For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు హీరోలాగా అందంగా కనబడాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు...

మగవారి చర్మం మెరిసిపోయేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మందికి అందం అంటే టక్కున గుర్తొచ్చేది ఆడవారే. ఎందుకంటే వారు అందం, వస్త్రధారణపై పెట్టినంత శ్రద్ధ ఎవ్వరూ పెట్టలేరు. ఇది పురుషులకు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Tips To Get Glowing Skin For Men in Telugu

అయితే అమ్మాయిలు తమ చర్మాన్ని అనునిత్యం మెరిసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు రెగ్యులర్ గా ఫేషియల్స్ మరియు వంటింటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కానీ పురుషుల విషయానికొస్తే.. వారి స్కిన్ గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోరు.

Tips To Get Glowing Skin For Men in Telugu

దీని వల్ల పురుషులు అమ్మాయిల కంటే అందంగా కనిపించరు. అయితే మగవారు కూడా అమ్మాయిల మాదిరిగానే తమ చర్మంపై కాస్త కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం రెగ్యులర్ గా మాయిశ్చరైజింగ్, టోనింగ్ వంటి వాటిని వాడాలి.

Tips To Get Glowing Skin For Men in Telugu

ఇలా చేయడం వల్ల మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనబడతారు. అంతేకాదు మీ చర్మంపై ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోతారు. అయితే ఇదంతా కావాలంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి.. అవేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి...

తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి...తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి...

రోజుకు రెండుసార్లు..

రోజుకు రెండుసార్లు..

మనలో చాలా మందికి ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో ఎక్కువగా దుమ్ము, ధూళి వంటివి మన ముఖం మీద చేరిపోతాయి. అదే సమయంలో కాలుష్యం యొక్క ప్రభావం కూడా మన ముఖం మీద కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మగవారు చర్మ సంరక్షణ కోసం ఒక పని చేయాలి. ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీటితో మీ ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి. ఇలా ప్రతిరోజూ రెండుసార్లు చేస్తే, మీ చర్మం మెరుగుదల పెరుగుతుంది.

టోనర్..

టోనర్..

చాలా మంది మగవారి చర్మ సంరక్షణకు టోనర్ కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. టోనర్ ఉపయోగించడం వల్ల చర్మం యొక్క రంధ్రాలు గట్టిగా మారిపోతాయి. ఈ కారణంగా మీ ముఖంపై మొటిమల సమస్య తక్కువగా ఉంటుంది. అంతేకాదండోయ్ మీ చర్మం కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది.

మాయిశ్చరైజర్..

మాయిశ్చరైజర్..

మగవారిలో చర్మం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. ముందుగా మీ చర్మం ఎలాంటిది అనే దానిని మీరు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు మీరు మాయిశ్చరైజర్ వాడాలి. ఉదాహరణకు మీది పొడి చర్మం అయితే, దానిపై క్రీమ్ అనుసంధానిత మాయిశ్చరైజర్ ను రాయండి. అదే జిడ్డు గల చర్మం ఉన్నవారైతే తేలికపాటి మాయిశ్చరైజర్ ను వాడాలి.

ఫేస్ రోలర్..

ఫేస్ రోలర్..

ఇక మగవారి చర్మం ఆడవారి చర్మంలా అందంగా మెరవదు. ఎందుకంటే మగాళ్ల చర్మం చాలా రఫ్ గా ఉంటుంది. అయితే మీ స్కిన్ కూడా గ్లో అవ్వాలంటే.. మీరు ముఖంపై మసాజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ ఆరోగ్యకరమైన చర్మం మరియు ముఖం మీద తేలికపాటి మసాజ్ చేయాలి. దీని కోసం ఫేస్ రోలర్ ను ముఖంపై వాడాలి. దీంతో మీ ముఖంపై కొన్ని నిమిషాల పాటు మసాజన్ చేస్తే, అతి త్వరలో మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

English summary

Tips To Get Glowing Skin For Men in Telugu

All Men Use These Best Skin Care Tips For Glowing Skin. Read On.
Desktop Bottom Promotion