For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లమచ్చలు- మృతకణాల పనిపట్టే బనానా ఫేషియల్ స్టీమ్

|

చూడగానే ఆకట్టుకునే రూపాన్ని అందరూ కోరుకుంటారు. మనిషిని చూడగానే ముందు గా ఆకట్టుకునేది ముఖం. దీనిని తాజాగా, అందంగా ఉంచు కోవడానికి రకరకాల క్రీములు ఇప్పుడు మార్కె ట్‌లో లభ్యమవుతున్నాయి, ప్రకృతి సిద్ధంగా లభించే మూలికలతో లభించే క్రీములు బోలెడు వున్నాయి. మూలికలతో పాటు ప్రకృతి మనకు ఇచ్చిన వరం పళ్ళు. ఫేస్‌ప్యాక్‌లకి, ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగ పడతాయి, వాటిలోఅరటిపండుతో ఫేషియల్‌ ముఖ వర్ఛస్సును రెట్టింపు చేస్తుంది. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుకుని అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమి షాల పాటు అలానే వుంచుకోవాలి. ఒకవేళ జిడ్డు చర్మం అయినా ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఫేషియల్‌ స్టీమ్‌ తీసుకో వాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారు తుంది.

Banana Facial Steam for Smooth Skin..!

ఇప్పుడు అరటిపండు తోక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించాలి. మృత కణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్‌ (మసాజ్‌ క్రీమ్‌ ) కలిపి మృదువుగా పది నుంచి పది హేను నిమిషాల పాటు మసా జ్‌ చేయాలి.పోషక విలువ లున్న వీటి వలన ఎండిపోయినట్టు వున్న చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి, మెడకి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఆ తరు వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచు కుంటే ముఖం అందంగా కనబడుతుంది. చౌకైన ఫేషియల్‌ ఇంట్లోనే అయిపోతుంది.

ముఖంపైన నల్లటి మచ్చలు, చారలు ఉండేవారు, జిడ్డు చర్మ తత్వం కలిగినవారు "బనానా ఫేషియల్ స్టీమ్" చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకోవడానికి ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత అరటిపండు గుజ్జును ముఖం అంతా సమానంగా పట్టించి, ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆపై రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఫేషియల్ స్టీమ్ తీసుకోవాలి. ఇలా చేయటంవల్ల చర్మం మృదువుగా మారుతుంది.

ఆ తరువాత అరటిపండు తొక్కతో ముఖంపై తేలికగా రుద్దుతూ, చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించాలి. మృతకణాల తొలగింపు తరువాత అరటి, కోకో, బటర్ కలిపి మృదువుగా 10 నుంచి 15 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఇలా చేయటంవల్ల ముఖం నిగారింపు సంతరించుకోవటంతోపాటు మృదువుగా తయారవుతుంది. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే ముఖంపైని నల్లటి చారలు తొలగిపోవటంతోపాటు అందమైన ముఖం మీ సొంతమవుతుంది.

అరటిపండులో న్యూట్రీషియన్‌ విలువలు పుష్కళంగా ఉంటాయి. అందుకే అది ఎండిపోయినట్లు ఉన్న చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా మెత్తగా అయ్యేలా చేస్తుంది. అరటి పాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల పాటు అలాగే వుంచేయాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే ముఖం అందంగా కనపడుతుంది.

English summary

Banana Facial Steam for Smooth Skin..! | మృతకణాల పనిపట్టే బనానా ఫేషియల్ స్టీమ్


 Banana is a great fruit that is available all throughout the year. It is extremely rich in some vital nutrients and vitamins. They also save our skin from the free radicals and hence help stop premature aging.
Story first published: Monday, May 6, 2013, 10:56 [IST]
Desktop Bottom Promotion