For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మసంరక్షణ ఉత్పత్తులలో ప్రమాదకరమైన రసాయనాలు

By Super
|

నేడు మార్కెట్ లో "శాశ్వతమైన అందం కోసం రహస్యం" అన్న ప్రకటనలతో వివిధ చర్మ సంరక్షణ ఉత్పత్తులు హాట్ కేకుల్లాగా విక్రయిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడూ కంపెనీలు ఇస్తున్న ప్రకటనలు నిజమైనవా లేదా కేవలం ఒక మార్కెటింగ్ మాయా అన్న విషయం గురించి ఆలోచించారా? ఏ కంపెని అయినా ఏదైనా ఒక ఉత్పత్తిని మార్కెట్ లో విడుదల చేస్తున్నప్పుడు దానిని తయారుచేయటానికి ఉపయోగించిన రసాయనాల గురించి కాని మరియు దాని సామర్థ్య దుష్ప్రభావాల గురించి కాని వినియోగదారులకు చెప్పగలుగుతున్నారా?

దురదృష్టవశాత్తు సమాధానం లేదు అనే చెప్పాలి. కావున తుది వినియోగదారుడిగా గుడ్డిగా ఉపయోగించకుండా వాటిని ఒకటికి రెండుసార్లు దాని తయారీకి వాడిన రసాయన సమ్మేళనాన్ని సరిచూచుకోవటం మీ బాధ్యత.. మరియు ఇది కేవలం మేకప్ ఉత్పత్తులలోనే కాదు, టూత్ పేస్టులలో, పరిమళాలు, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు, క్రీములు, లోషన్లు, ఒకటేమిటి! మీరు రోజువారీ ఉపయోగించే అన్ని ఉత్పత్తులను సరిచూసుకోండి. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం మరియు వాటివల్ల మీ ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకి ముప్పు ఎలా సంభవిస్తుందో తెలుసుకుందాం.

మితైలిజోథియాజోలినోన్

మితైలిజోథియాజోలినోన్

సాధారణంగా సబ్బులు, క్రిమిసంహాతకాలు, యాంటీమోక్రోబియాల్ సబ్బులు, డిష్ వాషింగ్ సబ్బులు మరియు చేతి వాష్ ద్రవాలు కనిపించే ఈ ఉత్పత్తి నాడీ వ్యవస్థకి ఎనలేని ముప్పు వాటిల్లచేస్తుంది. ఈ ఉత్పత్తులు తయారీ కంపెనీలు, తమ బలమైన ప్రకటనల ద్వారా ప్రజలు ఈ ఉత్పత్తులు ఉపయోగించటం వలన వారు ఏ బాక్టీరియా, సూక్ష్మజీవులు మరియు వైరల్ దాడికి గురికారని నమ్మిస్టారు.. వారు పరిసరాలు అనారోగ్యకరంగా ఉన్నట్లుగా సృష్టిస్టారు, అందువలన ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఉత్పత్తుల వినియోగం అవసరం అని చెపుతారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచే క్రమంలో మీరు అనుకోకుండా బ్యాక్టీరియా నిరోధక మరకలు అనే పర్యావరణాన్నిసృష్టిస్తూనే ఉన్నారు. ఈ అల్జీమర్స్, శక్తివంతమైన, హానికరమైన బాక్టీరియా, తీవ్రమైన నాడీ రుగ్మతలు పెరిగేందుకు దోహదపడతాయి

సోడియం లారిల్ సల్ఫేట్

సోడియం లారిల్ సల్ఫేట్

సోడియం లారిల్ సల్ఫేట్, దీనిని ప్రతి పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఇది ఒక తరళీకరణం, తలతన్యతను తగ్గించు గుణం లేదా ఒక జిడ్డును తగ్గించే విధంగా పనిచేస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక ఫోమింగ్ ఏజెంట్ మరియుకార్సినోజెనిక్ అంటే దీనిని మళ్లీమళ్లీ ఉపయోగించటం వలన శరీరంలో క్యాన్సర్ వృద్ధికి కారణం కావచ్చు. దీనిని ఉపయోగించటం వలన ప్రభావం శరీరం పైపైనే ఉండదు, కాని దీనిని శరీరం పీల్చుకుంటుంది మరియు అవయవాలలో నిల్వ ఉంటుంది ,అందువలన దీని వినియోగం SLS ముప్పుకు ప్రధాన కారణమవుతుంది. దురదృష్టవశాత్తు ఇది అన్ని మీ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఉంటుంది. ఒకటేమిటి! టూత్ పేస్టులలో, సబ్బులు, డిటర్జెంట్లు, క్లేన్జర్స్, షేవింగ్ క్రీములు ------.

