For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RRRలో నాటు స్టెప్పులే కాదు.. అదిరేటి డ్రస్సులు కూడా..

|

ఇటీవల విడుదలైన RRR సినిమా పాటలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'నా పాట సూడు నా పాట సూడు' సాంగులో స్టెప్పులను ఇరగదీశారు. ఈ పాటతో పాటు ఇప్పటివరకు ఈ సినిమా పోస్టర్లలో విభిన్నమైన డ్రస్సులలో కనిపించి అందరినీ అలరించారు.

ముందుగా జిబ్బా పైజామాలో బైక్ రైడింగు చేస్తూ విడుదలైన పోస్టర్.. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ డ్రస్సులతో అద్భుతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను, పాటలను ఇటీవలే విడుదల చేశారు. వీటికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీవ్స్, లైక్స్, కామెంట్లు షేర్స్ వస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా ఇద్దరూ కలిసి 'నా పాట సూడు' సాంగులో ఒకే రకమైన డ్రస్సులను వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు అన్నంత అందంగా కనిపించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టైలీష్ డ్రస్సులపై ఓ లుక్కేయండి...

నీలాంబరిగా మారిన బుట్టబొమ్మ అందాలను చూస్తే చూపు తిప్పుకోలేరు...

ఎన్టీఆర్ న్యూ లుక్..

ఎన్టీఆర్ న్యూ లుక్..

RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇదివరకు సినిమాల్లో చూసిన తన స్టైల్ కంటే.. ఇప్పుడు మరింత కొత్తగా, తాజాగా.. మరింత అందంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం తన డ్రస్సింగ్ స్టైల్. లైట్ స్కై బ్లూ కలర్ షర్ట్, ప్యాంటుకు బ్రౌన్ కలర్ షూ వేసి ‘నాటు నాటు.. నా పాట సూడు' అంటూ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు చెర్రీ, నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

చెర్రీ స్టైలీష్..

చెర్రీ స్టైలీష్..

ఇక ఎన్టీఆర్ తో సమానంగా మెగా పవర్ స్టార్ కూడా చాలా కొత్తగా కనిపించాడు. ఇది వరకే మగధీరలో జులపాల జుట్టుతో కనిపించినప్పటికీ.. తాజాగా అల్లూరి పాత్రలో మరింత కొత్తగా కనిపించాడు. అంతేకాదు అందుకు తగ్గ బాడీని సైతం సిద్ధం చేసుకున్నాడు. ఈ ఫొటో చూస్తే చెర్రీ ఎంత అందంగా.. హ్యాండ్సమ్ గా, స్టైలీష్ గా కనిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

స్టైలీష్ సిట్టింగ్..

స్టైలీష్ సిట్టింగ్..

ఎన్టీఆర్ ఏది చేసినా చాలా స్టైలీష్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఎంత స్టైలీష్ గా ఉంటారో.. రియల్ లైఫ్ లోనూ కొంత స్టైలీష్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా సినిమా షూటింగులో విరామం సమయంలో ఓ బెంచ్ పై కళ్లద్దాలు పెట్టుకుని కూర్చున్న ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలీష్ కనిపిస్తుంది. కాలి మీద కాలు వేసుకుని కూర్చున్న ఎన్టీఆర్ రాజసం మరెవరిలోనూ ఉండదంట అతిశయోక్తి కాదేమో..

మీ తొడలు చిన్నగా కనిపించాలంటే... ఈ అవుట్ ఫిట్స్ ట్రై చేయండి...

నటరాజు వద్ద నాట్యం..

నటరాజు వద్ద నాట్యం..

ఎన్టీఆర్ నాట్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తను లావుగా ఉన్న సమయంలో భరత నాట్యం, కూచిపూడి వంటి డ్యాన్సులను అద్భుతంగా చేసేశాడు. ఇప్పుడు పర్సనాలిటీ కూడా ఫిట్ గా ఉండటంతో డ్యాన్సులో మరింత రెచ్చిపోతున్నాడు. తాజాగా లైట్ వైట్ షర్ట్.. గ్రే కలర్ ప్యాంటు దానికి మ్యాచింగ్ షూ వేసుకుని స్టెప్పులేస్తుంటే..అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్టీఆర్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

చెర్రీ డ్రస్ కిరాక్..

చెర్రీ డ్రస్ కిరాక్..

ఎన్టీఆర్ కంటే తాను కూడా ఏ మాత్రం తక్కువ కాదు నిరూపించుకునే ప్రయత్నం చేశాడు చెర్రీ. తనతో కలిసి సమానంగా స్టెప్పులేసిన చెర్రీ జూనియర్ కు ఏ మాత్రం తగ్గకుండా కాస్ట్యూమ్ డిజైన్ లో కొత్తగా కనిపించాడు. ఇదంతా రమా రాజమౌళి పర్యవేక్షణలో జరిగింది. ఆమె కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తను ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసిందంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్మార్ట్ లుక్..

స్మార్ట్ లుక్..

రామ్ చరణ్ సినిమా షూటింగులో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకునే సమయంలో తన స్మార్ట్ ఫోన్ ను చూసుకుంటుండగా.. కెమెరాకు ఇలా దొరికేశారు. కాలి మీద కాలు వేసుకుని ఎంతో కంఫర్ట్ గా కూర్చున్న చెర్రీ బ్రౌన్ కలర్ ప్యాంటు, లైట్ వైట్ కలర్ షర్ట్ దానికి మ్యాచింగ్ షూ, స్టైలీష్ కళ్లద్దాలు పెట్టుకుని స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ స్మైల్ ఇస్తుంటే చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.

RRR సినిమాలో హీరోలు ఎవరు?

RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లను, పాటలను ఇటీవలే విడుదల చేశారు. వీటికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.

RRR సినిమా మరియు సంగీత దర్శకులు ఎవరు?

RRR సినిమా సినిమా డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు. ఈయన క్రియేటివిటీ చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇక సంగీత దర్శకులుగా ఎమ్.ఎమ్.కిరవాణీ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.

RRRలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు?

ఈ సినిమాలోనూ కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి పని చేస్తున్నారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాలో దాదాపు ఈమెనే కాస్ట్యూమ్ డిజైన్లను పర్యవేక్షిస్తారు.

English summary

Jr.ntr and Ramcharan Best Fashion Styles in Telugu

Here are the Jr.ntr and Ram charan best fashion styles in Telugu. Have a look
Desktop Bottom Promotion