For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentine Day 2021 :వాలెంటైన్స్ డే టైమ్ లో ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

|

వాలెంటైన్స్ వీక్ 2021 ప్రారంభమైంది. కరోనా తర్వాత ఈ వాలెంటైన్స్ డే వేడుకలను ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఇప్పటికే మనలో చాలా మంది ప్రత్యేక సన్నాహాలు కూడా ప్రారంభించారు. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమ్మాయిల కోసం ప్రత్యేక మేకప్ మరియు ఫేషియల్స్ లభిస్తాయి.

అయితే సౌందర్యం అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే సొంతం కాదు.. అబ్బాయిలు కూడా కొంచెం కష్టపడితే అందంగా కనబడొచ్చు. అందుకే నేటి తరం యువకులు అందంగా కనిపించేందుకు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. అమ్మాయిల కంటే అందంగా కనిపించేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. సాధారణంగా అందం గురించి పెద్దగా పట్టించుకోని అబ్బాయిలు కూడా వాలెంటైన్స్ డే టైములో ఎక్కువ బ్యూటీ, ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవుతున్నారు.

మీరెప్పుడైనా..మ్యాగజైన్స్ కవర్స్, ఫిల్మ్ స్టార్ట్స్ మ్యాకో మెన్లను చూశారా. అయితే వారు నిజంగా అలాగే ఉంటారాని మీరు భావిస్తున్నారా?లేక అదంతా అన్ రియల్ అని భావిస్తున్నారా? మీరు...ది బెస్ట్ గా కనిపించడంతోపాటు, చక్కటి ఆహార్యంతో ఉండటానికి కావాల్సిన రూపాన్ని పొందడం అనేది ఒక ఫాంటసీగా ఉండదు. అందంగా కనిపించడం అనేది ఒక బోనసే. పురుషుడు తన కండరాలతో అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాడు. ఒక మంచి లెదర్ జాకెట్ ధరించుట వల్ల మీ అందాన్ని మరింత రెట్టింపుగా కనిపించేలా చేయడం ఖాయం.

అంతేకాదు సరైన అమరిక గల బట్టలు ధరించడం కూడా మంచిది. లెదర్ జాకెట్ వల్ల కండరాలు ఆకర్షించేలా కనిపిస్తాయి. మీ బాడీ 6-ప్యాక్ అయితే స్త్రీలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న మగాళ్లను స్త్రీలు బాగా ఇష్టపడతారు. అయితే ఒక్క సిక్స్ ప్యాక్ ఉంటే సరిపోదు. శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శరీరం నుంచి దుర్వాసన వస్తే...స్త్రీలు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. మీరు స్త్రీలను ఆకర్షించాలంటే...చక్కటి వస్త్రాధారణతోపాటు శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డ్రస్సింగ్ లో అలసత్వము, శుభ్రత లేని జుట్టు , మురికి గోర్లు, తడిసిన చొక్కాలన్నింటినీ పక్కనబెట్టి...అందంగా..ఆకట్టుకునేలా కనిపించేందుకు కాస్త సమయం కేటాయించాలి. అయితే మీ ప్రియురాలిని ఈ వాలెంటైన్స్ డే టైములో ఆకట్టుకోవాలంటే మేకప్ ఎలా చేసుకోవాలి... ఎలాంటి చిట్కాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కన్సీలర్ వాడండి..

కన్సీలర్ వాడండి..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో అబ్బాయిలు కూడా తమ ఫేస్ బ్యూటీ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం స్త్రీలు మాత్రమే వాడే వాటిని ఇప్పుడు మగవారు కూడా ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే తమ చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేందుకు కొన్ని పద్ధతులను పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వాలెంటైన్ టైములో మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు మీరు కన్సీలర్ వాడొచ్చు. మీ ముఖం మీద మచ్చలు, నల్లమచ్చలు, నల్లటి వలయాలు వంటి వాటిని కనబడకుండా కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ ముఖంపై ఏవైనా మరకలు ఉంటే, వాటిని కూడా కన్సీలర్ వాడి తొలగించుకోవచ్చు మరియు శుభ్రపరచుకోవచ్చు.

