For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Winter Makeup Tips: చలికాలంలో మేకప్ వేసుకుంటున్నారా అయితే ఈ టిప్స్ మీ కోసమే

చలికాలంలో మేకప్‌లో ఎలాంటి మార్పులు చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటిస్తే చక్కని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.

|

Winter Makeup Tips: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలైతే తమ అందంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. మేకప్ వేసుకునే వారు కాలాన్ని బట్టీ మేకప్ వేసుకునే తీరు మార్చుతూ ఉండాలి. చలికాలంలో చల్లని, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండేలా మీ మేకప్, చర్మ సంరక్షణ మార్చుకోడం చాలా ముఖ్యం. చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. సరైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవడం వల్ల మృదువైన చర్మాన్ని సొంత చేసుకోవచ్చు.

Makeup tips for women this winter in Telugu

చలికాలంలో మేకప్‌లో ఎలాంటి మార్పులు చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటిస్తే చక్కని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.

1. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోవద్దు

1. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోవద్దు

చలికాలంలో ఎక్స్‌ఫోలియేట్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ముఖం, మెడ చుట్టూ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌ను వాడాలి. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవుతుంది. మేకప్ స్మూత్‌గా, చక్కగా వేసుకునేందుకు సహాయపడుతుంది.

2. థిక్ మాయిశ్చరైజర్ వాడాలి

2. థిక్ మాయిశ్చరైజర్ వాడాలి

చలికాలంలో మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చర్మ సంరక్షణ కోసం తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మందపాటి, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వాడుకోవాలి. పీచ్ మిల్స్ ఎక్స్‌ట్రాక్ట్స్, విటమిన్-ఇ, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో కూడిన మాయిశ్చరైజర్ వాడాలి.

3. సరైన ప్రైమర్ వాడండి

3. సరైన ప్రైమర్ వాడండి

ఏ కాలం అయినా మంచి ప్రైమర్ వాడటం చాలా ముఖ్యం. ప్రైమర్ వాడటం వల్ల మేకప్ ఎక్కువ సేపు ప్రభావవంతంగా ఉంటుంది. పొడి పాచెస్‌ను కూడా సమం చేస్తుంది. ప్రైమర్ మంచి పునాదిలా ఉంటుంది. ఎక్కువ హైడ్రేటింగ్‌తో రెగ్యులర్ మ్యాట్‌పైయింగ్ ప్రైమర్‌ను ఎంచుకోండి. విటమిన్-ఇ ఉండే ప్రైమర్ వాడండి.

4. మాట్ ఫినిషింగ్ ఫౌండేషన్

4. మాట్ ఫినిషింగ్ ఫౌండేషన్

చలికాలం చర్మం పొడిబారుతుంది. దురదగా అనిపిస్తుంది. మాట్ ఫినిషింగ్ ఫౌండేషన్‌ను ఉపయోగించడం వల్ల ఆ పొడి ప్యాచ్‌లను మెరుగుపరుస్తుంది. ఆర్గాన్ ఆయిల్ సీరమ్ ఫౌండేషన్ వంటి తేలికైన ఫౌండేషన్ ఎంచుకోవడం వల్ల మంచి చర్మం మీ సొంతం అవుతుంది.

 5. బ్రాంజర్ వాడటం మంచిది

5. బ్రాంజర్ వాడటం మంచిది

చాలా మంది మహిళలు చలికాలంలో మేకప్ రోటీన్‌లో బ్రాంజర్ వాడకాన్ని తగ్గిస్తారు. చలికాలంలో చర్మం పూర్తిగా పొడిబారుతుంది. దురద కూడా ఉంటుంది. చర్మం కాంతి కోల్పోయి డల్‌గా ఉంటుంది. నిర్జీవమైన చర్మంపై మేకప్ వేసినప్పటికీ అందంగా కనిపించరు. బ్రాంజర్ చర్మానికి చాలా వెచ్చదనాన్ని అందిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.

Read more about: సౌందర్యం beauty
English summary

Makeup tips for women this winter in Telugu

read on to know Makeup tips for women this winter in Telugu
Story first published:Friday, December 9, 2022, 10:21 [IST]
Desktop Bottom Promotion