For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కమిలిన చర్మం తెల్లగా మారాలంటే...

|

How to Look Cool in Hot...?
మండే ఎండల్లో మాత్రమే స్కిన్‌ టాన్‌ ఏర్పడుతుందనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఏ సీజన్లోనైనా సరే సూర్యుని అతినీల లోహిత కిరణాల తాకిడికి చర్మం కమిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ చికాకు పెట్టడంలో ఇది ముందు వుంటుంది.

శరీర సౌందర్యంలో ఎంత తెల్లని వారికైనా ఎండకు చర్మం కమిలి రంగుమారుతుంది. వంటికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు సన్‌ ట్యానింగ్‌ను పోగొట్టి చర్మాన్ని చల్లబరిచే హోమ్‌మేడ్ ప్యాక్‌లు కొన్ని నాలుగు బాదం పప్పులు, రెండురెమ్మల వేపాకు, చందనం పొడి కలిపి అవసరమైన మేరకు పాలు పోస్తూ గ్రైండ్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరే వరకు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిని చల్లుతూ మర్దన చేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లబరుస్తుంది.

తాజా కొబ్బరిపాలతో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం తెల్లబడుతుంది. పెదవులు నల్లగా ఉన్నా పొడిబారి ఉన్నా కొబ్బరిపాలతో మర్దన చేస్తే నలుపు వదులుతుంది. పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. చందనంలో పన్నీటిని కలిపి ప్యాక్ వేసుకుంటే చల్లదనంతోపాటు చర్మానికి నునుపుదనం వస్తుంది. ఈ ప్యాక్‌ను వేసవిలో పెద్దవాళ్లతోపాటు పిల్లలకు కూడా వేయవచ్చు.

కీరదోస, ముల్లంగి రసం బ్లీచ్‌గా పనిచేస్తాయి. గాఢత తక్కువగా ఉండి సహజమైన బ్లీచ్‌లు చర్మానికి స్వాంతన ఇవ్వడంతోపాటు తెల్లబరుస్తుంది కూడా. ఎండ వల్ల ఏర్పడిన చర్మం పగుళ్లు విపరీతమైన మంటతో అసహనానికి గురిచేస్తాయి. వీటిబారి నుండి బయటపడాలంటే దోసకాయ పైతొక్కను జ్యూస్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్, రోజ్‌ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పగులు ఏర్పడిన చోట పూసి కాసే పు వదిలేయాలి. చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు చర్మం సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది.

ఎండలో వెళ్లాల్సి వచ్చినపుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. గొడుగు పట్టుకెళితే మరీ మంచిది. నీరు ఎక్కువగా తాగండి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కొబ్బరి నీరు తీసుకుంటే ఇంకా మేలు. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండండి. సమయానికి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. రోజూ రెండు రకాల పండ్లను తినండి. ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వండి. అలసిన చర్మానికి తిరిగి జవసత్వాలు రావాలంటే మంచి నిద్ర తప్పనిసరి. కంటి నిండా నిద్రపోతే చర్మం తాజాదనం సంతరించుకుంటుంది. దుమ్ము, కాలుష్యంకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నట్లయితే రోజూ క్లీన్సర్లు ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

English summary

How to Look Cool in Hot...? | కమిలిన చర్మం తెల్లగా మారాలంటే...

Summer is the season of enjoying the waves and beaches but many women avoid it as they do not have idea about looking cool in hot. Strong sun’s rays increase the chances of developing age spots, wrinkles and skin cancer in summer. Skin glow can be damaged due to extreme exposure to sun and dust. Therefore, to avoid all these problems your skin needs lots of care and attention to look cool in hot. Summer skin care includes consumption of fresh fruits, water, milk and many more that give you fresh healthy skin.
Story first published:Friday, May 11, 2012, 17:19 [IST]
Desktop Bottom Promotion