For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఫ్రెష్ అండ్ యుత్ ఫుల్ స్కిన్ పొందాలంటే ఈ ఫుడ్ తినండి

  By Sindhu
  |

  సాధారణం ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహార పదార్థాలను బట్టే మన వ్యక్తిత్వం నిర్ధేశించబడుతుంది అనడంలో సందేహం లేదు, జ్ఞాపక శక్తి మెరుగుపడాలన్నా, మానసిక ఒత్తిడులు తట్టుకోవాలన్నా, జీవితంలో ఎదుర్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా కావలసింది ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం.

  ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. రోజవారి జీవితంలో ఎదుర్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడుతలు పడి, నిర్జీవంగా తయారవుతుంది. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది.

  చర్మం కాంతివంతంగా ముడుతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఈ సారి మీరు ఇంటికి కావలసిన స్టేషనరీ తెచ్చుకొనేటప్పుడు ఇవి తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడండి...

  పెరుగు

  పెరుగు

  పెరుగు లో విటమిన్ సి మరియు మిక్క్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం మరియు ప్రోటీన్స్ కలిగిన ఈ డైరీప్రొడక్ట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.

  సాల్మన్ ఫిష్

  సాల్మన్ ఫిష్

  సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. మరియు మరో కోల్డ్ వాటర్ ఫిష్, ఇవి చర్మానికి వైద్యపరమైన లక్షణాలను కలిగిస్తాయి.

  గుడ్డులోని పచ్చసొన

  గుడ్డులోని పచ్చసొన

  గుడ్డులోని పచ్చసొన పుష్కలమైన జింక్ మరియు సెలీనియం కలిగి ఉంటుంది. ఇది స్కిన్ సెల్ పునరుద్దరణ ప్రక్రియకు బాగా సహాయపడుతాయి. కానీ అధికంగా గుడ్డు తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి, స్కిన్ పగలడానికి కారణం కావచ్చు. కాబట్టి, రోజులో రెండు గుడ్లకు మించి తినకూడదు.

  క్యారెట్స్

  క్యారెట్స్

  క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని మర్మత్తు చేస్తుంది. మీకు చాలా సున్నితమైన చర్మం ఉంటే, క్యారెట్ చర్మ సమస్యలన్నింటిని నివారిస్తుంది . క్యారెట్ ను పచ్చిగా అలాగే తినడం లేదా క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మీ చర్మం తేమగా, సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారువుతుంది.

  ప్రకృతి ప్రసాదితాలు పళ్లు-కూరలు

  ప్రకృతి ప్రసాదితాలు పళ్లు-కూరలు

  క్యాబేజీ, బ్రొకొలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్‌ ఇవన్నీ విటమిన్లు సమృద్ధిగా గల కూరగాయలు. విటమిన్‌ ఎ, సిలు కంటి చూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి. కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం.

  టమాటా:

  టమాటా:

  అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ', 'ఇ' విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్‌ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

  నీళ్లు-పళ్లరసాలు

  నీళ్లు-పళ్లరసాలు

  శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరుతాగితే అంత మంచిది. ఒకటి, రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరెంజ్‌, బత్తాయి, నిమ్మరసం మంచిది. కొబ్బరి నీళ్లలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం.

  నిమ్మరసం

  నిమ్మరసం

  ఇది చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ దీని మేలు అంతా ఇంతా కాదు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో దీన్ని మించింది లేదు. కాబట్టి దీని ప్రయోగజనం చాలానే ఉంటుంది. నిమ్మరసం ఉపయోగించి చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. మొటిమలు మచ్చలను వదలగొడుతుంది. ముఖ చర్మాన్ని శుభ్రం చేసి ఫ్రెష్ మెరుస్తుండేలా చేస్తుంది. కాబట్టి నిమ్మరసంను వేరే ఇతర పదార్థాలు ఉపయోగించకుండా డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేసి కొద్ది నిమిషాల్లోనే శుభ్రం చేసేసుకోవాలి.

  మృదువైన సున్నితమైన చర్మానికి తేనె తేనెను ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయ్యొచ్చు.

  మృదువైన సున్నితమైన చర్మానికి తేనె తేనెను ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయ్యొచ్చు.

  చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే తేనెను ఉపయోగించడం వల్ల ముఖం మీద ఏర్పడం మచ్చలను తొలగించి, చర్మంలో ఏదేని ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగిపోతుంది. అంతేకాదు ఇది మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. తేనె ముఖానికి బాగా పట్టించి ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి. అంతే కాదు తేనెతో ఫేస్ ప్యాక్ ను అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. రెండు టీ స్సూన్ల తేనెలో ఒక టీస్పూన్ నిమ్మరసం చేర్చి బాగామిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.

  గ్రీన్ టీ

  గ్రీన్ టీ

  మరో యాంటిఆక్సిండెంట్ గ్రీన్ టీ. ఇది కావల్సిన శక్తిని ఇస్తుంది. మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది కూడా వయస్సు పైబడనీయకుండా ఉంచే వాటిలో ఒక అద్భుతమైనటువంటిదే.

  ఆపిల్స్

  ఆపిల్స్

  ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒకపూట కనీసం ఒక యాపిల్ అయినా తినాలి. ఆపిల్ లో ఉండే సి విటమిన్ చర్మంలోని ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.

  ఆరెంజ్

  ఆరెంజ్

  వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఆరెంజ్ ను కట్ చేసి అలాగే ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం స్పష్టంగా కనబడేలా చేస్తుంది.

  బొప్పాయి

  బొప్పాయి

  బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా కలిగి ఉండటం చేత మృత కణాలను వదలగొడుతుంది. బొప్పాయి పాలు లేదా బొప్పాయను ముఖానికి అప్లై చేడంవల్ల చర్మంలో అద్భతమైన మార్పులను మీరు గమనించవచ్చు.

  స్ట్రాబెర్రీస్

  స్ట్రాబెర్రీస్

  చర్మంలో దుమ్ము ధూళి శుభ్రపరిచే స్ట్రాబెర్రీస్ ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో పేరుకొన్న దుమ్ము ధూళిని శుభ్రపరిచి ఎటువంటి వంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుతుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి యాంటి యాక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వీటిని డైరెక్ట గా ముఖం మీద స్ర్కబ్ చేయవచ్చు. లేదా ముక్కలుగా కట్ చేసి ముఖం మీద అలాగే పెట్టుకోవచ్చు. స్ట్రాబెరీ చాలా మెత్తగా ఉడంటం వల్ల స్మూత్ మాస్క్ లా ఉపయోగపడుతుంది. అలాగే బ్లూబెర్రీన్ పెరుగు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత ముఖంలో కనబడే గ్లో మీరు గమనించవచ్చు.

  English summary

  Top 14 Eating Foods for Your Fresh and Youthful skin

  If you want to get white skin naturally, without applying chemical based creams or face packs, include these healthy skin-friendly foods in your diet. This list includes vitamin A, C and nutrient rich foods that are good for the skin. Have these foods and exclude processed and oily foods as they affect your complexion and also leads to acne and pimples.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more