For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండగల సమయంలో స్పెషల్ గా ...ఆకర్షణీయంగా కనబడాలంటే...

|

పండగ వచ్చిందంటే చాలు.. మహిళల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గ్రాండ్ గా జరుపుకొనే పండుగలలో దీపావళి పండుగ ఒకటి. పిల్లలు, పెద్దలతో పాటు చాలా ఉత్సహాంగా దీపకాంతులతో సెలబ్రేట్ చేసుకొనే పండగ కూడా దీపావళి పండుగే. దీపాళి రోజున కొత్త బట్టలు వేసుకుంటాం...కానీ ఫేస్ మాత్రం డల్ గా ఉందే...అనుకుంటుంటారు.

పండుగల సమయంలో ఎంత అందంగా అలంకరించుకొంటే అంత సాంప్రదాయంగా కనబడుతారు. ముఖ్యంగా దీపావళి రోజున కొత్తబట్టలు, సౌందర్యం, అలంకరణతోనే పండుగ వాతవరణం కనబడుతుంది. పిల్లలు పెద్దలు అంతా చాలా ఉత్సహాంగా కబడుతారు. దీపాళికి విద్యుత్ దీపాలంకరణతో ఇంటి అలంకరణ మాత్రమే కాదు, ఇంట్లో వారి అలంకరణ కూడా ముఖ్యమే. ఇలాంటి పండుగల సందర్భాల్లో మనం అందరికంటే స్పెషల్ గా..అందంగా...ఆకర్షణీయంగా కనిపించాలి కదా...మరి దానికోసం ఎలాంటి ఫేస్ ప్యాక్ లు వేసుకోవాలో ఓసారి చూద్దాం...

క్లెన్సింగ్:

క్లెన్సింగ్:

మెత్తగా పొడిలా చేసుకొన్న ఓట్ మీల్, పెరుగు సమంగా తీసుకొని, అందులో తేనెను గోరువెచ్చగా చేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 10 నిముషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని క్లెన్సింగ్ చేసి కొత్త మెరుపు వలచ్చేలా చేస్తుంది. పైగా ఇది ఏ చర్మతత్వం ఉన్నవారికైనా సరిపోతుంది.

సెన్సిటివ్ స్కిన్ కోసం :

సెన్సిటివ్ స్కిన్ కోసం :

కాలుష్యం, సరైన సంరక్షణ లేకపోవడం...మొదలైన కారణాల వల్ల కొంతమందిలో చర్మం గరుకుగా తయారవుతుంది. ఇలాంటి వారు ఈ చిట్కాను పాటిస్తే చర్మాన్ని మ్రుదువుగా మారేలా చేయవచ్చు. గంధం పొడి తీసుకొని తగినన్ని పచ్చిపాలు కలిపి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పాలు చర్మానికి పోషణనిచ్చి సున్నితంగా మారేలా చేస్తుంది. చందనం చర్మకాంతి పెరిగేలా చేస్తుంది. పొడిచర్మం ఉన్నవారు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కాంతివంతమైన చర్మం కోసం :

కాంతివంతమైన చర్మం కోసం :

తేనె నిమ్మరసం సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖానికి ఇన్ స్టెంట్ గ్లో ఇచ్చి మెరిసేలా చేస్తుంది.

స్క్రబింగ్ :

స్క్రబింగ్ :

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల బొప్పాయి, ఒక చెంచా బియ్యం పిండి, 2చెంచాల తేనె, పంచదార పొడి ఒక చెంచా మిక్స్ చేసి బాగా కలగలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5నిముషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగిపోతాయి. అలాగే చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకొని రాత్రంతా నీటిలో నానెబట్టుకోవాలి. వాటీని మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించి పది నిముషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మోచేతులకు:

మోచేతులకు:

అందం విషయంలో ముఖానికున్న ప్రాధాన్యమే చేతులకు కూడా ఉంటుంది. అయితే కొంత మందిలో మేనిఛాయ భాగానే ఉన్నా మోచేతులు, మోకాళ్ళ దగ్గర నల్లగా ఉంటుంది. ఇలాంటి వారు మినపప్పుతో చేసిన ప్యాక్ వేసుకోవడం ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు. కొద్దిగా మిననప్పు తీసుకొని దాన్ని రాత్రంతా నీటిలో నానబె్టి మరుసటి రోజు ఉదయం మెత్తగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా బొప్పాయి గుజ్జును కూడా జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్ల దగ్గర రాసుకొని, పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మోచేతులు దగ్గర నలుపుదనం తగ్గుతుంది.

