Latest Updates
-
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట! -
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
చర్మానికి ప్రకృతి సిద్దమైన.. సహజ సిద్దమైన.. మెరుగులు

ప్రస్తుత సిటీ కల్చర్‌లో ఈ ఫేసియల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ వర్చస్సును అందంగా తీర్చిదిద్దేందుకు ఈ ఫేసియల్స్‌ను చేయించుకుంటారు. అమ్మాయిలే కాదు వివాహితలు కూడా ఈ ట్రీట్‌మెంట్‌ను అధికంగా చేయించుకుంటున్నారు. స్కిన్‌లో డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిల్ స్కిన్.. ఇలా మూడు రకాలుంటాయి. ఆ మనిషి స్కిన్ బట్టి ఫేసియల్స్ చేస్తారు. అలా కాకుండా సహజసిద్దంగా లభించే వాటితోనే పపసుపు, పెరుగు, మీగడ, కోడిగుడ్డు వంటివాటివన్నీ ఉపయోగించుకొని చర్మ సౌందర్యం పెంచుకోవచ్చును . కొన్ని టిప్స్ చూద్దాం....
1. ముఖ చర్మం కోమలంగా కనిపించేందుకు ప్రకృతి ప్రసాదించిన టమాటో చాలు . తాజాగా ఉన్న టమాటోలను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది, పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగిపోతాయి. పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది. ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని, కాంతిని ఇస్తుంది .
2. ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచూపుతుంది.. దీనికిగాను పైనాపిల్ రసం, యాపిల్ రసం, నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ముడతలు తగ్గిపోతాయి.
3. జిడ్డు ముఖం ఉన్నవారు విచారించానవసరం లేదు... ముఖం మీద గుడ్డు సొనను రాసుకోండి. ముఖం ఎండిన రీతిలో నుంటే పచ్చ సోనను తీసుకొని బాగా గిలకకొట్టి ముఖానికి రాసుకొని 15 నిముషాలు ఉంచి కడుక్కోవాలి . గుడ్డు సోనలు రెండూ చరం మీదుండే రంధ్రాల వెడల్పును తగ్గించి , ముఖకారమం ముడుతలు రాకుండా చూస్తాయి . మడుతలు తగ్గిస్తాయి.
4. ముఖంలో వెలుగు నింపడం కోసం ... గులాబి రంగు కోసం కాళ్ళు కొంచం ఎత్తులో ఉన్నాట్లు పడుకోవాలి ... ఇలా చేయడం వలన మెడకు , ముఖానికి ,తలకి రక్తం సరఫరా ఎక్కువై గులాబీ రంగు ఛాయా ముఖంపై వెలుగుతుంది.
5. అందానికి పండ్లు బాగా పనిచేస్తాయి: ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖం చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం బిగుతుగాను, కాంతి వంతంగాను ఉంటుంది.
6. ముఖం తజాదనానికి: తాజా మీగడను ముఖం మీద నెమ్మదిగా మర్ధనచేయాలి సుమారు పదిహేను నిముషాలు చేసి కడుగుకోవాలి. ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి తాజాదనం వస్తుంది.
7. అందానానికి ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది: అందం కోసం ఎన్ని రకాల భాహ్య సాధనాలు వాడినా అసలు అందం శరీర ఆరోగ్యం ద్వారానే వస్తుంది . ఆకుకూరలు, పండ్లు, పాలు, వరి, గోధుమ మున్నగు వాటితో సంపూర్ణ ఆహారము తినాలి. యాంటి ఆక్సిడెంట్స్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. క్యారట్స్, గుడ్లు, పాలు, చేపలు మున్నగునవి.
8. అందానికి మరో ముఖ్య పాత్ర నిద్ర: ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబందం ఉన్నది. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి. అందవిహీనంగా కనిపిస్తాయి. నిద్రలో అనేక శరీర కణాలు పునరిత్తేజింపబడుతాయి. ఆ క్రమంలో కొత్తకనాలు తయారవుతాయి. కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి.



Click it and Unblock the Notifications