాగ్రత్తలు

2. తల దువ్వడంలో తగు జాగ్రత్తలు

మనం జుట్టుపై ఎక్కువ ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల జుట్టు మరింత పాడవుతుంది. ముఖ్యంగా తల దువ్వడంలో చిన్న పాటి మెలకువులు పాటించడం వల్ల జుట్టును కాపాడుకోవచ్చు. తల దువ్వుడం స్మూత్ గా ఉండే దువ్వెనతో స్మూత్ గా దువ్వాలి. అలాగే వెంట్రుకలు ముడి పడి ఉంటే చేత్తో చాలా సున్నితంగా దువ్వాలి. దువ్వునతో లాగడం లేదా బలవంతంగా దువ్వడం ద్వారా జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిట్లడం ఎక్కువ అవుతుంది. పళ్ళు వెడల్పుగా ఉండే దువ్వెనతో తలదువ్వుకోవాలి.

3. హీట్ స్టైలింగ్ పరికరాలకు దూరంగా ఉండండి :

3. హీట్ స్టైలింగ్ పరికరాలకు దూరంగా ఉండండి :

జుట్టుకు ఎక్కువ వేడి కలిగించే పరికరాలను ఉపయోగించడం వల్ల జుట్టు మరింత చిట్లుతుంది. జుట్టుకు మరింత స్టైల్ చేయడానికి ఉపయోగించే వేడి పరికరాలు వల్ల భవిష్యత్తులో కూడా మరింత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, వేడి పరికరాలను ఉపయోగించడానికి అప్పుడప్పుడు విరామం ఇవ్వాలి. అప్పుడు మీ జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడం ప్రారంభిస్తుంది.

4.చిట్లిన జుట్టును లాగడానికి ప్రయత్నించకండి

4.చిట్లిన జుట్టును లాగడానికి ప్రయత్నించకండి

జుట్టు చిట్లడాన్ని మీరు గమనించినట్లైతే వెంటనే మీరు వాటి విడదీయడానికి మరియు లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయకండి. అలా చేయడం వల్ల జుట్టు మరింత బలహీనపడుతుంది. దాంతో మరింత ఎక్కువ జుట్టు చిట్లడం ప్రారంభం అవుతుంది..

5. కండీషనర్ వాడండి

5. కండీషనర్ వాడండి

క్రమంగా కండీషనర్ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కండీషనర్ వాడరు. అయితే చిట్లిన జుట్ుట ఉన్నప్పుడు కండీషనర్ వాడటం వల్ల తిరిగి అలా జరగకుండా చేస్తుంది.

6. సున్నితంగా జుట్టును తడిలేకుండా చూసుకోవాలి

6. సున్నితంగా జుట్టును తడిలేకుండా చూసుకోవాలి

తలస్నానం చేసిన తర్వాత జుట్టును సరిగా తడిని తొలగించకపోవడం వల్ల వెంటనే తేమ మీద జుట్టును దువ్వడం , రఫ్ గా ఉండే టవల్ తో ఎలా పడితే అలా తుడవడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల పాత బడిన టీషర్ట్, కాటన్ వస్త్రాలతో తలను తుడవడం వల్ల తేమ పూర్తిగా తొలగిపోతుంది. .

7. ప్రోటీన్ హెయిర్ మాస్క్

7. ప్రోటీన్ హెయిర్ మాస్క్

మీ జుట్టుకు ప్రోటీన్ చాలా అత్యవసరమైన పోషకాంశం. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ డ్యామేజ్ అయిన జుట్టుకు ప్రోటీన్లు చాలా అవసరం . కాబట్టి, అప్పుడప్పుడు ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వాడటం మంచిది. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది మరియు డ్యామేజ్ అయిన జుట్టుకు రక్షణ కవచంలో పనిచేస్తుంది.

8. జుట్టును రెగ్యులర్ గా ట్రిమ్ చేయాలి

8. జుట్టును రెగ్యులర్ గా ట్రిమ్ చేయాలి

చిట్లన జుట్టును వెంటవెంటనే ట్రిమ్ చేయడం వల్ల మిగిలిన జుట్టు పాడవకుండా ఉండటమే కాకుండా, జుట్టు అందంగా కనబడుతుంది. ఇది వరకే చిట్లిన జుట్టును ఏం చేయలేం కాబట్టి ఆరోగ్యం మరియు మరింత డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ట్రిమ్మింగ్ చేయండి.

English summary

8 Effective Tips To Tackle Split Ends

Split ends are dreaded by all. It is the worst kind of damaged that can happen to your hair. And what is more surprising and alarming is that we are ourselves unintentionally damaging our hair. Our everyday practices and hairstyling habits are what cause split ends. Whether it is harshly combing your hair or heedlessly using heat styling products and procedures, it is damaging to our hair
Desktop Bottom Promotion