For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలోని మృతకణాలను తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...!!

By Super Admin
|

శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. చర్మంలో తరచూ మృతకణాలు ఏర్పడుతుంటాయి. డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడినా,వీటిని తొలగించడం వల్ల చర్మంలోపలి లేయర్ గా కొత్త కణాలు తిరిగి ఉత్పత్తి అవుతాయి. మృతకణాలను ఎప్పకటిప్పుడు తొలగించుకోవడం వల్ల చర్మం యంగ్ గా మరియు స్మూత్ రేడియంట్ గా తయారవుతుంది.

వయస్సు పెరిగే కొద్ది, ఈ స్కిన్ సైకిల్ తగ్గుముఖం పడుతుంది. దాంతో తిరిగి చర్మం మీద డెడ్ స్కిన్ సెల్స్ పెరగడం ప్రారంభమవుతుంది. మృతకణాలు ఏర్పడటం వల్ల చర్మం చూడటానికి నిర్జీవంగా మరియు డల్ గా కనిపిస్తుంది. ఎక్కువ ఫైన్ లైన్స్ కనిపిస్తాయి . చర్మ శుభ్రం చేసుకోవడానికి రోజూ స్నానం చేసుకుంటే సరిపోదు. వారంలో ఒకసారి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల చర్మం లోపలి నుండి శుభ్రం చేసి చర్మం సాప్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది.

కొన్ని మాయిశ్చరైజర్స్ చర్మం శుభ్రం చేయడంలో లోపలి వరకూ పనిచేసి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. ఎక్స్ ఫ్లోయేషన్ ఆయిల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ , డ్రైస్కిన్ ఇలా అన్ని రకాల చర్మ తత్వాలకు పనిచేస్తుంది . స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ కొరకు కెమికల్ క్రీములు ఉపయోగించాల్సిన పనిలేదు. మీ వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలను ఉపయోగిస్తే చాలు, మృత కణాలను ఎఫెక్టివ్ గా తొలగంచుకోవచ్చు...

 ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. చర్మంలో మృతకణాలను, అదనపు సెబమ్ ను తొలగిస్తుంది. చర్మం శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్ మినిరల్స్ చర్మానికి మేలు చేస్తాయి, ప్రోటీన్స్ చర్మంలో తేమ తగ్గిపోకుండా మాయిశ్చరైజ్ గా సహాయపడుతాయి. తేనె, పెరుగు, ఓల్ మీల్ సౌడర్ సమయంగా తీసుకుని పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లైచేయాలి.

షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ :

షుగర్ మరియు ఆలివ్ ఆయిల్ :

పంచదార మరియు ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ మృతకణాలను తొలగించడంలో గ్రేట్ స్కిన్ స్క్రబ్. పంచదార స్పటికలు స్ర్కబ్బర్ గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. . ఈ స్క్రబ్ ను శరీరం మొత్తం అప్లై చేసుకోవచ్చు. అరకప్పు పంచదారలో 3 చెంచాల ఆలివ్ ఆయిల్ , 3 చెంచాల తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత సర్కులర్ మోషన్ లో మర్ధన చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అంతే కాదు మృతకణాలను తొలగిండచంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గ్రేట్ హోం మేడ్ స్ర్కబ్. గ్రీన్ టీ లీఫ్ ను నీటిలో వేసి మరిగించి ముఖానికి అప్లై చేయడం వల్ల మృతకణాలు, చర్మంలోని మురికి, మలినాలు తొలగిపోతాయి. ముఖ్యంగా , గ్రీన్ టీ స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది, స్కిన్ ఎలాసిటి పెంచుతుంది . చర్మం హెల్తీగా మార్చుతుంది. గ్రీన్ టీలో కొద్దిగా తేనె , చిటికెడు బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ లా చేయాలి. తర్వాత ముఖం అంతా పట్టించి 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

కాఫీ:

కాఫీ:

డెడ్ స్కిన్ తొలగించడంలో కాఫీ మంచి ఎక్స్ ఫ్లోయేటర్. రఫ్ గా ఉండే కాఫీ పౌడర్ బాడీ స్ర్కబ్బర్ గా పనిచేస్తుంది. కొత్తకణాలను ఏర్పాటుకు సహాయపడుతుంది. కాఫీ పొడిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది, స్కిన్ డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది. 3 చెంచాల కాఫీ పొడిలో, 1 చెంచడా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేసి తేనె, కొద్దిగా మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి, ముఖానికి ,మెడ,మోచేతులు, మోకాళ్ళు కు అప్లై చేసి బాగా మర్ధన చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ స్ర్కబ్ ను వారానికొకసారి ఉపయోగించాలి.

బాదం:

బాదం:

చర్మానికి ఇది గ్రేట్ రెమెడీ. ఇందులో విటమిన్ ఎ మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి, వీటిలో ఉండే హెల్తీ ఫ్యాట్ హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. 5బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేసి 10 నిముషాలు మర్ధన చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2,3 సార్లు ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి, అందులో పెరుగు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ముఖానికి పట్టించడంలో చర్మంలోని మృతకణాలు, మురికి తొలగిపోతుంది. ఇందులో ఉండే విటిమిన్ సి, మరియు యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి కాంతిని చేకూర్చుతుంది. చర్మం యంగ్ గా మరియు వైబ్రాంట్ గా మార్చుతుంది. ఈప్యాక్ ను వారంలో ఒక సారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

శెనగపిండి:

శెనగపిండి:

శెనగపిండి మరో ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. ఇది మృతకణాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం మెరుస్తుంటుంది. చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ తొలగిస్తుంది, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల శెనగపిండిలో 3 చెంచాలా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను 10 నిముషాల తర్వాత మర్ధన చేసి, శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

7 Home Remedies to Get Rid of Dead Skin Cells

7 Exfoliation is necessary for all the skin types, whether oily, sensitive or dry. It should be done on the face as well as elbows, knees, feet and other areas that tend to become dull and dark. There is no need to use chemical-based cleansing products to exfoliate your skin. There are many natural ingredients in your kitchen that can help remove the dead skin cells and give way to fresh and clear skin.
Desktop Bottom Promotion