స్టైలిష్ లుక్..

స్టైలిష్ లుక్..

ఈరోజుల్లో అబ్బాయిలను మరింత అందంగా కనపడేలా చేయడంలో గడ్డం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ గడ్డం ఎంత స్టైలిష్ గా ఉంటే మీరు అంత ప్రత్యేకంగా కనిపిస్తారు. అందుకే మీరు మీ గడ్డాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత అవసరం. మీరు మీ గడ్డంపై శ్రద్ధ వహించకపోతే.. అది మీ మొత్తం రూపాన్ని నాశనం చేస్తుంది. స్టైలిష్ మరియు అందమైన లుక్ కోసం గడ్డం యొక్క వస్త్రధారణ ముఖ్యమని గుర్తుంచుకోండి. మీరు అందమైన గడ్డం రావాలంటే.. మీరు సున్నితమైన గడ్డం కావాలనుకుంటే.. గడ్డం బామ్ ను వాడొచ్చు. అలాగే గడ్డం ఔషధ తైలం వాడటం ద్వారా మీరు స్టైలిష్ లుక్ ను పొందుతారు. దీన్ని వాడటం వల్ల మీ ఫేసుకు మంచి ఆకారం రావొచ్చు. అయితే దీని కోసం మీరు మీ గడ్డాన్ని ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో కట్ చేసుకోవాలి.

స్క్రబ్బింగ్..

స్క్రబ్బింగ్..

వాలెంటైన్ సీజన్లో, చలి గాలి కారణంగా మీ చర్మం జిడ్డుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ చర్మం పొడిగా మారకుండా మీరు స్క్రబ్బింగ్ చేయాలి. ప్రేమికుల దినోత్సవం రోజున మరింత అందంగా మరియు స్టైలిష్ లుక్ కోసం మీరు మీ ఫేసుపై తరచుగా స్క్రబ్ చేయాలి. స్క్రబ్బింగ్ చేయడం వల్ల మీ చర్మం మరియు ముఖంలోని మలినాలను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని కొత్తగా మరియు మెరిసేలా చేస్తుంది.

ముక్కు దగ్గర..

ముక్కు దగ్గర..

చాలా మంది మగవారు తమ ముక్కు రంధ్రాల గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మగవారికి ముక్కు దగ్గర ఉండే నాసికా రంధ్రాల దగ్గర వెంట్రుకలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని రెగ్యులర్ కత్తిరించాలి. లేదంటే మీ ముక్కు చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది.

ఇదీ ముఖ్యమే..

ఇదీ ముఖ్యమే..

మీరు వాలెంటైన్స్ డే టైములో కేవలం మీ ఫేసు, స్టైలిష్ డ్రస్ పై మాత్రమే కాకుండా మీ గోళ్లపై కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మీ గోళ్లలో మీకు తెలియకుండానే చాలా దుమ్ము చేరిపోతుంది. మీకు గోళ్లు పెద్దగా పెంచుకనే అలవాటు ఉంటే.. అవి మరింత మురికిగా కనిపిస్తాయి. కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా గోళ్లను కత్తిరించుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మీ లుక్ ఎంత బాగున్నప్పటికీ వీటి వల్ల మీపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.

దుర్వాసను తగ్గించేందుకు..

దుర్వాసను తగ్గించేందుకు..

చాలా మంది మగవారికి చేతులపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి ఇలా వెంట్రుకలు ఎక్కువగా ఉండే వారు చూడటానికి అందంగా కనిపించరు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీటిని కత్తిరించుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మీకు చెమట, ధూళి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ బాడీ నుండి వచ్చే దుర్వాసనను తగ్గించొచ్చు.

English summary

Men Skin Care and Grooming Tips for Valentine Day in Telugu

Here We Are Talking About men Skin Care, Men Skin Care And Grooming Tips For Valentine Day. Read On.