Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నిగారింపైన చర్మ తేజస్సుకు పండ్లు-జ్యూస్ లు
సాధారణంగా గమనించినట్లైతే కొందరి చర్మం నున్నగా, సుతిమెత్తగా, బేబి స్కిన్ లా మెరిసిపోతూ, ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు ముఖంలో తేజస్సు లేకుండా కనిపిస్తుంది. ఎన్నో రకాల క్రీములు, ఎన్నో రకాల చిట్కాలు పాటించినా కూడా ఫలితం ఉండదు సరికదా.... మరిన్ని సమస్యలు గురిఅవుతుంటారు. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. లోపలిది కూడా.. కాబట్టి పైపై రంగులు, మేకప్ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మెరిసే చర్మం కోసం కూరగాయలు, పండ్లతో తయారు చేసేటటు వంటి జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.

నారింజ/బత్తాయి: నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.
నారించ తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస కాయ తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం, చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళమీద కూడా పెట్టుకోవచ్చు.
పుచ్చకాయ : పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.
ఆపిల్ : యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.
జామకాయతో : జామకాయలో విటమిన్ 'ఏ' మరియు విటమిన్ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
టమాటా: టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది .అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్ కూడా లభిస్తాయి.
క్యారెట్ : క్యారెట్లలో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో వుండే విటమిన్ ఏ, సిలు చర్మానికి తేజస్సును ఇస్తాయి. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రుచికి కాస్త భిన్నంగా వున్నప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ దుంప.
బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. తిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు, యాపిల్ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం తీసుకొని అందులో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications











