Just In
- 9 min ago
మీ జుట్టుకు ఆయిల్ ఎలా శిక్షణ ఇవ్వాలో ఇక్కడ మీ గైడ్ ఉంది
- 2 hrs ago
మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? ఇది ప్రమాదకరమా?
- 6 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
- 16 hrs ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
Don't Miss
- Finance
Business Ideas: నర్సరీల ద్వారా రూ. లక్ష వరకు ఆదాయం: ఉపాధి హామీ పథకంతో లింక్
- Technology
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- News
జగనన్న దావోస్ వెళ్లలేదు? లండన్ వెళ్లారు??
- Movies
Karthika Deepam నిరుపమ్ నాకు పడటం అదృష్టం.. నీకు దురదృష్టం.. హిమతో శౌర్య
- Automobiles
రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..
- Sports
IPL 2022: ఆ గవాస్కర్ గాడిని తన్ని తరిమేయండి.. వాడు వాని వెకిలి కామెంట్రీ! ఫ్యాన్స్ ఫైర్!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Diwali 2021 : కాలుష్యం నుండి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలంటే...
దీపావళి అంటేనే దీపాల పండుగ. సంవత్సరానికొకసారి వచ్చే ఈ పండుగ సమయంలో నలుగురి చూపు తమవైపు ఉండాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు.
ఈ సమయంలో చలికాలం కూడా ప్రారంభమవుతుంది. దీంతో చర్మం డల్ మారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించడం ఎలా అనే ఆలోచనలు ప్రతి ఒక్క మహిళ మదిలో మెదులుతూ ఉంటాయి.
ముఖ్యంగా దీపావళి సమయంలో క్రాకర్స్, టపాసుల పొగ వల్ల కొంత కాలుష్యం కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమయంలో తమ చర్మం మరింత పాడవుతుందని ఫీలవుతుంటారు.
ఈ సందర్భంగా మీరు మీ స్కిన్ మేకప్ కిట్ ను ఉపయోగించి మరింత అందంగా కనబడాలంటే.. మీరు ఈ చిట్కాలను పాటించాలి.. దీని వల్ల మీ చర్మానికి కాస్త రిలీఫ్ దొరికి మీరు మరింత మెరిసిపోతారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...
జుట్టు
రాలడానికి
'గుడ్-బై'
చెప్పాలా?
10
రోజులు
ఇది
తాగండి.
సరిపోతుంది...

డెడ్ స్కిన్ లేకుండా..
దీపావళి సమయంలో మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే.. మీరు మీ ముఖానికి మాత్రమే కాదు.. మీ బాడీ మొత్తానికి స్క్రబ్ రాసుకోవాలి. ఇలా చేస్తే మీ స్కిన్ పై ఎలాంటి డెడ్ స్కిన్ లేకుండా చేసుకోవచ్చు. మీ స్కిన్ కూడా పొడిగా, పొలుసుల్లా మారకుండా ఉంటుంది. ఇందుకోసం ఇంట్లోనే స్క్రబ్ ని తయారు చేసుకోవడం బెటర్. అదెలాగంటే ముందుగా రెండు టీ స్పూన్ల వాల్ నల్ షెల్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఫేస్ వాష్ లేదా బాడీ వాష్ కలిపి దానితో మీ స్కిన్ ఎక్స్ ఫొలియెట్ చేస్తే మీ స్కిన్ మిలమిల మెరిసిపోతుంది. స్క్రబ్ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మరచిపోకండి సుమా..

స్కిన్ సత్ఫలితాల కోసం..
స్క్రబ్ తర్వాత ఫేస్ మాస్కు వేసుకోవడం వల్ల కాలుష్యం నుండి పాడైన మీ స్కిన్ తిరిగి మెరుగుదలను ఏర్పాటు చేసుకుంటుంది. అంతేకాదుు.. మీరు మేకప్ వేసుకున్నా.. వేసుకోకున్నా అందంగా మారిపోతుంది. అందులోనూ సల్ఫర్ ఫేస్ మాస్కు వేసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. ఇది స్కిన్ సమస్యలను కూడా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చర్మం మరీ వాడిపోయినట్లుగా కనిపిస్తుంటే, మీరు ఒకటి కంటే ఎక్కువ మాస్కులు వేసుకోవచ్చు..

