For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dry Lips Masks: పొడిబారిన పెదాలపై ఈ మాస్క్ వేశారంటే దొండపండు లాంటి పెదాలు మీ సొంతమవుతాయి

చలికాలంలో పెదాలు, ముఖం కాంతివంతంగా కనిపించక చాలా ఆందోళన చెందుతుంటారు అమ్మాయిలు. లిప్ బామ్ లు తెగ వాడేస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఈ మాస్కులు పొడిబారిన పెదాలను మృదువుగా, దొండపండులా మారుస్తాయి.

|

Dry Lips Masks: అందంగా కనిపించాలన్న తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆడవాళ్లు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే చలికాలం వచ్చిందంటే చాలు. చర్మం పొడిబారడం, పెదాలు పొడిబారి పగిలిపోవడం జరుగుతుంది.

Dry Lips Masks

చలికాలంలో పెదాలు, ముఖం కాంతివంతంగా కనిపించక చాలా ఆందోళన చెందుతుంటారు అమ్మాయిలు. లిప్ బామ్ లు తెగ వాడేస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఈ మాస్కులు పొడిబారిన పెదాలను మృదువుగా, దొండపండులా మారుస్తాయి.

పంచదార, తేనె మాస్క్

పంచదార, తేనె మాస్క్

ఒక గిన్నెలో పంచదార, తేనె చక్కగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పెదాలపై రాయాలి. తర్వాత మరుసటి రోజు నిద్ర లేవగానే పెదాలను గోరు వెచ్చని నీటితో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై మృతకణాలు తొలగిపోయి తాజాగా ఉంటాయి.

స్ట్రాబెర్రీ, కివీ మాస్క్

స్ట్రాబెర్రీ, కివీ మాస్క్

స్ట్రాబెర్రీ, కివీస్ ను గుజ్జుగా మార్చాలి. అందులో కొద్దిగా కాఫీ పౌడర్ కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. స్ట్రాబెర్రీ, కివీస్ లోని విటమిన్ ఈ పెదాలను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.

బ్రౌన్ షుగర్, తేనె మాస్క్

బ్రౌన్ షుగర్, తేనె మాస్క్

గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ తేనె అలాగే 6 చుక్కల లావెండర్ నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి లిప్ బామ్ పెట్టుకోవాలి.

కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ మాస్క్

కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ మాస్క్

ఒక గిన్నెలో, 2 టేబుల్ స్పూన్ల పంచదార, ఒక టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఒక టీస్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 3/4 టీస్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి కాసేపు మృదువుగా మర్దనా చేయాలి. 5 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడగాలి.

స్ట్రాబెర్రీ, కివీ మాస్క్

స్ట్రాబెర్రీ, కివీ మాస్క్

సగం కివీ పండులో తీసుకుని దానికి ఒక స్ట్రాబెర్రీ కలిపి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా పంచదార, ఆలివ్ నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసుకోవాలి. ఒక నిమిషం పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నూనెతో కడిగేయాలి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.

అవకాడో, తేనే మాస్క్

అవకాడో, తేనే మాస్క్

అవకాడో, తేనే వేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పెదాలపై రాసుకోవాలి. తర్వాత 20 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పెదవులపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

English summary

masks for dry and chopped lips in Telugu

read on to know masks for dry and chopped lips in Telugu
Story first published:Tuesday, November 29, 2022, 18:47 [IST]
Desktop Bottom Promotion