Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
చర్మరంగును కాంతివంతంగామార్చే ఫ్రూట్స్&వెజిటేబుల్స్
చాలా వరకూ స్త్రీలు(మరియు కొద్దిమంది పురుషులు)వారి చర్మం అందంగా, ఆకర్షణీయంగా కనబడుటకు ప్రయత్నిస్తుంటారు. అందం అనేది బహిర్గతంగా చర్మం ద్వారానే తెలుపుతుంది. స్కిన్ బ్యూటీ మీరు తీసుకొనే ఆహారం మీద మీ స్కిన్ బ్యూటీ కూడా ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీరు మరింత అందంగా, క్లియర్ స్కిన్ తో కనబడుటకు సాధ్యం అవుతుంది.
ఎటువంటి లోపం లేకుండా , అటువంటి క్లియర్ స్కిన్ పొందడానికి, ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూజన్ అవుతుంటే, అటువంటి వారికోసం ఇక్కడ 10 రకాల ఆహారాలను మీకు అంధిస్తున్నాము. అవి మిమ్మల్ని మరింత అందంగా కనబడేలా చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అందాన్ని మెరుగుపరచిచే ఆ 10 ఆహారాలేంటో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...
ప్రకాశవంతమైన-మెరిసే చర్మం కొరకు బాతింగ్ టిప్స్:క్లిక్ చేయండి

ఆమ్లా(ఉసిరి)
ఆమ్లా రసంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతే కాదు, ఈ కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా మరియు ఎలాస్టిక్ గా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీస్
స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో తేనె మిక్స్ చేసి అవొకాడో లేదా పెరుగును కూడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఒక ఆరోగ్యకరమైన రేడియంట్ స్కిన్ ను అంధిస్తుంది. మరియు ఈ జ్యూసీ రెడ్ ఫ్రూట్ దంతాలను తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు. స్ట్రాబెర్రీస్ లో ఉండే మాలిక్ యాసిడ్ నేచురల్ వైటనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు చర్మంలో సింతసిస్ ప్రోటీన్ మరియు కొల్లాజెన్ఉత్పత్తి, ప్రసరణకు సహాయపడుతుంది . ఇది చర్మంలో నూనె ఏర్పడకుండా కంట్రోల్ చేస్తుంది. అంతే కాదు, చర్మాన్ని కాంతివంతంగా మరియు బెటర్ కాంప్లక్షన్ ను అంధిస్తుంది.

బీట్ రూట్
బీట్ రూట్ లో యాంథాసైయనిన్ మరియు పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మరియు వృద్ధాప్య ఆలస్యం చేస్తుంది. మరియు ముడతలను నివారిస్తుంది. అంతే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి బీట్ రూట్ గొప్పగా సహాయపడుతుంది.

ఆపిల్స్
ఆపిల్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మంలోని ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది, మరియు స్కిన్ సెల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది మరియు వృద్ధాప్య చిహ్నాలను ఆలస్యం చేస్తుంది.

క్యారెట్స్
క్యారెట్ అల్టిమేట్ యాంటీ ఏజింగ్, ముడుతలను ఎదుర్కోవడానికి బూస్ట్ వంటిది. వెజిటేబుల్ విటమిన్ సి ఎక్కువగా అంధించి చర్మానికి రక్షణ కల్పిస్తుంది మరియు చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో అధికంగా ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మార్పుచెందుతుంది. ఇది చర్మ పోషణకు అత్యంత అవసరమైన న్యూట్రీషియన్ .

నిమ్మరసం
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . ఈ నిమ్మరసంను ఇంటర్నల్ గా మరియు ఎక్స్ టర్నల్ గా తీసుకోవడం వల్ల చర్మం మంచి ప్రయోజనం. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ఎటువంటి స్కార్స్ లేకుండా రక్షణ కల్పిస్తుంది. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆకుకూరలు
ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ముఖంలో ముడుతలను నివారిస్తాయి. మరియు వృద్ధాప్యం ఆలస్యం చేస్తుంది. ఇంకా ఆకుకూరలు చర్మ కణాలను బలోపేతం చేస్తాయి మరియు ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మరియు చర్మంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయుటకు సహాయపడుతుంది.

స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొటిమలకు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి మొటిమలను నివారించడానికి మరియు ఒక వేళ ఇప్పటికే మొటిమలతో బాధపడుతున్నట్లైతే వాటిని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