మెర్క్యురీ

మెర్క్యురీ

ఇది ప్రకృతిలో కేన్సరు కారకమైన రసాయనం అని నిరూపించబడినది. మీరు లిప్స్టిక్ అనే ఒక కధనాన్నితప్పనిసరిగా వినే ఉంటారు."దీర్ఘకాలిక" లిప్స్టిక్లు, దీనిని మీరు ఒకసారి వేసుకుంటే అది చాలా కాలం అలానే ఉంటుంది. చాలా కాలం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? దీనికి సమాధానం దీనిలో మెర్క్యురీ పదార్ధం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అవును, పాదరసం. అయితే మీరు తెలియకుండానే పాదరసం మీ పెదవులకి అతికించుకుంటున్నారు. పాదరసం చర్మం ద్వారా గ్రహించబడుతుంది మరియు ఇది ప్రకృతిలో అత్యంత విషపూరితమైనది. ఇది క్యాన్సర్ కారకం మాత్రమే కాదు, దీనివలన చాలా అలెర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి.. మీరు బ్రాండ్ పేర్లతో చూసి తెచ్చుకోకండి, అవేవి హానికారకాలు కావని మాత్రం ఆలోచించకండి. ప్రపంచంలో అతిపెద్ద బ్రాండులు మానవాళి గురించి ఆలోచించి తీవ్రమైన ముప్పు కలిగించే రసాయనాలు ఉపయోగించదు అని మాత్రం తలచకండి.

బొగ్గు తారు

బొగ్గు తారు

ఈ రసాయనాన్ని సాధారణంగా చుండ్రు మరియు సోరియాసిస్ చికిత్స కోసం ఉపయోగించే ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. దీనిని దురద మరియు తామర చికిత్సకు కూడా ఉపయోగిస్తారు బొగ్గు తారును కార్సినోజెన్ అని కూడా పిలుస్తారు. దీనిని చర్మం పీల్చుకుని శరీరంలో జమ అవుతుంది మరియు భవిష్యత్తులో దీనివలన చాలా భయంకరమైన పరిణామాలిని ఎడుర్కొవలిసి ఉంటుంది. ఇది కళ్లు, ముక్కు, గొంతు మరియు చర్మం వంటి భాగాలకు చికాకు కలిగిస్తుంది మరియు వివిధ శాశ్వత అలెర్జీలకు కారణం కావచ్చు. ఇటువంటి హానికరమైన లక్షణం ఉన్నందువలన అన్ని EU సౌందర్యసాధనాలలో ఈ రసాయనవాడకాన్ని నిషేధించారు అన్న నిజాన్ని అర్ధం చేసుకోవచ్చు.

పారబెన్

పారబెన్

ఇది ప్రధానంగా ఒక సంరక్షణకారిణి. దీనిని అనేక చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్టారు. షాంపూలు, మాయిశ్చరైజర్లు, టూత్ పేస్టులలో, కందెనలు వంటి వాటిలో మీరు దీని వాడకాన్ని చూడవొచ్చు. ఈ ఉత్పత్తి స్కానర్ కిందకు రావటానికి కారణం ఏమిటంటే దీనిలో కాన్సర్ కారకలక్షణాలు ఉన్నాయి మరియు రొమ్ము క్యాన్సర్ కణితి కలిగి ఉన్న రోగులలో దీనిని కనుగొన్నారు. ఇది కూడా రొమ్ము క్యాన్సర్ కలిగిస్తుంది మరియు రొమ్ము క్యాన్సర్ను కలిగించే హార్మోన్ తరహాలోనే ఇది ప్రవర్తిస్తుంది.

English summary

Dangerous Chemicals in Skin Care Products

Today the market is flooded with various skin care products that claim to be the “secret for eternal beauty” and are selling like hot cakes too. But have you ever wondered whether the claims made by the companies are actually true or just a marketing gimmick?
Story first published: Wednesday, October 1, 2014, 15:11 [IST]
Desktop Bottom Promotion