For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు అందంగా..గుబురుగా గడ్డం పెంచుకోవడానికి 8 చిట్కాలు

|

అవును, గడ్డాలు ఉన్నయ్యా! 'శుభ్రంగా షేవ్' చేసుకునే రోజులు పోయాయి!

పెరుగుతున్న గడ్డం మిమ్మల్ని ఒక 'మనిషిగా' కనిపించేలా చేసే ఉత్తమ విషయం. మీరు ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇచ్చి, జిమ్ చేసే వారైతే, మీరు ఒక యోధుడులా కనిపించాలని కోరుకుంటే, మీ పెరిగిన గడ్డానికి ధన్యవాదాలు చెప్పాలి.

READ MORE: గడ్డం సాఫ్ట్ గా.. షైనీగా మార్చుకోవడానికి టిప్స్

పురుషులు 'కుంచె-లా కనిపించే' విధానం పోయి, పూర్తిగా గడ్డం పెంచడానికి ఇష్టపడుతున్నారు. సరే, దీనికి ఎంత సమయం పడుతుంది? మీకు పూర్తి గడ్డం పెరగడానికి కనీసం 30 నుండి 45 రోజులు పడుతుంది. దీనికి చాలా 'సహనం' కూడా అవసరం!

గడ్డం పెంచడం అంటే, పెరట్లో గడ్డి పెరిగినట్టు మీ ముఖంపై జుట్టు పెంచడం అని కాదు. గడ్డాన్ని ఎలా పెంచాలి? తెలుసుకోవాలి. సరే, దీనికి ఎంతో శ్రద్ధ, నిర్వహణ అవసరం. మీ గడ్డం పెరుగుదల పై శ్రద్ధ అవసరం, అంతేకాకుండా దానితోపాటు మీ చర్మ సంరక్షణ పై కూడా శ్రద్ధ పెట్టాలి.

READ MORE: చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?

అంతేకాకుండా, గడ్డం పెరగడంతో పాటు, మీ ముఖంపై వెంట్రుకలు కూడా పెరుగుతాయి, ప్రతిరోజూ మాయిశ్చరైజ్ చేసి, కండిషనింగ్ చేయాలి. నిజానికి, మీ గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ శ్రద్ధగా మీ గడ్డాన్ని చూసుకోవడం అవసరం! మీరు అంత శ్రద్ధ పెట్టడానికి ఇష్టపడతారా? సరే, అయితే చదవండి.

చిట్కా #1:

చిట్కా #1:

ఒక సెలూన్ కి వెళ్లి, శుభ్రంగా గడ్డం చేయించుకోండి. అంతేకాకుండా, మీ ముఖ చర్మం పాడైపోకుండా, శుభ్రంగా ఉంచుకోండి. మీరు గడ్డం పెంచుకునే ముందు, ఎక్స్ఫోలిఎషన్ వాళ్ళ వచ్చిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించుకోవడం మంచిది.

చిట్కా #2:

చిట్కా #2:

గడ్డాన్ని పెంచే మొత్తం విధానంలో, మీ గడ్డం కంటే మీ చర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మురికి, బాక్టీరియా ఆ ప్రాంతంలో పేరుకుంటుంది.

చిట్కా #3:

చిట్కా #3:

ఒక వారం తరువాత, కొద్దిగా గడ్డం పెరిగితే, ప్రతిరోజూ మీ గడ్డాన్ని మాయిశ్చరైజర్ చేయడం ప్రారంభించండి. మీ ముఖ చర్మానికి, గడ్డానికి ఆర్ధ్రీకరణ అవసరం.

చిట్కా #4:

చిట్కా #4:

మీరు మీ గడ్డాన్ని ప్రతిరోజూ ఒక మంచి కండిషనర్ ని ఉపయోగించి ‘శుభ్రం' చేయకపోతే ముతకగా అయిపోతుంది. అవును, మీ జుట్టు లాగానే, మీ గడ్డానికి కుడా అది బలంగా ఉండడానికి, మృదువుగా ఉండడానికి కండిషనర్ అవసరం.

చిట్కా #5:

చిట్కా #5:

మొదట కొన్ని రోజులు, మీ గడ్డాన్ని ‘ఆమ్లా ఆయిల్'తో 15 నిమిషాల పాటు మర్దన చేయండి, తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇది గడ్డం పెరుగుదలకు దోహాదపడుతుంది.

చిట్కా #6:

చిట్కా #6:

మీరు కనీసం 3 వారాల పాటు మీ ముఖంపై ‘దురదలను' అనుభవించాల్సిన అవసరం ఉంది. ఇది రెండు కారణాల వలన జరుగుతుంది. మొదటిది, మీ ముఖంపై జుట్టు ఉండడం విసుగ్గా ఉంటుంది. రెండవది, సూక్ష్మ క్రిములు మీ చర్మానికి దురదను, బ్రీడింగ్ ని కలుగచేస్తాయి. మీరు ఎల్లప్పుడూ మీ చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దురదల నుండి ఉపసమనం పొందవచ్చు.

చిట్కా #7:

చిట్కా #7:

మీ గడ్డం చివరలను ట్రిమ్మింగ్ చేయించుకుంటే, మీ ముఖంపై దురదలు రాకుండా చేస్తుంది. మీరు మీ గడ్డం సౌకర్యవంతంగా పొందడానికి ఈ విషయం తో ప్రారంభమౌతుంది.

చిట్కా #8 :

చిట్కా #8 :

45 రోజుల తరువాత, మీరు మీ గడ్డాన్ని మీకు ఇష్టమైన శైలిలో షేప్ చేసుకోవడం ప్రారంభించవచ్చు. మంచి సెలూన్ కి వెళ్లి, మీకు కావలసిన రూపును పొందడానికి ఆ హెయిర్ డ్రస్సర్ కి స్పష్టమైన సూచనలు ఇవ్వండి.

English summary

Eight Tips To Grow A Beard Faster: Beauty Tips in Telugu

Yes, beards are in! The 'clean-shaven' look is out! Growing a beard is the best thing you can do to make yourself look 'manly'. And if you are a fitness freak or a gym rat, you can even afford to look like a warrior, thanks to your full-grown beard.
Desktop Bottom Promotion