డెడ్ స్కిన్ తొలగిపోవాలంటే..
మీ డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోయి.. మీ చర్మం మొత్తం మెరుస్తూ పట్టులా కనిపించాలంటే.. మీరు డెర్మటాలజిస్టు దగ్గరికెళ్లి మైక్రోడెర్మాబేషన్ ట్రీట్ మెంట్ చేయించుకుంటే బెటర్. దీనికి ఎక్కువ ఖర్చేమీ అవ్వదు. చాలా మంది చర్మ నిపుణులు ఇన్ స్టా ఫేషియల్స్ కూడా ఆఫర్ చేస్తారు. దీని వల్ల కేవలం 20 నిమిషాల్లో మీ చర్మం అందంగా మారుతుంది. ఇలాంటి వాటి వల్ల మీరు అందంగా కనిపించడంతో పాటు మీ మెరుపును కూడా మూడు వారాల వరకు నిలిచి ఉండేలా చేస్తాయి.
మీ
భుజాలు,
చేతులపై
ఎర్రటి
మచ్చలు
ఉన్నాయా?
అయితే
ఇలా
చేయండి...

ఆ వాటర్ తో..
దీపావళి వల్ల కొంత కాలుష్యం వస్తే.. దాని కారణంగా మీ స్కిన్ డల్ కనిపించడం స్టార్టవుతుంది. దీంతో పాటు మీ స్కిన్ లోని రంధ్రాలు డబుల్ క్లెన్స్ చేయడం వల్ల మురికి పూర్తిగా తొలగిపోవచ్చు. అయితే దీపావళి పండుగ ముగిసిన తర్వాత రాత్రి వేళలో మీరు క్లెన్సింగ్ ఆయిల్ లేదా మిసెల్లార్ వాటర్ తో మేకప్ తొలగించుకోవడం ఉత్తమం. ఇందుకోసం మంచి క్లెన్సర్ ని ఉపయోగించుకోవాలి. డీప్ క్లెన్సర్ ని వాడటం వల్ల చర్మం లోతులో ఉన్న మురికి కూడా తొలగిపోయి, మీ స్కిన్ మరింత మెరుస్తుంది. దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్ల మీ స్కిన్ పై చేరిన మురికి కూడా సులభంగా తొలగిపోతుంది.

రోజువారీ ఆహారంలో..
ఇక దీపావళి సమయంలో మీ స్కిన్ గ్లో పెరగాలంటే మీరు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో లెమన్ జ్యూస్, గంధపు చెక్క, పెరుగును యాడ్ చేసుకోండి. మీరు జిడ్డు గల చర్మం వారయితే పెరుగు ఫేస్ ప్యాక్ కు వాడకూడదు. అయితే నిమ్మరసం వాడొచ్చు. టమోటా జ్యూస్ కూడా టాన్డ్ చర్మం అద్భుతంగా పని చేస్తుంది.
No
shave
November:ఈ
నెలలో
గడ్డం
ఎందుకు
చేసుకోకూడదంటే...!

కెమికల్స్ ప్రవేశించకుండా..
దీపావళి కంటే ముందు మీరు మీ స్కిన్ ను కాపాడుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హానికరమైన కెమికల్స్ మీ స్కిన్ లో ఎంటర్ కాకుండా చూసుకోవాలి. ఇందుకోసం కొన్ని పనులు చేయాలి.

ఎక్కువ నీరు తాగడం..
మీ స్కిన్ మెరుగుదల కోసం మీరు ఎక్కువగా నీరు తాగడం, విటమిన్ ఈ ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోవడం, చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం, సన్ స్క్రీన్ రాసుకోవడం.. అన్నింటికంటే ముందుగా మీ స్కిన్ ను కవర్ చేసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.