టోనర్:

టోనర్:

ముందుగా ముఖం శుభ్రం చేసి తర్వాత టోనర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మ శుభ్రపడుతుంది. టోనర్ ను అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా వేసుకొన్న మేకప్ చాలా సేపు అలాగే ఉండేలా చేస్తుంది.

 ఫౌడేషన్

ఫౌడేషన్

. మేకప్ వేసుకొనే ముందు ఫౌడేషన్ తో మొదలు పెట్టాలి. ముఖం మీద ఏదేని నల్లని మచ్చలు, మొటిమలు తాలూకు మచ్చలు ఉన్నట్లైతే కన్సీలర్ ను తప్పనిసరిగా వాడాలి. కన్సీలర్ ను ఉపయోగించడం వల్ల నల్ల మచ్చలు చర్మ రంగుతో కలిసిపోయినట్లు కనబడుతుంది. ఫౌండేషన్, కన్సీలర్ రెండూ కొనే ముందు మీ చర్మతత్వానికి సరిగ్గా సరిపోయేది మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

ఐలైనర్

ఐలైనర్

లైట్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. తర్వాత కళ్ళకు వేసుకొనే మేకప్ లిప్ స్టిక్, లిప్ గ్లాస్ వాడే కలర్ సూట్ అయ్యేవిధంగా ఉండాలి. కళ్ళు ఆకారం స్పష్టంగా పెద్దవిగా కనబడాలంటే ఐలైనర్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మస్కార అప్లై చేయడంతో ఐమేకప్ పూర్తి చేయండి. అలాగే మీరు వేసుకొనే డ్రెస్ కలర్ పెన్సిల్ ను లైట్ ఐలైనర్ వేసుకోవచ్చు.

లిప్స్ ను డార్క్ కలర్ లిప్ స్టిక్స్ తో హైలైట్ చేయండి.

లిప్స్ ను డార్క్ కలర్ లిప్ స్టిక్స్ తో హైలైట్ చేయండి.

పెదాలకు డార్క్ కలర్ షేడ్ కలిగినటువంటి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ముఖం చాలా సింపుల్ గా, సహజ అందంతో మేకప్ వేసుకోని సమయంలో లిప్స్ ను డార్క్ కలర్ లిప్ స్టిక్స్ తో హైలైట్ చేయండి.

 డార్క్ మేకప్ తో మరింత అందంగా కనబడవచ్చు

డార్క్ మేకప్ తో మరింత అందంగా కనబడవచ్చు

డార్క్ కలర్ మేకప్ వేసుకొనేటప్పుడు కళ్ళ మీద కానీ, లేదా పెదాల మీద కానీ మరింత ప్రత్యేకత తీసుకోవాలి. డార్క్ మేకప్ తో మరింత అందంగా కనబడవచ్చు. అయితే డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐషాడో మీద డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది.

ఐషాడో మీద డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది.

డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఐషాడోను అప్లై చేస్తే మరింత ఆకర్షనీయంగా కనబడుతారు. ఐషాడో మీద డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది.

దుస్తుల ఎంపికలో

దుస్తుల ఎంపికలో

దుస్తుల ఎంపికలో చాలా రిచ్ గా కనబడేటప్పుడు అందుకు మినిమమ్ మేకప్ టిప్స్ అవసరం. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దుస్తులు వేసుకొన్నప్పుడు సింపుల్ మేకప్ సరిపోతుంది. అదే లైట్ కలర్ డ్రెస్ వేసుకొన్నప్పుడు మేకప్ తో బాగా కవర్ చేయాలి. కాబట్టి మీరు ధరించే దుస్తులను బట్టే మేకప్ ఎంత మోరకు అవసరమో తెలుసుకొని వేసుకోవడం మంచిది.

 ఐ షాడోను

ఐ షాడోను

డార్క్ మేకప్ వేసుకొనే వారికి ఐషాడో బ్లూ, గ్రీన్, పర్ఫుల్, బ్లాక్ మరియు గ్రే కలర్స్ ఐ మేకప్ కి బాగా సూట్ అవుతాయి. అవికూడా మీరు ధరించే దుస్తులకు మ్యాచ్ అవుతాయో లేదా ఒక సారి చూసుకొని మరీ ధరించాలి. ఐలైనర్ తో కంటిదగ్గర పలుచగా లైన్ గీసి దాని లోపలగా ఐ షాడోను అప్లై చేయాలి.

English summary

Beauty tips for looking flawless at a Diwali festival: Beauty Tips in Telugu

Beauty tips for looking flawless at a Diwali festival, It is the festive season so everyone is ready to adorn their favourite dresses. Diwali is the festival of lights and brightness. During Diwali, people wear new clothes and visit their relatives and closed ones in their best attire.
Desktop Bottom Promotion