For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావెండర్ ఆయిల్ తో ముఖంలో బంగారు మెరుపులు....!

|

Lavender Oil
లావెండర్ నూనె చాలా సహజసిద్దమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి నూనె. ఇది స్వచ్చమైన లావెండర్ పువ్వుల నుండి తయారు చేస్తారు. ఇది గొప్ప ఔషద గుణాలను కలిగిఉంటుంది. ఇది ఒక యాంటిసెప్టిక్ ఔషదంగాను, వ్యాదినిరోధకంగాను పనిచేస్తుంది. దీన్ని చాలా వరకూ చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని మనం కూడా ఇంట్లో ఉపయోగించి ఫేషియల్ మాస్క్ లు, ఫేస్ మాస్క్ లుగాను, లోషన్లుగాను ఉపయోగించుకోవచ్చు.

లావెండర్ నూనె కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. చర్మం తెగినపుడు, కాలినపుడు, కొత్తచర్మం తొందరగా తయారయ్యేలా చేయడం ద్వారా లావెండర్ వాటిని త్వరగా మానేలా చేస్తుంది. గాయాలను నయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్పాస్ నందు ఇతర స్నానానికి ఉపయోగించే వస్తువులలో ఈ నూనె ముఖ్యభాగం.

లావెండర్ నూనెను శరీరంపై నేరుగా ఉపయోగించవచ్చు. మరొక నూనెలో కలుపుకోనవసరం లేదు. లావెండర్ కలిపిన సబ్బులు చర్మంపై మృదువుగా పనిచేస్తాయి. అందువల్ల సెన్సిటివ్ స్కిన్ గలవారు కూడా ఈ లావెండర్ ను ఉపయోగించవచ్చు. చర్మ కణాలు ఆరోగ్యంగా ఎదిగేలా సహకరిస్తుంది. కీటకాలు కుట్టినపుడు బాధనుంచి రిలీఫ్‌నిస్తుంది. దోమలు, కీటకాలను పారద్రోలే రిపెల్లెంట్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతుంది. షవర్ బాత్, జెల్స్‌లో లావెండర్‌ను వాడతారు. లావెండర్ నూనె కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే మేని ఛాయ వెలుగులు విరజిమ్ముతుంది. ఈ లావెండర్ బాత్‌ కు ఏయే పదార్థాలు కావాలి... వేటిని ఉపయోగించాలో చూద్దాం.

లావెండర్ బాత్ సాల్ట్ తయారీకి కావలసినవి:
బాత్ సాల్ట్: నాలుగు టేబుల్ స్పూన్స్
లావెండర్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం: ఈ రెంటినీ కలిపి ఒక బాటిల్‌లో నిల్వ ఉంచాలి. రెండు చక్కలు స్నానం చేసే నీటికి కలిపితే చాలు. ఆనందకరమైన స్నానం మీ సొంతమవుతుంది.

లావెండర్ ఆరెంజ్ బాత్ సాల్ట్‌కు కావలసినవి:
సీ సాల్ట్: నాలుగు టేబుల్ స్పూన్స్
లావెండర్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్
ఆరంజ్ ఆయిల్: ఒక టీస్పూన్

తయారు చేసే విధానం: ఈ పదార్థాల్ని బాగా మిక్స్ చేయాలి. బాటిల్‌ లో స్టోర్ చేసుకోవాలి. ఒకటి, రెండు ముక్కలు నీటికి కలిపి దానితో స్నానం చేయాలి.

ఒక గ్లాస్ బౌల్ లో నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. తరవ్ాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేసినట్లైతే ముఖంలో ఉన్న ముడతలు, మొటిమలు తొలగిపోయి. మేనిఛాయతో ఫెయిర్ గా కనిపిస్తారు.

English summary

Lavender Oil for acne or pimple homemade remedies...! | ముఖంలో బంగారు మెరుపులు....!

Lavender essential oil actually obtained by the distillation of flower spikes of Lavender plant. It has great medicinal property. It has anti-septic and anti-inflammatory property. It is used as an ingredient in so many skin care product in cosmetic industry.
Story first published:Monday, July 23, 2012, 17:52 [IST]
Desktop Bottom Promotion